Biggboss season7: ఓట్ అప్పీల్ లో ఫేవరిజమా?

బిగ్ బాస్ హౌస్ లో ఈ వారం మొత్తం ఆడియన్స్ ఓట్ అప్పీల్ టాస్క్ జరుగుతుందన్న విషయం తెలిసిందే. అయితే ఈ టాస్క్ లో బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ పోటీ చేస్తుండగా ఎక్కువగా ఫన్ టాస్క్ ఛాలెంజ్ లతోనే ఈ టాస్క్ లు పెట్టడం జరిగింది. పైగా ఈ ఛాలెంజ్ లో ఎక్కువగా ఫిజికల్ టాస్క్ లు ఉండకుండా బిగ్ బాస్ చూసుకుంటున్నాడు. అయినా సరే కంటెస్టెంట్స్ ఒక్కోసారి ఫిజికల్ గేమ్ లానే భావించి ఆడుతున్నట్టు షో చూసే వారికి అర్ధమవుతుంది.

ఇక ఈ టాస్క్ ఫస్ట్ టైం పెట్టినపుడు శోభా, యావర్ ఫైనలిస్ట్ కాగా అందులో సపోర్ట్ శోభా కి రావడంతో శోభా ఓట్ అప్పీల్ చేసుకుంది. ఇక రెండో సారి మళ్ళీ ఈ టాస్క్ జరగగా ఈ ఛాలెంజ్ లో అమర్ దీప్, అంబటి అర్జున్ ఫైనలిస్ట్ లుగా నిలవగా ఈ టాస్క్ లో ఎక్కువగా సపోర్ట్ అర్జున్ కి వచ్చింది. సింపుల్ గా చెప్పాలంటే స్పా బ్యాచ్ అమర్ దీప్ కి , స్పై బ్యాచ్ అర్జున్ కి సపోర్ట్ చేసారు.

అయితే ఈ ప్రాసెస్ లో యావర్ అర్జున్ కి సపోర్ట్ చేస్తుంటే అమర్ దీప్ యావర్ ఫేవరిజం చూపిస్తున్నాడని, అర్జున్ లైక్ చేయడం కోసం ఇస్తున్నాడు తప్ప డిసర్వ్ కాదని అన్నాడు. దీంతో యావర్ ఈ మాట ను అస్సలు ఒప్పుకోలేక ఇక్కడ ఫేవరిజం ఎవ్వరు చూపించట్లేదు, ఇప్పుడు కూడా అర్జున్ కి నాకు మాటలు లేవు అని అన్నాడు. అయితే వీళ్ళిద్దరిలో ఎవరు ఓట్ అప్పీల్ చేసుకున్నారో తెలియాలంటే ఈరోజు రాత్రి షో వరకు వెయిట్ చేయాలి.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు