Bigg Boss : ఇండియా వైడ్ గా ట్రెండింగ్ లో బిగ్ బాస్ #Boycott… ఈ సారి ఏమైందంటే…?

Bigg Boss.. ఎక్కడో పాశ్చాత్య దేశాలలో మొదలైన ఈ బిగ్ బాస్ రియాల్టీ షో ఇండియాలో భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. హిందీలో ఏకంగా 18 సీజన్లను పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు తెలుగులో ఏడు సీజన్లు పూర్తిచేసుకుని ఎనిమిదవ సీజన్ కి కూడా సిద్ధం అయింది. ఒక హిందీ , తెలుగు మాత్రమే కాదు కన్నడ, తమిళ్ వంటి పాపులర్ భాషలలో కూడా ఈ షో ప్రారంభమై భారీ క్రేజ్ దక్కించుకుంది. ఇదిలా ఉండగా తాజాగా బిగ్ బాస్ #boycott పేరుతో ఇండియా వైడ్ గా ట్రెండింగ్ లో కొనసాగుతోంది. అసలు బిగ్ బాస్ ను ఉన్నట్టుండి బాయ్ కాట్ చేయాలంటూ సడెన్ గా ఈ హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ ఏంటి అంటూ బిగ్ బాస్ లవర్స్ అందరూ కామెంట్లు చేస్తున్నారు.. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

Bigg Boss : Bigg Boss #Boycott trending India wide... What happened this time...?
Bigg Boss : Bigg Boss #Boycott trending India wide… What happened this time…?

బిగ్ బాస్ #boycott పేరుతో ట్రెండింగ్..

Bigg Boss : Bigg Boss #Boycott trending India wide... What happened this time...?
Bigg Boss : Bigg Boss #Boycott trending India wide… What happened this time…?

అసలు విషయంలోకెళితే హిందీ బిగ్ బాస్ ఓటిటి సీజన్ 3 జరుగుతున్న విషయం తెలిసిందే.. మరో వారం లో ఈ షో ఫైనల్ కీ చేరుకోనుంది.. ఇకపోతే తాజాగా ఈ షో కి మొదటిసారి అనిల్ కపూర్ హోస్టుగా వ్యవహరిస్తున్నారు. ఇకపోతే ఆగస్టు 4వ తేదీన ఈ షో గ్రాండ్ ఫినాలే జరగబోతున్న నేపథ్యంలో.. మిగతా ఎపిసోడ్లలో కొంతమంది కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అవ్వగా.. ప్రస్తుతం కృతిక మాలిక్,రణబీర్ షో రే, విశాల్ పాండే, అర్మాన్ మాలిక్, లవ్ కేశ్ కటారియా,శివాని కుమారి, విశాల్ పాండే, సాయికేతన్ రావు , నేజీ, సన మక్బుల్ మిగిలారు.. వీరంతా కూడా ట్రోఫీ కోసం ఎవరికి వారు గట్టిగా పోటీపడ్డ విషయం తెలిసిందే. ముఖ్యంగా వీరిలో లవకేష్ కటారియా అత్యంత ప్రేక్షకాదరణ పొందడమే కాదు టైటిల్ ఫేవర్ గా పేరు సొంతం చేసుకున్నారు.. ఇక టైటిల్ కోసం గట్టి పోటీ ఇవ్వడమే కాదు ఈయనే ట్రోఫీ గెలుచుకుంటారని అందరూ అనుకున్న నేపథ్యంలో ఇక ఒక వారం మిగిలి ఉండగా ఇప్పుడు అర్ధారంగా లవకేష్ ఎలిమినేట్ అవ్వడం అభిమానులకు మింగుడు పడడం లేదు.
దీంతో లవకేష్ అభిమానులంతా బిగ్ బాస్ # boy cott అంటూ హ్యాష్ ట్యాగ్ ట్రేడింగ్ తో ఇండియా వైడ్ గా వైరల్ చేస్తున్నారు.

లవ్ కేష్ ఎలిమినేషన్.. జీర్ణించుకోలేకపోతున్న ఫ్యాన్స్..

మరో ఐదు రోజుల్లో ట్రోఫీ అందుకోబోతాడు అని లవ్ కేష్ తో పాటు అభిమానులు కూడా ఎంతో ఆత్రుతగా ఎదురు చూశారు. కానీ అనూహ్యంగా అతడిని ఎలిమినేట్ చేసేసరికి అభిమానులు ఒక రేంజ్ లో ఆగ్రహం వ్యక్తం చేస్తూ బిగ్ బాస్ ను బాయికాట్ చేయాలి అంటూ ట్రెండ్ చేస్తూ ఉండడం గమనార్హం. ఏదిఏమైనా టైటిల్ ఫేవర్గా నిలిచిన ఈయన ఇప్పుడు సడన్గా ఎలిమినేట్ అయ్యేసరికి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారని చెప్పవచ్చు.. అంతే కాదు ఇది ఊహించని ఎలిమినేషన్, లవకేష్ ఎలిమినేషన్ అన్యాయం అంటూ కామెంట్లు చేస్తున్నారు..

- Advertisement -

జియో సినిమా యాప్ అన్ ఇన్స్టాల్..

ఇకపోతే నివేదికల ప్రకారం ప్రత్యేక అధికారాన్ని పొందిన రణవీర్ షోరే లవ్ కేష్ ను తొలగించాలని నిర్ణయించుకున్నప్పటి నుంచి లవ్ కేష్ కటారియా ఎలిమినేషన్ అందర్నీ ఆశ్చర్యపరిచింది… అందుకే లవ్ కేష్ ఎలిమినేషన్ అనేది ఓట్ల ప్రాతిపదికన జరగలేదని, కావాలని ఆయనను ఎలిమినేట్ చేశారు అంటూ అభిమానులు ఆగ్రహం చేస్తున్నారు . అందుకే బిగ్ బాస్ ను బహిష్కరించాలని సోషల్ మీడియా ద్వారా కామెంట్లు చేస్తూ రెచ్చిపోతున్నారు అంతేకాదు ఈ అన్యాయాన్ని తట్టుకోలేక చాలామంది జియో సినిమా యాప్ ను అన్ ఇన్స్టాల్ చేస్తూ ఉండడం గమనార్హం..

రగిలిపోతున్న ఫ్యాన్స్..

ముఖ్యంగా లవ్ కేష్ కటారియా ఎలిమినేషన్ తట్టుకోలేక అభిమానులు ఒక్కొక్కరిగా నిజంగా బిగ్ బాస్ మీ ఓట్లను పట్టించుకోరు.. ఇప్పుడు వారు లవ్ కేశ్ కటారియాను ఎలిమినేట్ చేశారు. అందుకే బిగ్ బాస్ చూడడం మానేద్దాం అంటూ కామెంట్లు చేశారు. ఏది ఏమైనా తమ అభిమాన కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యేసరికి అభిమానులు పూర్తిస్థాయిలో రగిలిపోతున్నారని చెప్పవచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు