Bigg Boss 8.. ఎట్టకేలకు బిగ్ బాస్ 8వ సీజన్ (Bigg Boss season 8)చాలా అట్టహాసంగా ప్రారంభం అయింది. అందులో భాగంగానే దాదాపు 14 మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి అడుగుపెట్టారు. ఒక్కొక్కరు ఒక్కో బ్యాక్ గ్రౌండ్ తో హౌస్ లోకి వచ్చేసారు. ఇక ఇలా 14 మంది హౌస్ లోకి అడుగుపెట్టగా అందులో ఐదవ కంటెస్టెంట్ గా అడుగుపెట్టారు హీరో ఆదిత్య ఓం (Aditya Om). ఈయన గురించి తెలుగు ఆడియన్స్ కి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంతేకాదు తెలుగుతో పాటు తమిళ్, హిందీ భాషల్లో కూడా నటించి మెప్పించారు.
ఆదిత్య ఓం నటించిన తెలుగు చిత్రాలు..
ఇకపోతే ఈయన నటించిన తెలుగు చిత్రాల విషయానికి వస్తే.. నటుడిగా , స్క్రీన్ ప్లే, పాటల రచయితగా , నిర్మాతగా కూడా పనిచేసిన ఈయన 2002లో లాహిరి లాహిరి లాహిరిలో అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో అదే ఏడాది ధనలక్ష్మి ఐ లవ్ యు అనే చిత్రంలో నటించారు. ఆ తర్వాత 2003లో ఒట్టు ఈ అమ్మాయి ఎవరో తెలీదు!, మీ ఇంటికొస్తే ఏమిస్తారు మా ఇంటికి వస్తే ఏం తెస్తారు, ప్రేమించుకున్న పెళ్లికి రండి , భామ కలాపం, ఆఖరి పేజీ, ప్లీజ్ సారీ థాంక్స్, నిశ్శబ్దం, పొదరిల్లు, వీడి జిమ్మడా, గిలిగింతలు, ఆపరేషన్ గ్రీన్ హంట్, పున్నమినాగు, మా అన్నయ్య బంగారం, నీలవేణి, వసంత రాగం, దహనం నాతో నేను విక్రమ్ ఇలా ఎన్నో తెలుగు చిత్రాలలో నటించారు. అలాగే మంచు లక్ష్మి లీడ్ రోల్ పోషిస్తున్న ఆదిపర్వం సినిమాలో కూడా నటిస్తున్నారు. ఇంకా ఈ సినిమా విడుదలకు నోచుకోలేదు.
డిప్రెషన్ లోకి వెళ్లిపోయిన ఆదిత్య ఓం..
ఇలా ఇన్ని తెలుగు చిత్రాలలో పనిచేసిన ఈయన హిందీ చిత్రాలలో కూడా నటించారు. అంతేకాదు అక్కడ దర్శకత్వం కూడా వహించారు. హీరో గానే కాకుండా తన టాలెంట్ ని చూపించిన ఈయన ఎందుకో తెలియదు కానీ ఎక్కువ కాలం హీరోగా కొనసాగ లేకపోయారు. నిజానికి ఈయన ఎన్నో చిత్రాలలో హీరోగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు, తన నటనతో అవార్డులు కూడా పొందారు. కానీ ఆయన తీసిన సినిమాలు కమర్షియల్ గా ఫెయిల్ అవ్వడం, దీనికి తోడు అవకాశాలు కూడా రాకపోవడంతో డిప్రెషన్ లోకి వెళ్లిపోయారు. గది నుంచి బయటకు కూడా రాలేకపోయారు . రోజుకి 60 సిగరెట్లు కూడా తాగే వారట ఆదిత్య. కానీ కుటుంబ సభ్యుల మద్దతుతో మానసిక ఒత్తిడి నుంచి బయటకు వచ్చి మళ్లీ కొత్త జీవితం మొదలుపెట్టారు.
బిగ్ బాస్ ద్వారా అవకాశాలు పెరుగుతాయా..
ఇక ఇప్పుడు మళ్లీ తనను తాను నిరూపించుకోవడానికి బిగ్ బాస్ హౌస్ నున్ ఒక వేదికగా ఏర్పాటు చేసుకున్నారు. మరి ఈ హౌస్ ఈయనకు ఎలాంటి విజయాన్ని అందిస్తుంది అనే విషయం త్వరలోనే తెలియనుంది.
View this post on Instagram