Bigg Boss 8 Promo : వీకెండ్ ప్రోమోలో బిగ్ ట్విస్ట్ ఇచ్చిన నాగ్… హౌజ్ మేట్స్ దే జడ్జిమెంట్

Bigg Boss 8 Promo : బిగ్ బాస్ సీజన్ 8 స్టార్ట్ అయినప్పుడే ఈసారి సీజన్ మామూలుగా ఉండబోదని చెప్పారు. సరికొత్తగా అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ తో కొనసాగుతుందని హోస్ట్ నాగ్ చెప్పుకొచ్చారు. కానీ సీజన్ మొదలై వారం పూర్తిగావస్తున్నప్పటికీ కొత్తగా ఏమీ కనిపించలేదు. అదే రొటీన్ రోత పుట్టించే సీన్స్ నడిచాయి. అయితే చూస్తుండగానే వీకెండ్ వచ్చేసింది. దీంతో మొదటి వారం ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అని చర్చ నడుస్తుండగా, తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో నాగార్జున ట్విస్ట్ ఇచ్చారు. అసలు వినాయక చవితి సందర్భంగా ఈరోజు స్ట్రీమింగ్ కాబోతున్న ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోలో నాగార్జున ఏం చేశారో చూద్దాం పదండి.

కంటెస్టెంట్స్ దే జడ్జిమెంట్

బిగ్ బాస్ హౌస్ లో ఈసారి కంటెస్టెంట్స్ దే జడ్జిమెంట్ అంటూ కొత్త టాస్క్ ఇచ్చారు. గడచిన ఏడు సీజన్లలో ప్రతి వీకెండ్ నాగార్జున హౌస్ మేట్స్ చేసిన తప్పులను ఎత్తి చూపుతూ చెడా మడా కడిగేసేవారు. కొన్నిసార్లు కొంతమంది కంటెస్టెంట్స్ పై ఫైర్ కూడా అయ్యారు. అందుకే చాలామంది మిగతా రోజుల్లో కన్నా వీకెండ్ లోనే బిగ్ బాస్ ను చూడడానికి ఆసక్తిని కనబరుస్తారు. ఇక సీజన్ 8 మొదలై మొదటి వారం రానే వచ్చింది. ఈ వీకెండ్ వినాయక చవితి కలిసి రావడంతో పాటు ఎలిమినేషన్ కూడా హాట్ టాపిక్ గా ఉంది. ఈ నేపథ్యంలోనే తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో హౌస్మెట్స్ అందరూ అందంగా ముస్తాబయి కనిపించారు. ఇక అందులో భాగంగానే నాగర్జున ఇంతకు ముందు వరకు వీకెండ్ అనగానే నేను వచ్చి హౌస్ లో తప్పు చేసిన వాళ్ల గురించి మాట్లాడేవాడిని. కానీ ఈ సీజన్లో మాత్రం హౌస్ మేట్స్ జడ్జిమెంట్ ఇస్తారు అని మొదలుపెట్టారు. అందులో భాగంగా ఒక్కొక్కరు ఒక్కో బెల్టును నడుముకు వేసుకోగా దాన్ని గుచ్చి మిగతా వాళ్ళు ఆ హౌస్ మేట్ గురించి చెప్పాలి. ఆ తర్వాత నాగార్జున అసలేం జరిగింది అనే విషయం గురించి మాట్లాడతారు.

Bigg Boss 8 Telugu Highlights: బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టిన 14 మంది  కంటెస్టెంట్స్ వీరే..

- Advertisement -

విష్ణు ప్రియకు షాక్

ప్రోమోలో జరిగిన మరో ఇంటరెస్టింగ్ విషయం ఏమిటంటే నాగార్జున ఈ టాస్క్ ఇచ్చినప్పుడు విష్ణు ప్రియ సోనియాకు కత్తి దింపింది. ఆ తర్వాత కొన్నిసార్లు ఆమె వాడే పదాలు హర్టింగ్ గా ఉంటాయి అంటూ చెప్పుకొచ్చింది. దీంతో వీళ్ళిద్దరి మధ్య అసలు ఏం జరిగింది అన్న విషయాన్ని ప్రోమోలోనే చూపించారు. ముందు నిఖిల్ అంటే నచ్చేది కాదు ఇప్పుడు ఫ్రెండ్షిప్ ఎలా కుదిరింది అంటూ ఫన్నీగా అడిగింది విష్ణు ప్రియ. దానికి సోనియా నో కామెంట్స్ అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయి, ఆ తర్వాత మీ అడల్ట్ కామెడీలో నేను భాగం కాదు అంటూ గట్టిగానే ఇచ్చి పడేసింది. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరగగా సోనియా కన్నీరు పెట్టుకుంది. అప్పుడు కూడా విష్ణు ప్రియ షాకింగ్ కామెంట్స్ చేసింది. మరి వీరిద్దరిలో ఎవరిది తప్పు అని నాగార్జున తెలుస్తారో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు