Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ హోస్ట్ గా తప్పుకున్న నాగార్జున.. కొత్త హోస్టుగా ఆ హీరో ?

Bigg Boss Telugu 8 : బుల్లి తెర తెలుగు ఆడియన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్ బాస్ సీజన్ 8 రియాలిటీ షో సెప్టెంబర్ 1 నుంచి స్టార్ మా ఛానల్ లో గ్రాండ్ గా ప్రారంభం కానుంది. ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోలు ఇప్పటికే విడుదల అయ్యాయి. ఆ ప్రోమోలు ఎంతగా వైరల్ అయ్యాయి చూశాం. ఈ సారి సరికొత్త కాన్సెప్ట్ తో మరోసారి మన ముందుకు రాబోతుందని ఈ ప్రోమోలు చూస్తేనే అర్థం అవుతుంది. అయితే కంటెస్టెంట్స్ కి సంబంధించిన ప్రోమో షూటింగ్స్ కూడా గత వారం లోనే పూర్తి చేసారు. అలాగే ఈ ఆఖరి తేదీలలో కంటెస్టెంట్స్ కి సంబంధించిన డ్యాన్స్ పెర్ఫార్మన్స్ షూటింగ్స్ కూడా చెయ్యబోతున్నారు. అంతా బాగానే ఉంది కానీ, సోషల్ మీడియా లో ఇప్పుడు వినిపిస్తున్న ఒక రూమర్ సంచలనంగా మారింది. బిగ్ బాస్ హోస్ట్ గా నాగార్జున తప్పుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నాగ్ ప్లేసులో కొత్త హీరో రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆ హీరో ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..

మూడో సీజన్ నుంచి నాగార్జున హోస్ట్ గా వ్యవహారిస్తున్నారు. ఈ షో కి హోస్ట్ గా అక్కినేని నాగార్జున వ్యవహరించబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. అయన పై వస్తున్న భూ కబ్జా ఆరోపణల వల్ల ఆయన హోస్ట్ గా తప్పుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్ లోని మాధాపూర్ లో ఉన్నటువంటి నాగార్జున కి సంబంధించిన ఆస్తి ఎన్ కన్వెన్షన్ హాల్ ని తెలంగాణ ప్రభుత్వం అక్రమ కట్టడంగా పరిగణించి కూల్చేసిందని, దీని ప్రభావం వల్ల నాగార్జున ప్రస్తుతం హోస్ట్ గా వ్యవహరించే మూడ్ లో లేడని ఓ వార్త వినిపిస్తుంది. ఇక ఆయన స్థానంలో దగ్గుబాటి రానా కొత్త హోస్ట్ గా రాబోతున్నాడు అంటూ వార్తలు ప్రచారం అయ్యాయి. అయితే ఇవన్నీ కేవలం రూమర్స్ మాత్రమే అని బిగ్ బాస్ టీం కి చెందిన సన్నిహిత వర్గాల నుండి సమాచారం వచ్చింది. నాగార్జున తో రేపటి నుండే బిగ్ బాస్ సీజన్ 8 లాంచ్ ఎపిసోడ్ కి సంబంధించి షూటింగ్ మొదలు కాబోతుందని, సోషల్ మీడియా లో వస్తున్నా వార్తలు పూర్తిగా అవాస్తవం అని క్లారిటీ ఇచ్చారు.

Nagarjuna who left as the host of Bigg Boss.. The hero as the new host?
Nagarjuna who left as the host of Bigg Boss.. The hero as the new host?

అయితే ఈ రూమర్ పుట్టడానికి ప్రధాన కారణం బిగ్ బాస్ సీజన్ 2 కంటెస్టెంట్ బాబు గోగినేని. ఈయన నిన్న తన సోషల్ మీడియా ద్వారా ఒక పోస్టు వేస్తూ ‘ అక్రమ కట్టడాల పై దారుణమైన ఆరోపణలు ఎదురుకుంటున్న తమ బిగ్ బాస్ షో హోస్ట్ అక్కినేని నాగార్జున ని షో నిర్వాహకులు తక్షణమే మార్చాలి. లేకపోతే హౌస్ మేట్స్, టీవీ వీక్షకులు ఓట్లు వేసి మరీ ఎలిమినేట్ చెయ్యాలి’ అంటూ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ ఏ రేంజ్ లో దుమారం రేపిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇకపోతే ఇప్పటికే పలు యూట్యూబ్ చానెల్స్ నాగార్జున బిగ్ బాస్ షో నుండి తప్పుకుంటున్నట్టు వార్తలను స్ప్రెడ్ చేస్తున్నారు.. దాంతో నాగ్ ప్లేసులో కుర్ర హీరోను తీసుకురాబోతున్నట్లు సమాచారం. ఇకపోతే ఈ సీజన్ ఈసారి 16 వారాల వరకు కొనసాగే అవకాశం ఉందని అంటున్నారు. ఇక 23 కంటెస్టెంట్స్ హౌస్ లోకి అడుగుపెట్టబోతున్నారు అంటూ వార్తలు వినిపించాయి. కానీ ఇప్పుడు లేటెస్ట్ గా వినిపిస్తున్న వార్త ఏమిటంటే, కేవలం 17 మందిని మాత్రమే హౌస్ లోకి పంపిస్తారని. మిగిలిన వారిని వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా పంపనున్నట్లు సమాచారం.. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు