Bigg Boss Telugu 8 : అనిల్ ముందే విజ్ఞాన ప్రదర్శనలు… మొదటి రోజే బలైపోయాడు ఈ కంటెస్టెంట్

Bigg Boss Telugu 8: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో మరోసారి ప్రేక్షకులను సందడి చేయడానికి మన ముందుకు వచ్చింది. ఆదివారం సాయంత్రం 7 గంటలకు బిగ్ బాస్ షో ప్రారంభమైంది. ఇప్పటికే 7 సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్ బాస్ షో ఇప్పుడు, బిగ్ బాస్ 8వ సీజన్ తెలుగు రూపంలో గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చింది. లాంచింగ్ ఈవెంట్ అట్టహాసంగా ప్లాన్ చేసి ఈ షోపై మరింత ఆసక్తిని పెంచారు నిర్వాహకులు.

మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ గా ఈ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వగా…. తాజాగా ఈ షోకి సంబంధించిన డే 2 ప్రోమోను బిగ్ బాస్ టీం విడుదల చేసింది. అయితే.. ఆదివారం ప్రారంభం అయిన బిగ్‌ బాస్‌ షో 8వ సీజన్‌ లో ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇందులో అనిల్‌ రావిపూడి పాత్రలో ఉన్న కంటెస్టెంట్‌… నాగ మణికంఠను ప్రశ్నలు అడుగుతాడు.

- Advertisement -

ఈ తరుణంలోనే.. ఏదో బిల్డప్‌ కు వెళ్లిన నాగ మణికంఠ… అన్సర్‌ ఇస్తూ.. నాకు నేనే ఫ్యాన్‌ అని చెబుతాడు. దీంతో ఈ వీడియో వైరల్‌ గా మారింది. ఈ వీడియోను వైరల్‌ చేస్తూ…. నాగ మణికంఠను అడుకుంటున్నారు నెటిజెన్స్‌.

ఇది ఇలా ఉండగా బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో పదవ కంటెస్టెంట్ గా నాగ మణికంఠ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. షార్ట్ ఫిలిమ్స్ అలాగే వెబ్ సిరీస్ లలో నటించి బాగా పాపులర్ అయ్యాడు నాగ మణికంఠ. అలాగే చాలా తెలుగు సీరియల్ లలో కూడా నాగ మణికంఠ నటించడం జరిగింది. ఇలాంటి తరుణంలోనే బిగ్ బాస్ ఆఫర్ అతనికి వచ్చింది. దీనిపై అతడు మాట్లాడుతూ.. నాకు బిగ్ బాస్ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు అని తెలిపారు. తన కెరీర్ కు ఈ బిగ్ బాస్ చాలా ఉపయోగపడుతుందని వివరించాడు నాగమణికంఠ.

https://x.com/lyf_a_zindagii/status/1830307500853510573

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు