Bigg Boss 8: హౌస్ లోకి వెళ్ళనున్న యష్మీ గౌడ.. ఈమె బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే..?

Bigg Boss 8.. తెలుగు బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ (Bigg boss).. తెలుగులో ఇప్పటికే ఏడు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో ఎనిమిదవ సీజన్ కి రంగం సిద్ధం అయింది. సెప్టెంబర్ ఒకటవ తేదీన స్టార్ మా ఛానల్ లో గ్రాండ్ లాంచ్ ఓపెనింగ్ ఈవెంట్ జరగబోతోంది. ఇప్పటికే ఈ షో కి సంబంధించిన పలు ప్రోమోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారగా, ఈ షోలో వీరు కంటెస్టెంట్లు అంటూ కొన్ని జాబితాలు మరింత వైరల్ గా మారుతున్నాయి.

Bigg Boss 8: Yashmi Gowda who will enter the house.. What is her background..?
Bigg Boss 8: Yashmi Gowda who will enter the house.. What is her background..?

ఫైనల్ కంటెస్టెంట్స్..

ఇదిలా ఉండగా గత రెండు మూడు రోజులుగా ఫైనల్ కంటెస్టెంట్స్ వీరే అంటూ.. బిగ్బాస్ సీజన్ 7 రన్నర్ గా నిలిచిన అమర్ దీప్ (Amar deep)భార్య ప్రముఖ నటి తేజస్విని(Tejaswini )పేరు ప్రథమంగా వినిపిస్తూ ఉండగా, సాకేత్ (Saketh), ఇంద్రనీల్ (Indraneel), అంజలి (Anjali), సన (Sana), పవిత్ర(Pavitra ), రీతు (Rithu ), సౌమ్య (Sowmya), యాదమ్మ రాజు (Yaadamma raju), యస్మి గౌడ (Yashmi gowda) తదితరుల పేర్లు బాగా వైరల్ అయ్యాయి. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం బిగ్ బాస్ సీజన్ 8లోకి వెళ్ళబోయే మొదటి కంటెస్టెంట్ యష్మీ గౌడ అని తేలిపోయింది. మరి ఈమె ఎవరు? ఈమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి ?అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

యష్మీ గౌడ కెరియర్..

యష్మీ గౌడ (Yashmi gowda)అంటే పెద్దగా ఎవరికి పేరు తెలియదు. కానీ స్టార్ మా చానల్లో ప్రసారమైన కృష్ణా ముకుందా మురారి (Krishna mukunda murari) సీరియల్ ముకుందా అంటే మాత్రం ఇట్టే గుర్తుపట్టేస్తారు. తన అద్భుతమైన నటనతో, అందంతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న ఈమె అనూహ్యంగా సీరియల్ నుంచి తప్పుకుంది. ఇక ఇప్పుడు బిగ్బాస్ సీజన్ 8 లో అవకాశాన్ని దక్కించుకుంది. మరి ఈమె ఎవరు..? ఎక్కడి నుంచి వచ్చింది..? ఈమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి..? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం..

- Advertisement -

యష్మీ గౌడ కెరియర్ ఆరంభం..

స్వాతి చినుకులు, నాగ భైరవి సీరియల్స్ లో నటించి మంచి పేరు దక్కించుకున్న యష్మీ గౌడ. కర్ణాటకలోని బెంగళూరులో జన్మించింది. హోలీ చైల్డ్ ఇంగ్లీష్ స్కూల్ నుండి ప్రాథమిక విద్యను పూర్తి చేసిన ఈమె అనంతరం దయానంద సాగర్ ఇన్స్టిట్యూషన్ నుండి గ్రాడ్యుయేషన్ పట్టా అందుకుంది. చిన్నప్పటి నుంచే నటన మీద ఆసక్తి పెంచుకున్న యష్మీ గౌడ.. నటనలోకి రావాలని ఎన్నో కలలు కంది. అన్నట్లుగానే మోడల్ గా కెరియర్ మొదలుపెట్టి, ఆ తర్వాత సీరియల్స్ లో నటిగా నటించడం మొదలుపెట్టి తన కలను నెరవేర్చుకుంది. అంతేకాదు 2016లో మిస్ ఫోటోజెనిక్ ఫేస్ గా కూడా అవార్డు దక్కించుకుంది ఈ ముద్దుగుమ్మ.. విద్య వినాయక అని కన్నడ సీరియల్ ద్వారా నటిగా కెరియర్ ప్రారంభించిన యష్మి గౌడ, ఆ తర్వాత తెలుగులో మొదటిసారి స్వాతి చినుకులు సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. ఇందులో వెన్నెల క్యారెక్టర్ లో నటించి ఆడియన్స్ కు దగ్గర అయింది. అలాగే త్రినయని సీరియల్ లో నటించిన ఈమె ఆ తర్వాత కొన్ని షార్ట్ ఫిలిమ్స్ లో కూడా నటించి మెప్పించింది. ఇక ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్లోకి రాబోతోంది. మరి ఇక్కడ ఎలాంటి పాపులారిటీ అందుకుంటుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు