Bigg boss 8 : పదమూడో కంటెస్టెంట్ గా నైనిక.. అసలు ఈమె బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా..?

Bigg Boss 8: తెలుగు బుల్లితెర ప్రేక్షకులు దాదాపు 6 నెలలకు పైగా ఎదురుచూస్తున్న ఏకైక రియాల్టీ షో బిగ్ బాస్ (Bigg Boss).. ఇప్పటికే 7 సీజన్లను దిగ్విజయంగా పూర్తి చేసుకున్న ఈ షో ఎట్టకేలకు ఎనిమిదవ సీజన్ కూడా మొదలుపెట్టేసింది. నిన్న అనగా సెప్టెంబర్ ఒకటి సాయంత్రం స్టార్ మా చానల్లో 7:00 గంటల నుండి ఈ షో ప్రారంభమైంది. బిగ్ బాస్ లాంచింగ్ సమయంలో చాలామంది బ్యూటిఫుల్ సెలబ్రిటీస్ తో పాటు కసితో టైటిల్ కొట్టాలి అని అడుగుపెట్టిన సెలబ్రిటీస్ కూడా అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దాదాపు 14 మంది హౌస్ లోకి అడుగుపెట్టగా , ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో అప్పుడే ఆడియన్స్ ను అలరించే ప్రయత్నం చేస్తున్నారు.

Bigg boss 8 : Nainika as the thirteenth contestant.. Do you know her background?
Bigg boss 8 : Nainika as the thirteenth contestant.. Do you know her background?

హౌస్ లోకి అడుగుపెట్టిన 14 మంది కంటెస్టెంట్స్ వీరే..

ఇకపోతే 14 మంది కంటెస్టెంట్ లో మొదటి కంటెస్టెంట్ గా సీరియల్ నటి కన్నడ ముద్దుగుమ్మ యష్మి గౌడ అడుగుపెట్టగా , రెండో కంటెస్టెంట్ గా సీరియల్ నటుడు నిఖిల్ మలియక్కల్, మూడో కంటెస్టెంట్ గా నటుడు అభయ్ నవీన్, నాలుగో కంటెస్టెంట్ గా నటి ప్రేరణ, ఐదో కంటెస్టెంట్ గా హీరో ఆదిత్య ఓం, ఆరవ కంటెస్టెంట్ గా నటి సోనియా ఆకుల, ఏడవ కంటెస్టెంట్ గా బెజవాడ బేబక్క, ఎనిమిదవ కంటెస్టెంట్ గా హీరో రాజ్ తరుణ్ స్నేహితుడు ఆర్జె శేఖర్ బాషా, 9వ కంటెస్టెంట్గా నటి కిరాక్ సీత, పదవ కంటెస్టెంట్ గా నటుడు నాగ మణికంఠ, 11వ కంటెస్టెంట్ గా పృథ్విరాజ్ శెట్టి, 12వ కంటెస్టెంట్ గా యాంకర్ విష్ణుప్రియ, 13వ కంటెస్టెంట్ గా డాన్సర్ నైనిక హౌస్ లోకి అడుగుపెట్టింది. ఇక 14వ కంటెస్టెంట్ గా నబీల్ ఆఫ్రిది అడుగు పెట్టారు.

13వ కంటెస్టెంట్ నైనిక బ్యాక్ గ్రౌండ్..

13వ కంటెస్టెంట్ గా హౌస్ లోకి అడుగుపెట్టిన నైనిక.. స్టేజ్ పైకి రాగానే తన పర్ఫామెన్స్ తో ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే నైనిక (Nainika ) గురించి తెలుసుకోవడానికి అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈమె ఎవరు.. ఈమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి..? అనే విషయాలు తెలుసుకోవడానికి అభిమానుల సైతం ఆసక్తి చూపిస్తున్న విషయం తెలిసిందే. నైనిక గొప్ప డాన్సర్. డాన్సర్ గానే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఢీ (Dhee)షోలో డాన్సర్ గా పేరు తెచ్చుకున్న ఈమె ఆ తర్వాత పలు టీవీ షోలలో డాన్స్ పెర్ఫార్మెన్స్ చేసి మరింత పాపులారిటీ అందుకుంది. సోషల్ మీడియాలో కూడా రెగ్యులర్గా ఫోటో షూట్స్, రీల్స్ చేస్తూ వైరల్ అవుతూ ఉంటుంది.

- Advertisement -

డాన్సర్ గా ఫుల్ పాపులారిటీ..

డాన్సర్ గా మంచి పేరు తెచ్చుకున్న నైనిక ఇప్పుడు బిగ్ బాస్ లోకి వచ్చింది. మరి హౌస్ లో తన డాన్స్ తో ప్రేక్షకులను మెప్పిస్తుందా లేక బిగ్బాస్ ఇచ్చే టాస్క్ లతో ఆడియన్స్ ఆకట్టుకుంటుందో చూడాలి. నైనిక విషయానికి వస్తే , నైనిక మంచి డాన్సర్ మాత్రమే కాదు హాట్ బ్యూటీ కూడా .. ఎప్పటికప్పుడు గ్లామర్ డోస్ పెంచేసి ఫోటోషూట్ షేర్ చేస్తూ అందరిని అలరిస్తూ ఉంటుంది. అలా అందచందాలతో ఇంస్టాగ్రామ్ ఖాతాలో విపరీతమైన ఫాలోవర్స్ ను కూడా సొంతం చేసుకున్న నైనిక , ఇప్పుడు మరొకసారి ఆడియన్స్ ను అలరించడానికి హౌస్ లోకి అడుగు పెట్టింది. మరి ఈ ముద్దుగుమ్మ హౌస్ లో ఆడియన్స్ ను ఏ విధంగా అలరిస్తుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు