Bigg Boss 8 Buzz.. బిగ్ బాస్ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న సీజన్ 8 సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలోనే బజ్ కూడా ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. బిగ్ బాస్ బజ్ సీజన్ 8 లో ప్రేక్షకులను మెప్పించలేని వారు ఎలిమినేట్ అయితే బజ్ లోకి వచ్చేస్తారు. ఈ సీట్ యమ హాట్ గురూ అంటూ ఒక ప్రోమో విడుదలయ్యింది. ఇకపోతే బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో హౌస్ లోకి ఎవరు వెళ్తారు అన్నది మాత్రం ఇంకా కన్ఫామ్ అవ్వలేదు.
బిగ్ బాస్ సీజన్ 8 బజ్ ప్రోమో..
ఇప్పటికే చాలామంది పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కానీ ఎవరు హౌస్ లోకి వెళ్తారు అన్న విషయంపై క్లారిటీ రాలేదు. ఇప్పటికే చాలామంది మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ బిగ్ బాస్ బజ్ కు హోస్ట్ గా చేశారు. అక్కడ తమ ఆట గురించి హౌస్ లో జరిగిన విషయాల గురించి ఎలిమినేట్ ఆవాసానికి కారణాలు ఇలా ఎన్నో విషయాలు పంచుకుంటారు. అయితే ఈసారి బిగ్ బాస్ సీజన్ 8 కి ఎవరు హోస్ట్ గా చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటి వరకు శివాజీ, శోభా శెట్టి , ప్రియాంక ఇలా కొంతమంది పేర్లు తెరపైకి వచ్చాయి.
బిగ్ బాస్ బజ్ కి హోస్ట్ గా అర్జున్..
కానీ ఇప్పుడు దీనిపై క్లారిటీ ఇస్తూ.. ఒక ప్రోమో ను విడుదల చేశారు. ఈసారి బిగ్ బాస్ బజ్ కి హోస్టుగా అర్జున్ అంబటి (Arjun Ambati)ఉండనున్నారు. టైం బాగుంటే, సంతోషం.. లేకపోతే సంకోచం.. టైం బాగుంటే మనం ఏం చేసినా సరే ఒప్పు.. అలా టైం బాగున్న కొంతమంది బిగ్ బాస్ హౌస్ కి వెళ్తారు. మరి వాళ్ళ టైం బ్యాడ్ అయితే బిగ్ బాస్ బజ్లోకి వస్తారు. ముఖ్యంగా మీరు లోపల తీసుకున్న నిర్ణయాలకు ఇక్కడ సమాధానం చెప్పి తీరాలి గుర్తుంచుకోండి. ఈ సీట్ యమ హాట్ అంటూ డైలాగ్ తో అర్జున్ ప్రోమో ను విడుదల చేశారు .మరి ఈసారి బిగ్ బాస్ బజ్ ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.
బిగ్ బాస్ సీజన్ 7 లో సత్తా చాటిన అర్జున్..
ఇకపోతే బిగ్ బాస్ సీజన్ 7 లో అర్జున్ అంబటి తన పర్ఫామెన్స్ తో అందరినీ ఆకట్టుకున్నారు. తన ఆట తీరుతో మెస్మరైజ్ చేశారు. అందరూ బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అవుతారని అనుకున్నారు. కానీ అనూహ్యంగా హౌస్ నుంచి ఎలిమినేట్ అవ్వడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఇకపోతే ఈయన హౌస్ లో ఉన్నప్పుడు తన భార్య గర్భవతి కావడంతో ఆయనను ఎక్కువ కాలం హౌస్ లో ఉంచలేదు అనే వార్తలు కూడా వినిపించాయి. ఏదిఏమైనా ఇప్పుడు మళ్లీ బజ్ తో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమయ్యారు.