Bigg Boss Season 8 : బిగ్ బాస్ లాంచ్ ఈవెంట్ కు గెస్ట్ గా పాత హోస్ట్… ఇది సరిపోతుందా?

Bigg Boss Season 8 : బుల్లితెర ప్రేక్షకులు అత్యధికంగా వీక్షించిన వివాదాస్పద రియాలిటీ షోలలో ఒకటైన బిగ్ బాస్ తెలుగు 8 ప్రారంభం కావడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించిన అప్డేట్స్ బయటకు రావడంతో షో ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అనే ఉత్సాహం అభిమానులలో కనిపిస్తుంది. హౌస్‌లోకి ప్రవేశించడానికి తాజా బ్యాచ్ కంటెస్టెంట్స్ సిద్ధంగా ఉండగా, ప్రీమియర్‌కు అధికారికంగా కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ఈ క్రమంలోనే బిగ్ బాస్ 8లో ఫస్ట్ ఎపిసోడ్ లోనే పాత హోస్ట్ ఒకరు గెస్ట్ గా కన్పించబోతున్నారు అనే టాక్ నడుస్తోంది. మరి ఆ స్టోరీ ఏంటో ఓ లుక్కేద్దాం పదండి.

గెస్ట్ గా పాత హోస్ట్ ?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 సెప్టెంబర్ 1 నుంచి గ్రాండ్ గా ప్రారంభం కానుంది. సాంప్రదాయం ప్రకారం పోటీదారులందరినీ హోస్ట్ అక్కినేని నాగార్జున ఇంట్రడక్షన్ ఏవీల ద్వారా పరిచయం చేసి, ఆపై ఇంట్లోకి పంపుతారు. ఈ సీజన్‌లో మొదటి నుంచే వీక్షకులను నిమగ్నమై ఉంచడానికి మరికొన్ని ట్విస్ట్‌లు ఉంటాయి. ముఖ్యంగా గతంలో హోస్ట్ గా వ్యవహరించిన నాని కూడా ఈ సీజన్ గ్రాండ్ లాంచ్ లో గెస్ట్ గా కన్పించబోతున్నారు అనే టాక్ నడుస్తోంది. అయితే అప్పట్లో నాని హోస్ట్ గా చేసిన సీజన్ విమర్శలను ఎదుర్కొంది. ఆయన హోస్ట్ గా సరైన విధంగా వ్యవహరించలేదని కామెంట్స్ విన్పించాయి. ఆ నెక్స్ట్ సీజన్ నుంచి బిగ్ బాస్ హోస్ట్ గా ఛాన్స్ తీసుకున్న నాగ్ ఇంకా షోను వదల్లేదు. నాని బిగ్ బాస్ సీజన్ 2కు హోస్టుగా చేయగా, ఆ తర్వాత నాగార్జున హోస్టుగా చేస్తున్నప్పుడే పలు సీజన్లలో గెస్టుగా వచ్చి ప్రేక్షకులను అలరించాడు. ఇప్పుడు సీజన్ 8లోనూ ఆయన సందడి చేయబోతుండడం విశేషం.

Natural star Nani As A Guest for the opening episode of Bigg Boss Telugu season 8 Show Bigg Boss 8: ‘బిగ్ బాస్’ ఓపెనింగ్ ఎపిసోడ్ కు ‘సరిపోదా శనివారం’ టీమ్- తాజా, మాజీ హోస్టులతో స్టేజి దద్దరిల్లాల్సిందే!

- Advertisement -

సరిపోతుందా ఇది?

అయితే ఈ షోకు ఉన్న అభిమానుల సంఖ్య, రేటింగ్ ను దృష్టిలో పెట్టుకుని సీజన్ 8కు ఓపెనింగ్ ఎపిసోడ్ తోనే భారీ రేంజ్ లో అంచనాలు పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు మేకర్స్. అందులో భాగంగానే నానిని రంగంలోకి దింపుతున్నారు. కానీ ఆల్రెడీ ఈ షోలో హోస్ట్ గానే కాదు గెస్ట్ గా కూడా చూసేశారు ప్రేక్షకులు. మరి మళ్లీ ఆయనే గెస్ట్ గా రావడం సరిపోతుందా ? అంటే.. నిజానికి చాలాకాలంగా బిగ్ బాస్ షోను రాబోయే సినిమాలను ప్రమోట్ చేయడానికి అనువైన వేదికగా భావిస్తున్నారు చాలామంది మేకర్స్. అందుకే నటీనటులు, దర్శకులు తమ చిత్రాలను ప్రమోట్ చేయడానికి ఈ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగిస్తున్నారు. అయితే సాధారణంగా షో వీకెండ్ ఎపిసోడ్‌లలో గెస్టులు రావడం హైలైట్. అయితే ఈసారి ఓపెనింగ్ ఎపిసోడ్ లోనే స్పెషల్ గెస్ట్ లు వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా రెండు రోజుల క్రితం విడుదలైన సరిపోదా శనివారం టీం పోస్ట్-రిలీజ్ ప్రమోషనల్ ప్రచారాన్ని బిగ్ బాస్ వేదికగా జరపబోతోంది. అందులో భాగంగానే నాని గెస్ట్ గా సీజన్ 8కు హాజరుకానున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన షూటింగ్ జరుగుతోంది.

బిగ్ బాస్ తెలుగు 8 కంటెస్టెంట్స్ లిస్ట్

విష్ణుప్రియ భీమినేని, శేఖర్ భాషా, బెజవాడ బేబక్క, నైనికా, విస్మయ శ్రీ, ఆదిత్య ఓం, మోడల్ రవితేజ, దర్శకుడు పరమేశ్వర్, ఖయ్యూమ్ అలీ, సౌమ్యరావు, గాయకుడు సాకేత్, అంజలి పవన్, అభినవ్ నవీన్, అభిరామ్ వర్మ ఈసారి కంటెస్టెంట్స్ గా రాబోతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు