Bigg Boss : బ్రేకింగ్ న్యూస్..బిగ్ బాస్ నుంచి తప్పుకున్న కమల్ హాసన్..

Bigg Boss : బుల్లితెర పై టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న ఏకైక షో బిగ్ బాస్.. ప్రతి ఇండస్ట్రీలోనూ బిగ్ బాస్ ప్రసారం అవుతుంది. తెలుగు, తమిళ్, బాలీవుడ్ షోలకు ప్రజాధారణ ఎక్కువ అని తెలిసిందే. ఆ షోలకు చేస్తున్న హోస్ట్ల వల్ల అంత సక్సెస్ ను అందుకుంది. ఎక్కడో ఫారెన్ కంట్రీస్‌లో రప్ఫాడించిన ఈ షోను హిందీ వాళ్లు తీసుకొచ్చారు. ఆ తర్వాత రీజనల్ లాంగ్వేజ్‌లలో కూడా సూపర్ హిట్ అయి కూర్చుంది బిగ్ బాస్.. తెలుగులో హోస్ట్ లు మారారు. కానీ తమిళ్ లో మాత్రం మొదటి నుంచి కమల్ హాసన్ హోస్టుగా వ్యవహారిస్తున్నారు. తాజాగా ఆయన ఈ షో నుంచి తప్పుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి..

మొదటి సీజన్ నుంచి ఇప్పటివరకు కమల్ తన హోస్టింగ్ తో తమిళ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకున్నాడు. మిగిలిన అన్ని భాషల్లో కాంట్రావర్సీలకు కేరాఫ్ గా మారింది. కానీ తమిళ్ బిగ్ బాస్ లో మాత్రమే అలాంటివి పెద్దగా జరిగినట్లు తెలియలేదు. అయితే ఈ మధ్య కమల్ ఈ షో పై ఫోకస్ పెట్టలేక పోతున్నట్లు వార్తలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. అందుకే ఈ సారి సీజన్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రచారం జరుగుతుంది.. తాజాగా అదే నిజం అయ్యింది. ఈ షో నుంచి తప్పుకుంటున్నట్లు కమల్ హాసన్ ఒక నోట్ ను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ లెటర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

తనకు బిగ్ బాస్ షోపై పెద్దగా ఆసక్తి లేదని.. కేవలం తాను కొత్త‌గా పెట్టే పార్టీని న‌డ‌ప‌డానికి అవ‌స‌ర‌మైన డబ్బుల కోసమే ఈ షోను హోస్ట్ చేస్తున్నట్లు అప్పట్లో చెప్పాడు కమల్.. ఇప్పుడు షేర్ చేసిన పోస్ట్ లో ఈ షో నుంచి కొన్ని కారణాల వల్ల తప్పుకున్నట్లు చెప్పాడు. ఇప్పటివరకు నన్ను మీ కుటుంబంలో ఒకడిగా చూసుకున్న ఫ్యాన్స్ కు, బిగ్ బాస్ ఆడియన్స్ కు ధన్యవాదాలు అని రాసుకొచ్చాడు. కమల్ తప్పుకోవడంతో నెక్స్ట్ హోస్ట్ ఎవరనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తుంది. ఈయన స్థానంలోకి మరో స్టార్ హీరో శింబు రాబోతున్న‌ట్లు తమిళ మీడియాలో ప్ర‌చారం జరుగుతుంది. కమల్‌తో పోలిస్తే శింబుకు హోస్టింగ్ ఎక్స్‌పీరియన్స్ అయితే లేదు కానీ ఫ్యాన్ ఫాలోయింగ్ బాగుంది.. అందులో ఎంత నిజముందో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చెయ్యక తప్పదు..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు