Bigg Boss 8: హౌస్ లోకి మహేష్ బాబు బ్యూటీ.. ఊహించలేదుగా..?

Bigg Boss 8.. అతిపెద్ద రియాల్టీ షో బిగ్ బాస్.. సీజన్ 8 కి ముస్తాబ్ అవుతోంది. ఈ సీజన్ కి కూడా కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరించనున్నారు. సీజన్ వన్ కి హోస్ట్ గా ఎన్టీఆర్ వచ్చి షోని భారీ సక్సెస్ చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత రెండవ సీజన్ కి నాని హోస్టుగా చేశారు. అయితే ఎన్టీఆర్ రేంజ్ ను నాని అందుకోలేకపోయారనే వార్త కూడా అప్పట్లో వినిపించింది. ఇక మూడవ సీజన్ నుండి హోస్ట్ గా చేస్తున్నారు నాగార్జున. తనదైన యాంకరింగ్ తో బిగ్ బాస్ ను తన భుజాలపై మోస్తున్నారు. ఇకపోతే ఇప్పుడు సీజన్ 8 ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈసారి హౌస్ లోకి ఎవరు వస్తారు? ఎలాంటి టాస్కులు ఉండబోతున్నాయి? అనే విషయాలు ఆసక్తికరంగా మారాయి.

Bigg Boss 8: Mahesh Babu's beauty in the house.. unexpected..?
Bigg Boss 8: Mahesh Babu’s beauty in the house.. unexpected..?

బిగ్ బాస్ సీజన్ 8 లోకి మహేష్ బాబు బ్యూటీ..

ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ 8లోకి పాల్గొనే వారు వీరే అంటూ కొంతమంది పేర్లను గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు యూట్యూబర్స్. ఇక అందులో భాగంగానే రీతూ చౌదరి , కిర్రాక్ ఆర్పి, వేణు స్వామి, కుమారి ఆంటీ, బర్రెలక్క, బుల్లెట్ భాస్కర్, చమ్మక్ చంద్ర, సురేఖ వాణి, హేమ , అమృత ప్రణయ్ తదితర పేర్లు వినిపిస్తూ ఉండడం గమనార్హం . అయితే ఇప్పుడు వీరంతా హౌస్ లోకి వస్తారో లేదో తెలియదు కానీ ఇప్పుడు మరో ముద్దుగుమ్మ పేరు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆమె ఎవరో కాదు మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం సినిమా బ్యూటీ కుషిత కల్లపు.

బిగ్ బాస్ 8 లోకి కుషిత కల్లపు..

సోషల్ మీడియా ద్వారా భారీ పాపులారిటీ దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ. అప్పట్లో టిక్ టాక్ వీడియోలతో భారీ పాపులారిటీ దక్కించుకుంది. ఆ తర్వాత ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటూ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఇటీవలే మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమాలో ఈ ముద్దుగుమ్మ నటించింది కానీ ఆ సన్నివేశాలను ఎడిటింగ్ లో కట్ చేశారు. ఆ తర్వాత బిగ్ బాస్ ఫేమ్ అర్జున్ హీరోగా నటించిన బాబు అనే సినిమాలో హీరోయిన్ గా చేసింది. ప్రస్తుతం అవకాశాలు లేక ఖాళీగా ఉన్న ఈ బ్యూటీ బిగ్ బాస్ సీజన్ 8లోకి రాబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి ఈ విషయం తెలిసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఈ గ్లామర్ బ్యూటీ హౌస్ లోకి అడుగుపెడితే డబుల్ క్రేజ్ లభించడం ఖాయం అంటూ అప్పుడే ఊహించేస్తున్నారు. మరి కుషితకు నిజంగానే ఆఫర్ వచ్చిందా? ఒకవేళ వస్తే హౌస్ లోకి రావడానికి ఒప్పుకుంటుందా? అనే విషయాలు వైరల్ గా మారుతున్నాయి.. మొత్తానికి అయితే కుషిత కల్లపు బిగ్ బాస్ లోకి వస్తుందా రాదా అన్నది ప్రశ్నార్ధకంగా మారింది. ఇకపోతే మరొకవైపు బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన తర్వాత పూర్తిస్థాయిలో నెగెటివిటీ ఏర్పడుతోందని, అందుకే నిర్వాహకులు కోట్ల రూపాయలు ఆఫర్ చేసినా హౌస్ లోకి రావడానికి చాలామంది సెలబ్రిటీలు వెనకడుగు వేస్తున్నారని సమాచారం . మరి ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని కుషిత ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

 

View this post on Instagram

 

A post shared by dimpleboy⚡ (@arthetic_jpeg)

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు