Jyothi Rai: బిగ్ బాస్ ఆఫర్ ని రిజెక్ట్ చేసిన బుల్లితెర నటి.. కారణం..?

Jyothi Rai.. తెలుగు బుల్లితెర పై కన్నడ నటీమణులు సైతం ఒక హవా నడిపిస్తూ ఉన్నారు. అలాంటి వారిలో నటి జ్యోతి రాయ్ కూడా ఒకరు. గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్నది. ఈ సీరియల్ లో హీరో రిషి తల్లి పాత్రలో జ్యోతిరాయ్ చాలా అద్భుతంగా నటించింది. అప్పటి నుంచి ఈమె క్రేజ్ భారీగా పెరిగిపోయింది. తెలుగు ఆడియన్స్ కూడా జగతి పాత్రలో నటించిన జ్యోతి రాయ్ కట్టుబొట్టుకి ఫిదా అయ్యారు. దీంతో ఈమెకు తెలుగులో కూడా చాలా సీరియల్స్ లో నటించే అవకాశం వచ్చింది.

Jyothi Rai: TV actress who rejected Bigg Boss offer.. Reason..?
Jyothi Rai: TV actress who rejected Bigg Boss offer.. Reason..?

బిగ్ బాస్ లో అవకాశం..

ఈ మధ్యకాలంలో జ్యోతి రాయ్ సీరియల్స్ నుంచి తప్పుకొని పలు రకాల సినిమాలు , వెబ్ సిరీస్లలో నటిస్తూ ఉన్నది. ఇటీవలే ఒక వెబ్ సిరీస్ కి సంబంధించి పలు రకాల హాట్ ఫోటోలను కూడా షేర్ చేస్తూ ఉన్నది జ్యోతి రాయ్. ఏకంగా రెండు మూడు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తోంది. మితిమీరిన గ్లామర్ షో చేస్తూ కుర్రాళ్లను మరింత ఆకట్టుకునేలా చేస్తోంది జ్యోతిరాయ్.. అయితే తాజాగా ఈ అమ్మడికి బిగ్బాస్ నుంచి ఆఫర్ వచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అది తెలుగు నుంచి కాదు కేవలం కన్నడ బిగ్ బాస్ నుంచి ఆఫర్ వచ్చిందట.కానీ ఈమె రిజెక్ట్ చేసినట్టుగా తెలియజేసింది వాటి గురించి చూద్దాం.

బిగ్ బాస్ -11 లోకి నో ఎంట్రీ..

జ్యోతి రాయ్ బిగ్ బాస్ -11 లో అవకాశం పై స్పందిస్తూ తనకు అవకాశం వచ్చింది కానీ ఈ ఆఫర్ ని తాను కొన్ని కారణాల చేత రిజెక్ట్ చేశానంటూ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేసింది. ప్రస్తుతం తాను చేస్తున్న సినిమాలు, సీరియల్స్ వల్ల షో కి వెళ్లలేను. తనకు ఇంత సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క అభిమానికి కూడా ధన్యవాదాలు అంటూ ఈమె తెలియజేసింది. ప్రస్తుతం బిగ్ బాస్ కన్నడలో కంటెస్టెంట్ గా ఈమె లేనట్టు క్లారిటీ ఇచ్చేసింది.

- Advertisement -

జ్యోతిరాయ్ వ్యక్తిగత జీవితం..

జ్యోతిరాయ్ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. చిన్న వయసులోనే వివాహం చేసుకొని కొన్ని కారణాల చేత భర్త నుండి విడిపోయింది.. అయితే ప్రస్తుతం మాత్రం డైరెక్టర్ సుకుపూర్వాజ్ తో గత కొన్నేళ్లుగా డేటింగ్ చేస్తున్నట్లు తెలియజేసింది. త్వరలోనే వివాహం చేసుకుంటారని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ విషయం పైన మాత్రం ఇద్దరూ క్లారిటీ ఇవ్వలేదు. జ్యోతి రాయ్ హౌస్ లోకి వెళ్లడం వల్ల టిఆర్పి రేటింగ్ కాస్త పెరుగుతుందని భావించిన మేకర్స్ కి జ్యోతిరాయ్ నిరాశనే మిగిల్చింది. అయితే అభిమానులు మాత్రం బిగ్ బాస్ షో కి వెళ్లకపోవడమే మంచిదయ్యింది.. ఉన్న ఇమేజ్ కాస్త డామేజ్ అవుతుంది అన్నట్లుగా కామెంట్స్ చేస్తున్నారు. గతంలో కూడా చాలామంది నటులు హౌస్ లోకి వెళ్లి తమ కెరియర్ ని కోల్పోయారు అంటూ తెలియజేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు