BiggBoss 8 : ఓరిని.. ఫేస్ వాష్ మార్చండయ్యా బాబు.. పృథ్వి పేస్ట్ అని వేసుకుంటున్నాడు

BiggBoss 8 : బుల్లితెర పై బిగ్ బాస్ సీజన్ 8 మంచి వ్యూయర్షిప్ తో దూసుకుపోతుంది. ఏడేళ్లుగా ప్రేక్షకులని అలరిస్తున్న బిగ్ బాస్ రియాలిటీ షో 8వ (BiggBoss 8) సీజన్ సెప్టెంబర్ 1న మొదలై బుల్లితెరపై సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది. ఇక కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షో లో 14మంది కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇవ్వగా, మంచి పెర్ఫార్మన్స్ తో ఆడియన్స్ ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక వచ్చిన రెండో రోజే బిగ్ బాస్ లో చీఫ్ టాస్క్ లు పెట్టగా అందులో ముగ్గురు చీఫ్ లుగా ఎన్నికైన విషయం తెలిసిందే. ఇక ఆ వెంటనే నామినేషన్ల ప్రక్రియ మొదలవగా, నాగమణికంఠ, ప్రేరణ, శేఖర్ బాషా, పృత్వి, సోనియా తదితరులు నామినేట్ అయ్యారు. ఇదిలా ఉండగా బిగ్ బాస్ షో లో తాజాగా ఓ ఫన్నీ ఇన్సిడెంట్ చోటుచేసుకుంది.

Prithvi Raj Funny Incident in BiggBoss 8

ఫేస్ వాష్ ని పేస్ట్ అని వేసుకున్న పృత్వి…

అయితే నామినేషన్ల ప్రక్రియ పూర్తయ్యాక హౌస్ లో రోజు దిన చర్యల్లో భాగంగా అందరూ తమ తమ కార్యకలాపాల్ని పూర్తి చేసుకుంటున్నారు. ఈ క్రమంలో హాల్ లో కూర్చుని ఉండగా, ఒక్కొక్కరు వాష్ రూమ్ కి వెళ్తున్నారు. అయితే అక్కడ పృత్వి రాజ్ (Pruthwi raj shetty) పళ్ళు తోముకునే క్రమంలో తన బ్రష్ కు పేస్ట్ అనుకుని పేస్ వాష్ ను వేసుకున్నాడు. పక్కనేకూర్చుని ఉన్న నిఖిల్… మాట్లాడుతూ.. అదిప్పుడు వేసుకున్నావా.. అరే అది ఫేస్ వాష్ రా బాబు.. అంటూ చెప్పాడు.. వెంటనే అందర్నీ ఫేస్ వాష్ మార్చండిరా పృత్వి పేస్ట్ అనుకుంటున్నాడు అన్నాడు. వెంటనే కడుక్కున్న పృత్వి పక్కన ఉన్న పేస్ట్ ని వేసుకుంటూ చూసుకోలేదు అన్నాడు. ఇక హాల్ లో పక్కనే కూర్చుని ఉన్న యష్మి గౌడ.. కొంపదీసి మూడు రోజుల నుండే ఫేస్ వాష్ నే వాడుతున్నావా ఏంటి? అని కౌంటర్ వేసింది.

- Advertisement -

అతడు సీన్ రీ క్రియేట్..

ఈ సీన్ చూస్తుంటే అతడు సినిమాలో బ్రహ్మానందం – ధర్మవరపు సుబ్రహ్మణ్యం సీన్ గుర్తొస్తుంది. అందులో బ్రహ్మీ చేతిలో ఉన్నషేవింగ్ క్రీం ని పేస్ట్ అనుకుని ధర్మవరపు సుబ్రహ్మణ్యం బ్రష్ కి వేసుకుంటాడు. ఏంటి బ్రదర్ పేస్ట్ కి ఇంత నురగొస్తుంది.. మన ఊళ్ళో దొరకవెందుకు అని అంటుంటే.. పక్కనే ఉన్న గిరిబాబు ఎందుకు దొరకవూ.. కానీ పేస్ట్ అని అడక్కూడదు.. షేవింగ్ క్రీం అని అడగాలి అంటూ కౌంటర్ వేస్తాడు. ఇక్కడ కూడా ఆల్మోస్ట్ అదే సీన్ క్రియేట్ అయింది.. ఇక పృత్వి రాజ్ శెట్టి హౌస్ లో టాస్క్ లలో తన ఆటతీరుతో మెప్పిస్తూ దూసుకుపోతున్నాడు. అయితే జనాల అటెన్షన్ మాత్రం ఇంకా పృత్వి పై రాలేదని అనిపిస్తుంది. మరి ఈ వారం నామినేషన్లలో ఏ కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతారో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు