BiggBoss8 : నామినేషన్స్ లో ఎలిమినేట్ ఛాన్స్ ఇతనికే ఎక్కువని తేల్చేసిన అభయ్..

Biggboss 8 : బిగ్ బాస్ సీజన్ 8 స్టార్ మా లో జోరుగా సాగుతుంది. సెప్టెంబర్ 1న మొదలైన ఈ రియాలిటీ షో మొదటి రోజు నుండే ఆడియన్స్ ని అట్రాక్ట్ చేయగా, తోలి రెండు రోజులు చప్పగా సాగింది. ఇక ఎప్పట్లాగే నాగార్జున (Nagarjuna) హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షో లో 14 మంది కంటెస్టెంట్స్ తమ తమ ఆటతో ఆడియన్స్ ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక వచ్చిన రెండో రోజే బిగ్ బాస్ లో చీఫ్ టాస్క్ లు పెట్టగా అందులో ముగ్గురు చీఫ్ లుగా ఎన్నికైన విషయం తెలిసిందే. నిఖిల్, నైనిక, యష్మి గౌడ (Yashmi gowda) హౌస్ చీఫ్ లుగా ఎన్నికయ్యారు. ఇదిలా ఉండగా ఈ హౌస్ లో చీఫ్ లుగా ఉన్న ఈ ముగ్గురి చీఫ్స్ ని వాళ్ళ క్లాన్ ని నిర్మించునేందుకు బిగ్ బాస్ సరికొత్త టాస్క్ ని పెట్టాడన్న విషయం తెలిసిందే.

Naga manikantha has a chance of eliminate in BiggBoss8 this week

ఎలిమినేట్ ఛాన్స్ ఇతనికే ఎక్కువ – అభయ్

ఇదిలా ఉండగా హౌస్ లో టాస్క్ అయ్యాక కంటెస్టెంట్స్ ఎవరికీ వారు హౌస్ లో తమ తమ పనుల్లో బిజీ అయ్యారు. ఈ క్రమంలో అభయ్, విష్ణు ప్రేరణ, శేఖర్ బాషా, నబీల్ కుకింగ్ హౌస్ దగ్గర ఉన్నారు. అయితే అక్కడ నామినేషన్స్ లో ఉన్నది ఎవరూ.. అన్న టాపిక్ వచ్చింది. ఈ క్రమంలో డిస్కషన్ చేస్తూ.. నామినేషన్స్ లో పృత్వి రాజ్ శెట్టి, బేబక్క, విష్ణు ప్రియ, నాగమణికంఠ, శేఖర్ బాషా, సోనియా ఉన్నట్టు తెలపగా, ఈ నామినేషన్స్ లో ఎలిమినేషన్ ఛాన్స్ ఎక్కువగా ఎవరికీ ఉందొ అన్న టాపిక్ రాగా, అభయ్ ఎలిమినేషన్ ఛాన్స్ నాగమణికంఠ కు ఎక్కువ ఉందని ప్రేరణతో చెప్పాడు. ఈ విషయంపై సోషల్ మీడియాలో భిన్న కామెంట్స్ వస్తున్నాయి.

- Advertisement -

ఈ ఇద్దరిలో ఒక్కరు?

అయితే అభయ్ ఇలా నాగమణికంఠ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందని తేల్చేసేసరికి నెట్టింట రెండు రకాల కామెంట్స్ వస్తున్నాయి. అభయ్ ని అలా ఎలా డిసైడ్ చేస్తావని కౌంటర్ వేస్తుండగా, మరి కొందరు గేమ్ స్ట్రాటజీ ప్రకారం కరెక్ట్ గానే ఊహించి చెప్పాడని అంటున్నారు. ఇదిలా ఉండగా వారం రోజుల పెర్ఫార్మన్స్ ని బట్టి నామినేట్ అయిన వాళ్లలో కూడా నాగమణికంఠ, అలాగే బేబక్క ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇది తెలియాలంటే ఈ ఆదివారం దాకా వెయిట్ చేయాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు