Biggboss 8 : వచ్చిన తొలిరోజే గొడవలు షురూ.. ఇదే కదా మాక్కావాల్సింది!

Bigg Boss 8 : బుల్లితెర ప్రియులు రోజులుగా ఎదురుచూస్తున్న బిగ్ బాస్ సీజన్ మళ్ళీ వచ్చేసింది. కింగ్ నాగార్జున (Nagarjuna) హోస్ట్ గా బిగ్ బాస్ సీజన్ 8 రియాలిటీ షో ఫైనల్ గా సెప్టెంబర్ 1 నుండి ప్రారంభమైంది. ఇక మొదటి ఎపిసోడ్ లో మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వగా, ఇందులో పలు టీవీ సీరియల్స్ నటులు, సినిమా నటులతో పాటు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఎంట్రీ ఇచ్చారు. ఇక ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్స్ లో… సీరియల్ నటి యష్మి గౌడ మొదలు కొని వరుసగా… నటుడు నిఖిల్ మలియక్కల్, నటుడు అభయ్ నవీన్, హీరో ఆదిత్య ఓం, నటి సోనియా ఆకుల, ఇన్ఫ్లుయెన్సుర్ బెజవాడ బేబక్క, నటి కిరాక్ సీత, నటుడు నాగ మణికంఠ, నటుడు పృథ్వీరాజ్ శెట్టి, యాంకర్ విష్ణుప్రియ, డ్యాన్సర్ నైనిక , యూట్యుబర్ నబిల్ ఆఫ్రిది, నటి ప్రేరణ, ఆర్జే శేఖర్ బాషా ఎంట్రీ ఇచ్చారు.

Clashes started on the first day of Biggboss 8

 

- Advertisement -

తొలిరోజే గొడవలు షురూ..

ఇక బిగ్ బాస్ (Biggboss 8) హౌస్ లోకి అడుగుపెట్టిన తొలిరోజే గొడవలు స్టార్ట్ అయ్యాయని తెలుస్తూనే ఉంది. అసలు వీళ్ళలో ఎవరికీ సరిగా ఒకరిపై ఒకరు పరిచయం కూడా చేసుకోలేదు. అప్పుడే అలకలు, అపార్థాలు ఇంకా చెప్పాలంటే ఒకరోజు కూడా గడవకుండా అది చేయొద్దు, ఇది చేయొద్దు అని గొడవ మొదలెట్టేసారు. సోనియా, బేబక్క, ఆర్జే శేఖర్, నాగ మణికంఠ, యష్మి గౌడ ఇలా అందరూ తొలిరోజే తమ జులుం చూపిస్తున్నారు. నాగ మణికంఠ (Naga manikantha) అయితే మొదటిరోజే ఎలిమినేషన్ అని కంగారు పడి, అనిల్ రావిపూడి ప్రాంక్ కి తెగ ఎమోషనల్ అయిపోయి నవ్వులపాలయిన విషయం తెలిసిందే. ఇక తాజాగా ఓ హౌస్ లో కుక్ చీఫ్ కోసం టాస్క్ మొదలవగా దానికోసం అప్పుడే అలకలు స్టార్ట్ చేశారు.

జనాలకు కావాల్సిందే ఇది!

ఇక బిగ్ బాస్ హౌస్ లో చీఫ్ పోస్ట్ కోసం ఓ టాస్క్ మొదలవగా, ముందు బేబక్క యష్మి గౌడ మధ్య గొడవ స్టార్ట్ చేయగా, ఆ తర్వాత వెంటనే సోనియా వాయిస్ రేస్ చేసింది. ఇక ఈ క్రమంలో ఓ పండు గురించి కూడా ఆర్జే శేఖర్ తో గొడవ పెట్టుకుంది. ఇదిలా ఉండగా మరోవైపు నాగమణికంఠ అప్పుడే తన కష్టాలు చెప్పడం స్టార్ట్ చేసాడు. అతను ఎలాంటి కష్టాలు పడ్డా, హౌస్ లో మాటిమాటికి చెప్తే, ఆడియన్స్ దృష్టిలో దిగజారిపోయి ఛాన్స్ ఉంది. మరి కెప్టెన్ లేని ఈ హౌస్ లో ముందుగా అందరూ ఆటలో కాకుండా మిగతా టైం లో అయినా కలిసి ఉంటే, ఒకరితో ఒకరు అర్ధం చేసుకునే ఛాన్స్ ఉంటుంది. లేదా ఎంట్రీ ఇచ్చిన రోజే ఒకరి మీద అభిప్రాయం డిసైడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అది చాలా రోజులు కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు