Pallavi Prashanth: రైతు బిడ్డ సెంటిమెంటుని మళ్ళీ రుద్దడం మొదలెట్టాడు?

టెలివిజన్ లో దూసుకుపోతున్న బిగ్ బాస్ సీజన్ 7 రోజురోజుకి కొత్త మలుపులు తీసుకుంటుంది. ఈ సీజన్ అంతా ఉల్టా పల్టా అవ్వడం వల్ల బిగ్ బాస్ సీజన్ 7 లో టాప్ లో ఉన్న వాళ్ళ కంటే లౌ లో ఉన్నవాళ్ళకి ఎక్కువ ఛాన్సులు వస్తున్నాయి. ఇంతకు ముందు కూడా గౌతమ్ కి, రతిక లకి బిగ్ బాస్ ఇలాగే రెండో ఛాన్స్ ఇవ్వడం జరిగింది. ఇక బిగ్ బాస్ హౌస్ లో ఈ వారం టాప్ 10 లో ఎవరు ఏ ప్లేస్ లో ఉంటారో అని బిగ్ బాస్ హౌస్ సభ్యులనే నిర్ణయించుకోమనగా, ఈ టాస్క్ లో ఎవరికీ వారు తాము టాప్ 5 లో ఉండాలనే ఎక్కువగా ట్రై చేస్తున్నట్టు తెలుస్తుంది.

అయితే ఈ టాస్క్ లో శివాజీ తనకి తానుగా కాకుండా పల్లవి ప్రశాంత్ ని ఫస్ట్ ప్లేస్ ని ఇవ్వడంపై హౌస్ మేట్స్ అంగీకరించలేదు. ఈ పాయింట్ పై మళ్ళీ కన్నీళ్లు కార్చిన పల్లవి ప్రశాంత్ చాలా రోజుల తరువాత రైతు బిడ్డ పదం వాడాడు. ఒక రైతు బిడ్డ తలుచుకుంటే ఏమైనా చేస్తాడు అంటూ, పాత డైలాగుల్ని రిపీట్ చేయడం స్టార్ట్ చేసాడు.

అయితే ఈ మాటలపై హౌస్ మేట్స్ ఎక్కువ సీరియస్ గా తీసుకోరని అనిపిస్తుంది. ఎందుకంటే పల్లవి ప్రశాంత్ మళ్ళీ సెంటిమెంటు డైలాగులతో జనాల్ని అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. మరి ఈసారైనా జనాలు అప్డేట్ అయ్యి ఆ సెంటిమెంట్ కి లొంగకుండా ఆట ప్రకారం ఓట్లు వేసి సపోర్ట్ చేయాలనీ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు