Bigg Boss OTT 3 Winner: సనా మక్బూల్.. తెలుగులో హీరోయిన్గా నటించిన చిత్రాలు ఇవే..!

Bigg Boss OTT 3 Winner.. గత కొన్ని వారాలుగా హిందీ బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 3 విన్నర్ గా ఎవరు నిలుస్తారు అనే విషయంపై సర్వత్రా చర్చ నెలకొనింది. అంతేకాదు నిన్న మొన్నటి వరకు లవ్ కేష్ కటారియా సీజన్ విన్నర్ గా నిలుస్తారని అందరూ అనుకున్నారు. అయితే అనూహ్యంగా ఆయన గత నాలుగు రోజుల క్రితం ఎలిమినేట్ అవ్వడంతో ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. పైగా బిగ్ బాస్ ను బాయ్ కాట్ చేయాలంటూ సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్ తో ట్రెండ్ చేశారు కూడా. అయితే ఎట్టకేలకు తాజాగా బిగ్ బాస్ ఓటిటి సీజన్ 3 విన్నర్ గా సనా మక్బూల్ టైటిల్ దక్కించుకున్నారు. ఇక ర్యాప్ సింగర్ నేజీ రన్నరప్ గా నిలిచాడు.

Bigg Boss OTT 3 Winner: Sana Maqbool..these are the Telugu films she is act as a heroine..!
Bigg Boss OTT 3 Winner: Sana Maqbool..these are the Telugu films she is act as a heroine..!

విజేతగా సనా మక్బూల్..

విజేతగా నిలిచిన సనా మక్బూల్ బిగ్ బాస్ ట్రోఫీతో పాటు 25 లక్షల రూపాయల ప్రైజ్ మనీని సొంతం చేసుకుంది. ఈమె కెరియర్ విషయానికి వస్తే, సీరియల్ నటిగా కెరియర్ మొదలుపెట్టిన ఈమె పలు షోలతో పాటు సోషల్ మీడియాలో కూడా భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. అంతేకాదు ఈమె పలు చిత్రాలలో హీరోయిన్ గా నటించింది కూడా.. ముఖ్యంగా తెలుగు హీరోయిన్ గా పేరు సొంతం చేసుకుంది.

సనా మక్బూల్ నటించిన తెలుగు చిత్రాలు..

ఈ ముద్దుగుమ్మ 2014లో దిక్కులు చూడకు రామయ్య సినిమాతో హీరోయిన్ గా సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టింది. ఈ సినిమాలో హీరోగా ప్రామిసింగ్ హీరో నాగ శౌర్య నటించింది. అంతేకాదు ఇందులో అజయ్ కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది. ఈ సినిమా తర్వాత ఈమెకు తమిళంలో కూడా ఒక అవకాశం వచ్చింది. అక్కడ కూడా సినిమా చేసిన ఈమె మళ్లీ తెలుగులో మామ ఓ చందమామ అనే మరో సినిమా చేసింది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమా పెద్దగా విజయం దక్కకపోవడంతో ఈమెకు తెలుగులో అవకాశాలు ఆగిపోయాయి. ఇక చేసేదేమీ లేక బాలీవుడ్ కి వెళ్లి టీవీ షోలు చేస్తూ బిజీ అయిపోయింది.

- Advertisement -

సనా మక్బూల్ పై ప్రశంసలు..

ఇక టీవీ షోల ద్వారా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న సనా తాజాగా బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 3 విన్నర్ గా నిలిచి మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది. ఈ క్రేజ్ తో ఈమెకు ఎప్పుడైనా తెలుగులో అవకాశాలు వస్తాయేమో చూడాలి. మొత్తానికైతే ట్రోఫీ కోసం ఎంతో కష్టపడ్డానని ట్రోఫీ అందుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పుకొచ్చింది సనా మక్బూల్. ఇటీవలే బిగ్ బాస్ ఓటిటి సీజన్ 3 గ్రాండ్ ఫినాలే జరిగింది. అందులో భాగంగానే ఈమె ట్రోఫీని గెలుచుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇక ఈ షో కి అనిల్ కపూర్ హోస్ట్గా వ్యవహరించారు. ఇక ప్రస్తుతం ట్రోఫీ గెలుచుకున్న సనా మక్బూల్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు అభిమానులు.

 

View this post on Instagram

 

A post shared by Sana Makbul (@divasana)

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు