Captain task: ఎవరికీ దక్కని కెప్టెన్సీ బ్యాడ్జ్.. ఈ వారం కూడా ప్రియాంకే నా?

టెలివిజన్ లో గత రెండు నెలలుగా అలరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 7 షో మరో మూడు వారాల్లో ముగియనుంది. అయితే లాస్ట్ టైం కెప్టెన్సీ టాస్క్ ని నిన్న బిగ్ బాస్ మొదలు పెట్టమనడం జరిగింది. ఆ టాస్క్ లో ప్రతి ఇద్దరిలో ఒకర్ని గేమ్ లో నుండి తీసేస్తూ, ఫైనల్ గా అమర్ వర్సెస్ అర్జున్ గా మారిపోయింది. అర్జున్ ని కెప్టెన్ గా శివాజీ, యావర్, గౌతమ్ మరియు రతిక సపోర్ట్ చేస్తే, అమర్ దీప్ కి శోభా, ప్రియాంక, అశ్విని, ప్రశాంత్ సపోర్ట్ చేసారు.

అయితే ఈ టాస్క్ లో ఎవరు ఫైనల్ డెసిషన్ శోభా, శివాజీ మధ్య ఉండగా, సరైన డెసిషన్ టైం కి ఎవరూ తీసుకోకపోవడంతో బిగ్ బాస్ కెప్టెన్సీ టాస్క్ ని కూడా రద్దు చేసి, అమర్, అర్జున్ ఇద్దరి ఫోటోలని కాల్చేశాడు. అయితే బిగ్ బాస్ నిర్ణయం చెప్పాక, శివాజీ, శోభా కలిసి అమర్ ని డిసైడ్ చేసామన్న కుదరలేదు. ఇక అర్జున్ బిగ్ బాస్ నిర్ణయం ఫైనల్ అని ఊరుకున్నాడు. అమర్ మాత్రం కెప్టెన్సి మిస్ అయినందుకు మరోసారి ఫీల్ అవుతూ ఏడుస్తున్నాడు.

అయితే కెప్టెన్సీ టాస్క్ ని రద్దు చేసినా, శనివారం నాగార్జున సమక్షంలో కంటెస్టెంట్ వోటింగ్ ప్రకారం ఇద్దరిలో ఎవరు కెప్టెనో డిసైడ్ చేసే ఛాన్స్ ఉంది. అయితే ఒకవేళ ఇది కుదరకపోతే ప్రియాంకే ఈ వారం కూడా కెప్టెన్ గా కంటిన్యూ అవుతుందా, లేక అసలు కెప్టెన్ గా ఎవరూ ఉండరా అనేది ఈ రోజు తెలుస్తుంది.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు