Biggboss 8 : ఆడియన్స్ మనసును గెలుచుకున్న నిఖిల్.. నాగమణికంఠ కోసం స్టాండ్ తీసుకున్నాడు..

Biggboss 8 : బిగ్ బాస్ సీజన్ 8 స్టార్ మా లో ఇప్పుడిప్పుడే ఊపందుకుంటుంది. సెప్టెంబర్ 1న మొదలైన బిగ్ బాస్ రియాలిటీ షో మొదటి రోజు నుండే ఆడియన్స్ ని అట్రాక్ట్ చేయగా, తోలి రెండు రోజులు చప్పగా సాగింది. ఇక ఎప్పట్లాగే నాగార్జున (Nagarjuna) హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షో లో 14 మంది కంటెస్టెంట్స్ తమ తమ ఆటతో ఆడియన్స్ ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక వచ్చిన రెండో రోజే బిగ్ బాస్ లో చీఫ్ టాస్క్ లు పెట్టగా అందులో ముగ్గురు చీఫ్ లుగా ఎన్నికైన విషయం తెలిసిందే. నిఖిల్, నైనిక, యష్మి గౌడ (Yashmi gowda) హౌస్ చీఫ్ లుగా ఎన్నికయ్యారు. ఇదిలా ఉండగా ఈ హౌస్ లో చీఫ్ లుగా ఉన్న ఈ ముగ్గురి చీఫ్స్ ని వాళ్ళ క్లాన్ ని నిర్మించునేందుకు బిగ్ బాస్ సరికొత్త టాస్క్ ని పెట్టాడన్న విషయం తెలిసిందే.

Nikhil supported Naga Manikantha in Biggboss 8

నాగమణికంఠ కోసం స్టాండ్ తీసుకున్న నిఖిల్..

ఇకపోతే బిగ్ బాస్ (Biggboss 8) పెట్టిన టాస్క్ లో హౌస్ లో చీఫ్ లుగా నిలిచిన వాళ్లలో యష్మి గౌడ, నైనిక (Nainika) టీం లో చెరో నలుగురు చేరగా, నిఖిల్ టీం లో ముగ్గురు చేరిపోయారు. అయితే హౌస్ లో ఉన్న ముగ్గురు చీఫ్స్ లో ముందుగా టీం కంటెస్టెంట్స్ ని ఎన్నుకునే ముందు తమ టీమ్స్ లో ఎవర్ని తీసుకోవలో డిస్కషన్ కూడా జరిగింది. ఈ క్రమంలో నైనికా, యష్మి – నాగమణికంఠను తమ టీమ్ లోకి తీసుకుంటామని అన్నారు. కానీ నాగమణికంఠ (Nagamanikantha) వచ్చినపుడు ఎవరూ నిల్చోలేదు. ఈ సమయంలో నిఖిల్ నిల్చుని నాగమణికంఠను తన టీమ్ లో తీసుకుంటున్నాని చెప్పాడు. హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుండి చాలామందికి నాగమణికంఠ పై చాలామందికి హౌస్ లో ఉండడని నెగిటివ్ ఫీలింగ్ కలిగింది. ఈ క్రమంలో నాగమణికంఠ కు అండగా నిఖిల్ నిల్చున్నాడు.

- Advertisement -

అందరి మనసులు గెల్చుకున్న నిఖిల్..

ఇక నాగమణికంఠ తన ధైర్యం కోల్పోయినప్పుడు కూడా నిఖిల్ (Nikhil) తనకు సపోర్ట్ గా మాట్లాడి ధైర్యం చెప్పాడు. ఇప్పుడు కూడా మణికంఠని టీమ్ లోకి ఎవరూ తీసుకోకపోతే, సమయం మించి పోకుండా నిఖిల్ నిల్చుని తన టీం లోకి తీసుకున్నాడు. ఈ విషయం గురించి తర్వాత హాల్ లో అభయ్, నిఖిల్, పృత్వి, విష్ణు ప్రియ మధ్య డిస్కషన్ జరిగినపుడు, అభయ్ మాట్లాడుతూ.. నువ్వుగాని నిల్చోకపోతే అక్కడ మణికంఠని ఎవ్వరూ తీసుకునేవాళ్ళు కాదు అని తనని ప్రశంసించాడు. ఇక ఆడియన్స్ కూడా తమ నిఖిల్ తన మంచితనంతో మనసులు గెలుచుకున్నాడని నెట్టింట ప్రశంసలు కురిపిస్తున్నాడు. ఇటు నాగమణికంఠకు కూడా తన ఆటతీరు మెరుగుపరుచుకునేందుకు మరో అవకాశం వచ్చిందని చెప్పాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు