Bigg Boss 8: అదే నా ధైర్యం అంటున్న బేబీ ఫేమ్ కిరాక్ సీత.. కష్టాల కడలిని ఈదుకుంటూ..?

Bigg Boss 8.. కిర్రాక్ సీత (Kiraak Sita).. ఈ పేరు గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఎందుకంటే ఇటీవలే సాయి రాజేష్ దర్శకత్వంలో ప్రముఖ యూట్యూబర్ వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) హీరోయిన్ గా, విజయ్ దేవరకొండ (Vijay devarakonda) తమ్ముడు ఆనంద్ దేవరకొండ (Anand deverakonda)హీరోగా వీరాజ్ అశ్విన్ (Viraj ashwin)సెకండ్ హీరోయిన్ గా వచ్చిన చిత్రం బేబీ (Baby). ఈ సినిమాలో సీత క్యారెక్టర్ లోనే నటించి అందరిని అబ్బురపరిచింది. అంతేకాదు ఈ క్యారెక్టర్ తర్వాత ఆమెను చాలా మంది ప్రజలు విమర్శించారు కూడా. ఎందుకంటే నెగటివ్ గా ఈ సినిమాలో సీత నటించినా.. కానీ ఆమె క్యారెక్టర్ అది కాకపోయినా అదే ఆమె క్యారెక్టర్ అంటూ చాలామంది ఆమెను నిందించారు అబ్యూస్ చేశారు. అంతేకాదు తన తల్లిదండ్రులను కూడా ట్రోల్ చేశారు. అయినా సరే వెనుకడుగు వేయలేదు. ప్రతి పాత్ర చాలా పోటీగా తీసుకొని తన నటనతో అందరిని ఆశ్చర్యపరుస్తూ ముందుకు వెళ్తోంది కిర్రాక్ సీత.

Bigg Boss 8: Baby fame Kiraak Sita who says that's my courage..!
Bigg Boss 8: Baby fame Kiraak Sita who says that’s my courage..!

ఇకపోతే తాజాగా బిగ్ బాస్ సీజన్ 8 లోకి 9వ కంటెస్టెంట్ గా అడుగుపెట్టింది. ఇకపోతే ఈమె గురించి పలు విషయాలు వైరల్ గా మారుతున్నాయి. గతంలో యూట్యూబర్ సరయుతో కలిసి పనిచేసిన ఈమె ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ అక్కడి నుండి బయటకు వచ్చేసింది. బోల్డ్ గా మాట్లాడి ఈమెకు మందు తాగే అలవాటు కూడా ఉంది. గతంలో ఒక వ్యక్తిని గాఢంగా ప్రేమించిన ఈమె ఆ ప్రేమను పెళ్లి వరకు తీసుకురాలేదు. మధ్యలోనే బ్రేకప్ చెప్పుకున్నారు. పొట్టిగా ఉన్నారంటూ ఆమెను ఎంతోమంది హేళన చేశారట.

సినిమాలలోకి వస్తానంటే పొట్టిగా ఉన్నావ్ ,అసలు నీకు అవకాశాలు ఎవరు ఇస్తారు అంటూ చాలామంది హేళన చేస్తూ.. నీచంగా మాట్లాడారు అంటూ తన బాధను స్టేజ్ పై నాగార్జునతో పంచుకుంది సీత. అయితే వారి మాటలే తనను మరింత దృఢంగా మార్చాయని చెబుతోంది. తనకు కేరింగ్ ఎక్కువ అని, కాన్ఫిడెంట్ మరింత ఎక్కువగా ఉంటుందని, రెస్పాన్సిబుల్గా ఉంటానని చెబుతోంది కిర్రాక్ సీత.. ఇక ఎప్పుడు బోల్డ్ గా మాట్లాడుతూ రఫ్ అండ్ టఫ్ గా కనిపించే ఈ ముద్దుగుమ్మ హౌస్ లో ఎలా అందరితో కలగలసిపోతుందో చూడాలి.

- Advertisement -

కిర్రాక్ సీత బ్యాక్ గ్రౌండ్..

సీత రాయలసీమకు చెందిన అమ్మాయి.ఈమె నాన్న ఒక ప్రభుత్వ ఉద్యోగి. నంద్యాలలో పుట్టి పెరిగిన సీత, ఆ తర్వాత హైదరాబాద్ ఉప్పల్ ప్రాంతంలో స్థిరపడిపోయింది. 17 ఏళ్ల వయసు నుంచి తల్లిదండ్రులపై ఆధారపడకుండా ట్యూషన్స్ చెబుతూ డబ్బు సంపాదించేది. సినిమాల్లోకి వెళ్లాలని డిసైడ్ అయినప్పుడు ఎన్నో కష్టాలు పడింది. యూట్యూబ్ లో బోల్డ్ గా కనిపించే సీతా రియల్ లైఫ్ లో అలా కాదు . ఒక ప్రొడ్యూసర్ తనతో గడిపితే రూ.10లక్షల ఇస్తానని ఆఫర్ కూడా ఇచ్చారట. అలాంటి చెడు నిర్ణయాలు తీసుకోకుండా ఆ నిర్మాతకు లొంగలేదు. ఇక సీతకి కూచిపూడి, భరతనాట్యంలో కూడా మంచి ప్రావీణ్యం ఉంది. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన ఈమె తనను తాను నిరూపించుకుంటానని చెబుతోంది. మరి ఎలా తాను ఒక స్ట్రాంగ్ పర్సన్ అని నిరూపించుకుంటుందో చూడాలి.

 

View this post on Instagram

 

A post shared by Seetha🦋🇮🇳 (@kirrakseetha)

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు