స్టార్ మా లో బిగ్ బాస్ సీజన్ 7 ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. ఈ సీజన్ మొదలైనప్పటి నుండి అంతా ఉల్టా పల్టా గా సాగుతుందని బిగ్ బాస్ చెప్పగా, ముందు నుండి రివర్స్ గేర్ లో టాస్క్ లు గేమ్ లు ఆడుతున్నారు. అయితే ఈ సీజన్లో ముందు నుండి కాస్త దూరంగా ఉంటూ వస్తుంది అమర్ దీప్, పల్లవి ప్రశాంత్. ప్రశాంత్ వచ్చిన కొత్తలో చాలా సేఫ్ గేమ్ ఆడడం వల్ల ట్రోలింగ్ కు కూడా గురయ్యాడు. అది వేలెత్తి చూపించిన అమర్ దీప్ అప్పుడు హైలెట్ అయ్యాడు.
అయితే ఆ ఇష్యూ జరిగినప్పటినుండీ అమర్ దీప్ ప్రశాంత్ ని చాలా సార్లు టార్గెట్ చేసాడు. చాలా సార్లు రియాలిటీ లోకి వచ్చి గేమ్ ఆడమని చెప్పాడు. అప్పుడు అమర్ కి సందీప్ వంత పాడగా, ప్రశాంత్ కి శివాజీ సపోర్ట్ చేస్తూ వచ్చాడు. మొన్న జరిగిన నామినేషన్లో కూడా అమర్ శివాజీని నామినేట్ చేస్తూ ప్రశాంత్ మాత్రమే సపోర్ట్ చేస్తున్నారంటూ తప్పు బట్టాడు.
అయితే అనూహ్యంగా తాజాగా జరిగిన ఓ టాస్క్ లో యావర్ సంచాలక్ గా ఉండగా, అమర్ దీప్ కి ప్రశాంత్ కి సంచాలక్ గా యావర్ అన్యాయం చేశాడంటూ ,ఇద్దరూ మాటల యుద్ధానికి దిగారు. అయితే ఇక్కడ యావర్ సంచాలక్ గా సరైన సమాధానాలే ఇచ్చినప్పటికీ వీళ్ళందరూ కలిసి యావర్ ని బాధ్యుడ్ని చేసారు.
ఇక్కడి వరకు రొటీన్ గానే ఉన్నా, ఎప్పుడూ తనపై ఫైర్ అయ్యే అమర్ తో ప్రశాంత్ ఈసారి ఏకీభవించడం ఆశ్యర్యంగా ఉంది. ఇన్ని రోజులు యావర్ కి సపోర్ట్ గా ఉన్న ప్రశాంత్, ఒక్క టాస్క్ రిజల్ట్ తో తనతో ఎప్పుడూ వాదించే అమర్ దీప్ సైడ్ కి వెళ్లడమేంటో బిగ్ బాస్ లవర్స్ కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు. మిడ్ నైట్ జరిగిన సంభాషణ లో ఇద్దరూ యావర్ గురించి ప్రశాంత్ ప్రస్తావిస్తూ, తెలుగు రాదు, నిరూపించుకోలేదు అని, ఇంకా అందరి దృష్టిలో బ్యాడ్ అయిపోయాడు అని బిల్డప్ ఇస్తూ చిచ్చు రేపుతున్నాడు. దానికి అమర్ కూడా వంత పాడాడు. ఏది ఏమైనా ఈ ప్రోమో ద్వారా ప్రశాంత్ అమర్ దీప్ సైడ్ వెళ్తాడేమో అనిపిస్తుంది.
Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the
Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.