Bigg Boss 8 Promo : హౌస్ మేట్స్ ను చెత్తలో ముంచెత్తిన బిగ్ బాస్… ఈ వీక్ చెత్త నామినేషన్

Bigg Boss 8 Promo : బిగ్ బాస్ సీజన్ 8 (Bigg Boss 8) రానురానూ రసవత్తరంగా మారుతుంది. మొదటి వారం అంతా గుడ్డు, ఫుడ్డు గొడవతోనే సరిపోయింది. అయితే బేబక్క (Bebakka) ను బయటకు పంపిన తరువాత హౌస్ మేట్స్ రూటు మార్చి గేమ్ మీద ఫోకస్ చేశారు. అందులోనూ ఒకరికపై పర్సనల్ అటాక్ కు దిగి, ప్రేక్షకులు ఎందుకు చూస్తున్నామా ? అన్పించేలా చేశారు. అయితే అన్ లిమిటెడ్ మనీ, అన్ లిమిటెడ్ ట్విస్టులు అంటూ చెప్పినట్టుగానే నాగార్జున (Nagarjuna) రెండవ వారం హౌస్ మేట్స్ చేసిన తప్పులను ఎత్తి చూపుతూ కడిగేశారు. ఎప్పటిలాగే సండే ఎపిసోడ్ ఫన్ తో సాగింది. ఊహించని విధంగా శేఖర్ భాషా (Sekhar Basha)ను హౌస్ మేట్స్ అందరూ కలిసి బయటకు పంపారు. తాజాగా డే 15 ((Bigg Boss 8 Day 15 Promo) కి సంబంధించిన ప్రోమో రిలీజ్ కాగా, అందులో హౌస్ మేట్స్ మధ్య చెత్త నామినేషన్ ప్రాసెస్ జరిగింది. బిగ్ బాస్ అందరి చేతికి చెత్తబుట్టను ఇచ్చి, తాము నామినేట్ చేయాలనుకున్న హౌస్ మేట్స్ మీద దాన్ని వేయాలని చెప్పడం విశేషం.

యష్మి (Yashmi Gowda)నే అందరి టార్గెట్

తాజాగా రిలీజ్ అయిన ప్రోమోలో చెత్తను ఉపయోగించి హౌజ్ మేట్స్ ఎవరినైతే నామినేట్ చేయాలనుకున్నారో రీజన్ చెప్పి చేయాల్సి ఉంటుందని బిగ్ బాస్ చెప్పారు. ముందుగా కిరాక్ సీత (Kirrak Seetha).. యష్మి గౌడ, పృధ్విల గురించి మాట్లాడింది. యష్మి గౌడ డామినేటింగ్ గా మాట్లాడుతోంది అంటూ ఆమెను నామినేట్ చేసింది. అలాగే పృథ్వీని కూడా మరో రీజన్ తో చెత్త వేసి నామినేట్ చేసింది. అయితే తాజా గా రిలీజ్ అయిన ప్రోమోని చూస్తుంటే అందరి టార్గెట్ యష్మి గౌడనే అనిపిస్తుంది. గత వీకెండ్ ఈ అమ్మాయిని చీఫ్ అయిన కారణంగా ఒక్కరికి కూడా నామినేట్ చేసే అవకాశాన్ని ఇవ్వలేదు బిగ్ బాస్. అంతేకాకుండా నాగార్జున (Nagarjuna) చీఫ్ గా ఫెయిల్ అయ్యావు అంటూ ఈ వీకెండ్ యష్మి గౌడ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడంతో అందరూ ఆమెని టార్గెట్ చేస్తున్నారు. ఇక ఆ తర్వాత ప్రేరణ, విష్ణు ప్రియ (Vishnu Priya) మధ్య కూడా హీటెడ్ ఆర్గ్యుమెంట్ నడిచింది. చెత్తబుట్టలో నుంచి ఒక్క బాటిల్ తీసి పెడితేనే పెద్ద గొడవ జరిగింది. కానీ ఇప్పుడు మాత్రం నాపై చెత్త వేసి నామినేట్ చేయండి అంటూ తన అక్కసును వెళ్లగక్కింది ప్రేరణ.

- Advertisement -

నాగ మణికంఠ వర్సెస్ యష్మి గౌడ

ఆ తర్వాత ప్రోమోలో చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే నాగ మణికంఠ (Naga Manikanta), యష్మి గౌడ (Yashmi Gowda) మధ్య నడిచిన గొడవ. ఇద్దరి మధ్య గట్టిగానే గొడవ జరిగింది. ప్రోమోలో బిగ్ బాస్ చూపించినంత మేరకు తనను నామినేట్ చేసిన మణికంఠను ఫేక్ అంటూ అతనికి మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వలేదు యష్మి గౌడ. ఇక ఈ ప్రోమోని చూస్తుంటే ఈరోజు జరగనున్న నామినేషన్ లో ఎపిసోడ్ హీట్ పుట్టించనుందని అర్థమవుతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు