Biggboss season 7: మరోసారి తన గ్రాఫ్ ని అమాంతం పెంచుకున్న యావర్!

టెలివిజన్ లో బిగ్ బాస్ సీజన్ 7 లో ఇండస్ట్రీ కి పెద్దగా పరిచయం లేని వ్యక్తి గా ఎంట్రీ ఇచ్చిన యావర్ బిగ్ బాస్ లో తన ఆటతీరు తో ఎంత ఫాలోయింగ్ తెచ్చుకున్నాడో తెలిసిందే. ముందు కొన్ని సీరియల్స్ లో చిన్న చిన్న రోల్స్ చేసినా పెద్దగా గుర్తింపు రాలేదు. ఆ తర్వాత ఒక మోడల్ గా సక్సెస్ అయ్యాడు. అయితే బిగ్ బాస్ లోకి వచ్చిన ఫస్ట్ వీక్ లోనే యావర్ ఎలిమినేట్ కావాల్సింది. లక్కీ గా బయటపడ్డాడు.

ఇక అక్కడి నుండి ప్రతి వారం ఎదో ఒకవిధంగా నామినేట్ అవుతున్నా, తన ఆటతో ఆడియన్స్ ని మెప్పిస్తూ వచ్చాడు. ఇక బిగ్ బాస్ లో రెండో కెప్టెన్ కూడా అయిన యావర్, రీసెంట్ గా ఎవిక్షన్ పాస్ లో గెలిచినా, మిస్టేక్ చేసాడని నాగ్ చెప్పడంతో అడగకుండానే, తన తెలియక చేసిన తప్పయినా, ఎవిక్షన్ పాస్ ని వెనక్కి ఇచ్చేసి ఆడియన్స్ ద్రుష్టి లో తన గ్రాఫ్ ని పెంచుకున్నాడు.

ఇప్పుడు మరోసారి అర్జున్ కోసం శివాజీ ఒక్క మాట చెప్పగానే కెప్టెన్సీ టాస్క్ నుండి తప్పుకుని హైలెట్ అయ్యాడు. ఆడియన్స్ లో అమాంతం తన ఫాలోయింగ్ ని పెంచుకున్నాడు. అయితే బిగ్ బాస్ మాత్రం శివాజీ, శోభా లేట్ గా డెసిషన్ చెప్పినందుకు కెప్టెన్సీ ని రద్దు చేసాడు. ఇక శనివారం నాగార్జున వోటింగ్ పద్ధతి లో కెప్టెన్ ని డిసైడ్ చేసే ఛాన్స్ ఉంది. ఏది ఏమైనా యావర్ తన గేమ్ ని ఆడుతూ, భాష సమస్య వచ్చినా, తన మంచి ప్రవర్తనతో ఆట తో, ఆడియన్స్ ని మెప్పిస్తూ టాప్ 5 లోకి దూసుకుపోతున్నాడు.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు