Biggboss 8 : బిగ్ బాస్ సాక్షిగా శేఖర్ బాషాకు సూపర్ గుడ్ న్యూస్ చెప్పిన నాగార్జున.. ఇంతకంటే ఏం కావాలి!

Biggboss 8 : బిగ్ బాస్ సీజన్ 8 రియాలిటీ షో స్టార్ మా లో మంచి రేటింగ్స్ తో దూసుకుపోతుంది. సెప్టెంబర్ 1న మొదలైన ఈ రియాలిటీ షో మొదటి రోజు నుండే ఆడియన్స్ ని అట్రాక్ట్ చేయగా, మొదటి వీకెండ్ చప్పగా సాగినా, ఆ తర్వాత టాస్క్ లతో, నామినేషన్లతో ఊపందుకుంది. ఇక ఈ సీజన్లో ఎంట్రీ ఇచ్చిన 14 మంది కంటెస్టెంట్స్ లో ఫస్ట్ వీక్ బేబక్క ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. ఇక ఈ బిగ్ బాస్ షో లో కెప్టెన్ కి బదులుగా, హౌస్ చీఫ్ లుగా నిఖిల్, నైనిక, యష్మి గౌడ ఎన్నికయ్యారు. ఇక హౌస్ లో అందరూ తమ తమ ఆటతీరుతో ఆకట్టుకుంటుండగా, సీనియర్ గా ఎంట్రీ ఇచ్చిన ఆర్జే శేఖర్ బాషా (Sekhar basha) కూడా తన ఆటతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. మొదటివారం పెద్దగా ఆడకపోయినా, తన పంచ్ లతో ప్రాసలతో బాగానే అలరించాడు.

Nagarjuna gave good news to Shekhar Bhasha in Biggboss 8 house

శేఖర్ బాషాకు గుడ్ న్యూస్ చెప్పిన నాగార్జున…

ఇక శేఖర్ బాషా ఒక ‘ఆర్జే’ అని తెలిసిందే. అందుకే ఇక్కడ తన టాలెంట్ ని మొత్తం చూపిస్తుండగా, బిగ్ బాస్ హౌస్ లో ప్రతి ఒక్కరి మీద పంచ్ లు వేస్తూ, ఆట పరంగా కాకుండా ఈ విధంగా అట్రాక్ట్ చేసాడు శేఖర్. ఇక నామినేషన్స్ లో సీరియస్ గా ఉన్న టైం లో కూడా శేఖర్ బాషా తనదైన డైలాగ్ డెలివరీతో ఆడియన్స్ ని తనవైపు తిప్పుకున్నాడు. అయితే ఈ వారం నామినేషన్స్ లో తాను కూడా ఉండగా, ఫైనల్ గా శనివారం వీకెండ్ వచ్చేసరికి, నాగర్జున (Nagarjuna) మళ్లీ వచ్చేసి ఎలిమినేషన్ డే హీట్ తీసుకొచ్చాడు. అయితే దీనికంటే ముందు నాగార్జున కంటెస్టెంట్ శేఖర్ భాషకి అదిరిపోయే స్వీట్ గుడ్ న్యూస్ ఇచ్చాడు.

- Advertisement -

ఇంతకంటే ఆనందముంటుందా?

ఇక బిగ్ బాస్ సీజన్ 8 (Biggboss 8) లో రెండో శనివారం రాగా, ఈ వారం కూడా పలు కారణాలతో కంటెస్టెంట్స్ కి క్లాస్ చెప్పడానికి నాగార్జున వచ్చేసాడు. తాజాగా ప్రోమో రిలీజ్ కాగా, అందులో ఒక సూపర్ గుడ్ న్యూస్ వచ్చింది. అయితే నాగార్జున వచ్చీ రాగానే శేఖర్ బాషాకి స్వీట్ గుడ్ న్యూస్ చెప్పాడు. శేఖర్ బాషా వైఫ్ కి ప్రెగ్నెన్సీ డెలివరీ సాఫీగా జరిగిందని, తనకు “హెల్తీ బేబీ బాయ్” పుట్టాడని నాగార్జున చెప్పుకొచ్చాడు. అంతే కాదు తల్లి బిడ్డ చాలా హెల్తీ గా సంతోషంగా ఉన్నారని నాగార్జున శేఖర్ బాషాకి ధైర్యం చెప్పాడు. ఈ న్యూస్ వినగానే శేఖర్ బాషా ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇక హౌస్ లో కంటెస్టెంట్స్ అందరూ శేఖర్ బాషాని హగ్ చేసుకుని స్పెషల్ గా విషెస్ చెప్పారు. ఇక ఈ ప్రోమో చుసిన నెటిజన్లు శేఖర్ భాషకి కంగ్రాట్స్ చెప్తూ, శేఖర్ బాషాకి లైఫ్ లో ఇంతకన్నా పెద్ద సంతోషం ఉండదని కామెంట్స్ చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు