Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ లోకి రాజ్ తరుణ్ గర్ల్ ఫ్రెండ్.. ఏందీ మామా ఈ ట్విస్ట్..

Bigg Boss 8 Telugu : బుల్లి తెర టాప్ రిలీయాటి బిగ్ బాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే విజయవంతంగా ఏడు సీజన్ లను పూర్తి చేసుకుంది. ఇప్పుడు ఎనిమిదో సీజన్ ను త్వరలోనే ప్రారంభం కానుంది.ఈ సీజన్ కు ప్రోమోను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఆ ప్రోమో నెట్టింట ట్రెండ్ అవుతుంది. ఈసారి కంటెస్టెంట్స్ విషయంలో బిగ్ బాస్ యాజమాన్యం భారీ ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. అయితే గత కొన్ని రోజులుగా బిగ్ బాస్ లోకి వచ్చేది వీరే అంటూ వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా బిగ్ బాస్ సీజన్ తెలుగు 8లో హీరో రాజ్ తరుణ్ గర్ల్ ఫ్రెండ్ లావణ్య రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి..

రాజ్ తరుణ్, అతని మాజీ ప్రియురాలు లావణ్య, శేఖర్ బాషా పేర్లు గత రెండు రోజులుగా వార్తాల్లో హైలెట్ అవుతున్నాయి. రాజ్ తరుణ్ తనని మోసం చేసాడని, వాడుకొని వదిలేసాడని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఆ కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. ఎన్నో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. డ్రగ్స్ వాడిందని లావణ్య పై ఆరోపణలు చేసారు రాజ్ తరుణ్ ఫ్రెండ్ శేఖర్ భాష. ఈ కేసు ఇంకా ఒక కొలిక్కి రాలేదు కానీ సోషల్ మీడియాలో మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతుంది. అదేంటంటే .. లావణ్య రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు 8 కోసం అవకాశం సంపాదించిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇది విన్న బిగ్ బాస్ ఫ్యాన్స్ మాత్రం దీనికి ఒప్పుకోలేదని తెలుస్తుంది. ఆమె వస్తే షోలో కూడా డ్రగ్స్ ఉంటాయేమో అని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త హాట్ టాపిక్ అవుతుంది. మరి ఈ వార్తల్లో నిజమెంత ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంది. దీనిపై క్లారిటీ రావాలంటే కొద్దీ రోజులు వెయిట్ చెయ్యాల్సిందే.

Raj Tarun's ex-girlfriend Lavanya who got a chance in Bigg Boss 8 Telugu season
Raj Tarun’s ex-girlfriend Lavanya who got a chance in Bigg Boss 8 Telugu season

తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 8 త్వరలోనే మొదలు కాబోతుందన్న విషయం తెలిసిందే. ఈ షో ప్రోమో మంచి రెస్పాన్స్ వచ్చింది. నాగార్జున ఐదొవసారి కూడా హోస్టుగా వ్యవహరిస్తున్నారు . సెప్టెంబరు 1న గేమ్ షో ప్రారంభమవుతుందని కొందరు చెబుతుండగా, మరికొందరు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. బిగ్ బాస్ తెలుగు 8 ఔత్సాహికులలోని ఒక వర్గం సెప్టెంబర్ 8న రియాలిటీ షో కిక్‌స్టార్ట్ అవుతుందని అభిప్రాయపడ్డారు. అయితే దీనికి అధికారిక ధృవీకరణ లేదు. ఇక వర్షిణి సౌందర్‌రాజన్, వేణు స్వామి, సోనియా సింగ్, యూట్యూబర్ నేత్ర, నేత్ర మాజీ భర్త వంశీ, జబర్దస్త్ కమెడియన్‌లలో ఇద్దరు పొట్టి నరేష్, బుల్లెట్ భాస్కర్, కిర్రాక్ ఆర్‌పి, మరియు రియాజ్, బంచిక్ బబ్లూ, విష్ణుప్రియ భీమినేని, నిఖిల్ విజయేంద్రసింహ, బర్రెలక్క, కుమారి ఆంటీ, కుషిత కల్లపు, సుప్రీత , రీతు చౌదరి పేర్లు వినిపిస్తున్నాయి మరి ఫైనల్గా ఎవరు హౌస్ లోకి వెళ్ళబోతున్నారో త్వరలోనే తెలియనుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు