Bigg Boss 8: హౌస్ లోకి చిరంజీవి ఫ్రెండ్.. ప్లాన్ మొత్తం రివర్స్..!

Bigg Boss 8.. తెలుగులో ఏడు సీజన్లను దిగ్విజయంగా పూర్తి చేసుకున్న రియాల్టీ షో బిగ్ బాస్. ఇప్పుడు 8వ సీజన్ కి సిద్ధం అవుతోంది.ఈ నేపథ్యంలోనే ఈ షోకి సంబంధించిన కొన్ని విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. ఈ మేరకు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం , బిగ్ బాస్ హౌస్ లోకి మెగాస్టార్ చిరంజీవి స్నేహితుడు రాబోతున్నాడు అంటూ ఒక వార్త నెట్టింట హల్చల్ చేస్తోంది.

Bigg Boss 8: Chiranjeevi's friend enters the house.. The whole plan reverses..!
Bigg Boss 8: Chiranjeevi’s friend enters the house.. The whole plan reverses..!

సీజన్ 8 కి సర్వం సిద్ధం..

బిగ్ బాస్ సీజన్ 7 పూర్తి అయిన వెంటనే సీజన్ 8 గురించి ఆలోచనలు మొదలుపెట్టారు అభిమానులు ఈసారి హోస్టింగ్ నాగార్జునే చేస్తారా? లేక మరెవరినైనా తీసుకొస్తారా.? కంటెస్టెంట్స్ ఎవరు? షో ఎలా ఉండబోతోంది ? అసలు ఈసారి కాన్సెప్ట్ ఏంటి..? ఇలా ఎన్నో ప్రశ్నలు అభిమానులను కలచి వేస్తున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా జూలై 21వ తేదీన బిగ్ బాస్ సీజన్ 8 ప్రోమో లాంచ్ చేశారు. అధికారిక ట్విట్టర్ ఖాతా నుంచి పోస్ట్ చేయడమే కాదు అన్ లిమిటెడ్ వినోదం పంచడానికి మళ్లీ వస్తున్నాం అంటూ కామెంట్ కూడా జోడించారు.

ప్రోమో తో మొత్తం రివీల్

ఇక ఈ ప్రోమో చూస్తే ఈసారి కూడా బిగ్ బాస్ హోస్టింగ్ బాధ్యతలు నాగార్జున తీసుకున్నట్లు తెలుస్తోంది. వరుసగా ఆయన ఆరోసారి ఈ సీజన్ కి హోస్ట్ గా చేయబోతున్నారు. ఇకపోతే ఈ ప్రోమో చూసిన తర్వాత లోగో చూసిన తర్వాత బిగ్బాస్ రివ్యూయర్స్ కూడా అంచనాలు వేస్తున్నారు. సీజన్ 8 డిజైన్ ఎలా ఉంటుందని మైండ్ బ్లోయింగ్ డీటెయిల్స్ కూడా రివీల్ చేస్తూ ఉండడం గమనార్హం. ఇకపోతే ఈసారి బిగ్ బాస్ హౌస్ లో రెండు హౌస్ లు ఉంటాయట. ఒకటి మెయిన్ హౌస్, రెండవది లూప్ హౌస్. మెయిన్ హౌస్ లోకి రావాలంటే కంటెస్టెంట్లు కష్టపడాల్సి ఉంటుంది . గేమ్స్, టాస్క్ లతో తమ జర్నీని కన్ఫామ్ చేసుకుంటున్నారు ఇదిలా ఉండగా ఈసారి బిగ్ బాస్ సీజన్ 8 కి సంబంధించిన ఒక వార్త చెక్కర్లు కొడుతోంది.

- Advertisement -

హౌస్ లోకి చిరంజీవి ఫ్రెండ్..

అదేమిటంటే మెగాస్టార్ చిరంజీవి స్నేహితుడు రోహిత్ బిగ్ బాస్ హౌస్ లోకి రాబోతున్నారట.ఇప్పటికే రోహిత్ సిక్టీన్, జానకి వెడ్స్ శ్రీరామ్ వంటి చిత్రాలతో పాటు చిరంజీవి నటించిన సూపర్ హిట్ సినిమా శంకర్ దాదా ఎంబిబిఎస్ లో కూడా చిరంజీవి స్నేహితుడు పాత్ర చేశాడు. 2010 తర్వాత పూర్తిగా వెండితెరకు పూర్తిగా దూరమైన రోహిత్ ఇటీవలే ఒక చిత్రం చేశాడు. ఇక ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 8 లోకి ఎంపికయ్యాడని చెబుతున్నారు నిజంగా రోహిత్ హౌస్ లోకి వస్తే ఎలాంటి సంచలనాలు చేస్తాడని అభిమానులు అప్పుడే ఊహాగానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా మరొకవైపు సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ లకే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మళ్లీ హౌస్ లోకి హీరోలను హీరోయిన్లను తీసుకోబోతుండడంతో ప్లాన్ మొత్తం రివర్స్ అయ్యేలా కనిపిస్తోంది. మరి ఏ మేరకు ఈ హౌస్ లోకి కంటెస్టెంట్ గా ఎవరు అడుగుపెడతారు.? షో ని సక్సెస్ చేస్తారు అన్నది తెలియాల్సి ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు