Bigg Boss 8: బిగ్ బాస్ ఎంట్రీ పై బర్రెలక్క క్లారిటీ..!

Bigg Boss 8.. గడిచిన రెండేళ్ల నుంచి బర్రెలక్క(Barrelakka )పేరు బాగానే వినిపిస్తూ ఉన్నది.. సోషల్ మీడియాలో కూడా ఈమె క్రేజ్ బాగానే ఉంది. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత సోషల్ మీడియా లో రీల్స్ చేస్తూ చదువుకున్నా కూడా ఉద్యోగాలు లేవు, అందుకే బర్రెలు కాచుకుంటున్నా అని ఒక్క వీడియో షేర్ చేయగా, ఒక్కసారిగా శిరీష (Sireesha)కాస్త బర్రెలక్కగా మారిపోయింది. ముఖ్యంగా నిరుద్యోగులకు సంబంధించి ప్రతి విషయాన్ని కూడా లేవనెత్తుతూ ఉండేది. అంతేకాకుండా తెలంగాణలో జరిగిన అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలలో కూడా ఈమె ఇండిపెండెంట్గా పోటీ చేసి ఓడిపోవడం జరిగింది.

Bigg Boss 8: Clarity on Bigg Boss entry..!
Bigg Boss 8: Clarity on Bigg Boss entry..!

బిగ్ బాస్ లోకి బర్రెలక్క..

అప్పటి నుంచి బర్రెలక్క క్రేజ్ కాస్త తగ్గిపోయింది. ఇటీవలే ఈమె వివాహ బంధం లోకి కూడా అడుగుపెట్టింది. ఇలాంటి సమయంలోనే తెలుగులో మంచి పాపులారిటీ సంపాదించుకున్న బిగ్ బాస్ -8 (Bigg Boss 8)కి సంబంధించి కంటిస్టెంట్ల లిస్టులో బర్రెలక్క పేరు ఉందని గట్టిగా ప్రచారం వినిపించింది. ఈ విషయం పైన బర్రెలక్క క్లారిటీ ఇస్తూ.. ఈ మధ్యకాలంలో తనని అక్క మీరు బిగ్ బాస్ హౌస్ లోకి వెళుతున్నారా అని అడుగుతున్నారు.. చాలామంది కూడా తనకు అవకాశం వచ్చిందనే విధంగా రివ్యూస్ , వీడియోలు కూడా చేస్తూ ఉండడంతో చాలామంది స్నేహితులు, కుటుంబ సభ్యులు కూడా అడుగుతున్నారని, అందుకే క్లారిటీ ఇస్తున్నానంటూ తెలిపింది.

బిగ్ బాస్ ఎంట్రీ పై క్లారిటీ..

బిగ్బాస్ కన్సిస్టెంట్ లిస్టులో తన పేరు ఉంది. కానీ తనకు ఫేమ్ తగ్గిపోయిందని తీసుకోవడం అవసరమా అని ఆలోచిస్తున్నట్లుగా ఉన్నారంటూ తెలిపింది బర్రెలక్క. మనిషి ప్రాణమే శాశ్వతం కాదు.. అలాంటిది ఫేమ్ శాశ్వతమా అంటూ తెలియజేసింది. పెద్దపెద్ద స్టార్స్ కే ఫేమ్ తగ్గిపోతోంది.చాలా సినిమాలు థియేటర్లో ఆడడం కష్టంగా మారుతున్నాయి అంటూ తెలిపింది. తనకు బిగ్ బాస్ ఆఫర్ వచ్చినా, రాకున్నా ఎలాంటి ఇబ్బంది లేదని తనని, అభిమానించే స్నేహితులు కుటుంబ సభ్యులకి ఈ విషయం పైన స్పష్టత ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఇలా వీడియో చేయడం జరిగింది అంటూ తెలిపింది బర్రెలక్క.

- Advertisement -

మొత్తానికి అయితే రూమర్స్ కి చెక్..

దీన్ని బట్టి చూస్తే బిగ్ బాస్-8 లోకి ఈమె పాల్గొనడం లేదని, ఆమెను ఎవరు సంప్రదించలేదని ఈమె మాటలను బట్టి చూస్తే మనకి అర్థమవుతుంది. అలాగే బర్రెలక్క తో పాటు చాలామంది సెలెబ్రేటీలు కూడా బిగ్ బాస్ హౌస్ ఎంట్రీ పైన క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరి ఇలాంటి వాటిని కూడా బిగ్ బాస్ ఫుల్ స్టాప్ పెట్టి లిస్టును విడుదల చేస్తారేమో చూడాలి.

సెప్టెంబర్ 1న ప్రారంభం..

ఇక మరొకవైపు తెలుగు బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న బిగ్ బాస్ సీజన్ 8 కి సర్వం సిద్ధమైంది. సెప్టెంబర్ ఒకటవ తేదీన స్టార్ మా చానల్లో సాయంత్రం ఏడు గంటలకు గ్రాండ్ గా లాంచింగ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. ఇక అదే రోజు కంటెస్టెంట్స్ ను కూడా హౌస్ లోకి పంపించనున్నట్లు తెలుస్తోంది. అన్లిమిటెడ్ ఒక్కసారి కమిట్ అయితే లిమిటే లేదు అంటూ ప్రోమోను విడుదల చేశారు. మరి ఈసారి సీజన్ 8 ఎలాంటి టిఆర్పి రేటింగ్ దక్కించుకుంటుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు