Bigg boss season7: రంగు పడుద్ది… ఇక్కడ్నుంచి మొదలవుద్దా?

Bigg boss season7:

టెలివిజన్ లో బిగ్ బాస్ సీజన్ 7 రోజురోజుకి ఇంట్రెస్టింగ్ గా నడుస్తుంది. షో స్టార్ట్ అయినప్పటినుండే వేరే సీజన్ తో సంబంధం లేకుండా, కొత్త టాస్క్ లతో షో పై జనాలకి ఇంట్రెస్ట్ కలిగేలా చేయగా, కంటెస్టెంట్స్ కూడా తమ ఆటతో జనాల్ని అట్రాక్ట్ చేస్తున్నారు. బిగ్ బాస్ షో మొదలైనపుడు వీళ్ళలో సెలబ్రిటీలే జనాల్ని ఎక్కువ ఎట్రాక్ట్ చేస్తారని, వాళ్ళే టాప్ లో ఉంటారని అనుకున్నా, నెల రోజులు తిరిగే సరికి బిగ్ బాస్ లో సినిమా ఇండస్ట్రీకి, టెలివిజన్ కి ఏమాత్రం సంబంధం లేని యావర్, ప్రశాంత్ ఆడియన్స్ వోటింగ్స్ పరంగా టాప్ ప్లేస్ లో దూసుకెళ్తున్నారు.

ఇక అసలు విషయానికి వస్తే బిగ్ బాస్ తాజాగా పెట్టిన ఓ టాస్క్, షో స్వరూపాన్నే మార్చేలా ఉందని అనిపిస్తుంది. “రంగు పడుద్ది రాజా” అని పెట్టిన తాజా టాస్క్ లో అందరికి తెల్ల టీషర్ట్స్ ఇస్తారు. బెల్ మోగగానే కంటెస్టెంట్స్ వాళ్ళ చేతుల్తో ఎదుటి వారి టీ షర్ట్ ని రంగులతో నింపేయాలి. అయితే అప్పొసిట్ కంటెస్టెంట్ వాళ్ళ నుండి తప్పించుకుంటూ ఉండాలి. ఈ ప్రయత్నంలో కంటెస్టెంట్స్ మొత్తంలో ఎవరి టీ షర్ట్ పై తక్కువ రంగు ఉంటుందో వాళ్లే మొదటి కెప్టెన్ అవుతారని బిగ్ బాస్ అంటాడు.

అయితే ఈ టాస్క్ లో మొహం పైన చేతులేయడం, టీ షర్ట్ చించుకోవడాలు కూడా జరిగాయని తాజాగా రిలీజ్ చేసిన ప్రోమో చూస్తే తెలుస్తుంది. అయితే ఇప్పటివరకు ఈ షో లో కొట్టుకోవడం జరగలేదు. గతంలో వచ్చిన సీజన్లో కూడా ఎక్కడా కొట్టుకునేంత రేంజ్ లో టాస్క్ లు కాలేదు. కానీ తాజాగా రిలీజ్ చేసిన ప్రోమో లో రంగు పడుద్ది టాస్క్ లో కంటెస్టెంట్స్ ఆట తీవ్ర పరిణామాలకి దారి తీసే విధంగా ఉందని అనిపిస్తుంది. అంతే కాదు ఆ టాస్క్ లో రంగుల వల్ల కంటికి ఇన్ఫెక్షన్ అయ్యే ప్రమాదం కూడా ఉంది.

- Advertisement -

ఇదిలా ఉంచితే ఈ టాస్క్ వల్ల కంటెస్టెంట్స్ మధ్య ఆట పరంగా వ్యక్తిగతంగా విభేదాలు మొదలయ్యే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా సందీప్, అమర్ ఈ గేమ్ ని ఎలా ఫినిష్ చేస్తారో అన్నది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ వ్యక్తిగత మనస్పర్థలు వస్తే గేమ్ లో గెలవడం అసాధ్యం. మరి షో లో ఇంకెన్ని కొత్త టాస్క్ లు, మరెన్ని మార్పులు వస్తాయో చూడాలి.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the

Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు