Bigg Boss 8 : రెండు భాషల ఆడియన్స్ కి ఫేవరెట్ ‘ప్రేరణ’..ఇంట పెరిగి రచ్చ గెలిచింది..

Bigg Boss 8 : తెలుగులో బిగ్ బాస్ సందడి మళ్ళీ వచ్చేసింది. కింగ్ నాగార్జున (Nagarjuna) హోస్ట్ గా బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభమయింది. నెలరోజుల కిందే బిగ్ బాస్ సీజన్ 8 తొందర్లోనే వచ్చేస్తుందని ప్రోమోలతో సందడి చేయగా, ఫైనల్ గా సెప్టెంబర్ 1 నుండి బిగ్ బాస్ సీజన్ మొదలైంది. ఇక మొదటి ఎపిసోడ్ లో మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఇందులో పలు టీవీ సీరియల్స్ నటులు, సినిమా నటులతో పాటు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఎంట్రీ ఇచ్చారు. ఈసారి ఎక్కువగా బుల్లితెర ప్రేక్షకులకు తెలిసిన వారే ఎక్కువగా ఎంట్రీ ఇవ్వడం జరిగింది.

ఇక బిగ్ బాస్ (Bigg Boss 8) లో ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్స్ ని గమనిస్తే… సీరియల్ నటి యష్మి గౌడ మొదలు కొని వరుసగా… నటుడు నిఖిల్ మలియక్కల్, నటుడు అభయ్ నవీన్, హీరో ఆదిత్య ఓం, నటి సోనియా ఆకుల, ఇన్ఫ్లుయెన్సుర్ బెజవాడ బేబక్క, ఆర్జే శేఖర్ బాషా, నటి కిరాక్ సీత, నటుడు నాగ మణికంఠ, నటుడు పృథ్వీరాజ్ శెట్టి, యాంకర్ విష్ణుప్రియ, డ్యాన్సర్ నైనిక , యూట్యుబర్ నబిల్ ఆఫ్రిది ఎంట్రీ ఇచ్చారు. అలాగే నాలుగో కంటెస్టెంట్ గా బుల్లితెర నటి ప్రేరణ (Prerana) ఎంట్రీ ఇచ్చింది.

Serial actress Prerana entered in Bigg Boss season 8

- Advertisement -

హైదరాబాద్ అమ్మాయే ప్రేరణ..

ఇక సీరియల్ ఆర్టిస్ట్ అయిన “ప్రేరణ కంభం” తెలుగులో కృష్ణ ముకుందా మురారి సీరియల్ తో పాపులర్ అయింది. అయితే ఈ అమ్మాయిని చూసి చాలామంది కన్నడ అమ్మాయి అనుకున్నారు. కానీ పక్కా హైదరాబాద్ లో పుట్టి పెరిగిన అమ్మాయి ఈమె. జూన్ 18వ తారీఖు 1996 లో హైదరాబాద్ లోనే పుట్టి పెరిగిన ఈ అమ్మాయి, ప్రస్తుతం బెంగళూరు లోనే నివసిస్తుంది. అయితే తన కాలేజీ లైఫ్ ని మాత్రం కర్ణాటకలో బెంగుళూర్ లోనే దయానంద సాగర్ కాలేజ్ లో ఎడ్యుకేషన్ పూర్తి చేసింది. అయితే ఈ అమ్మాయి ముందుగా కన్నడ సీరియల్స్ తోనే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.

ఇంట పెరిగి రచ్చ గెలిచింది…

ఇక హైదరాబాద్ లో పుట్టి పెరిగినా, కర్ణాటకలో తన కాలేజీ డేస్ ని గడపగా, ముందుగా కన్నడ సీరియల్స్ తోనే ఫేమస్ అయింది. 2017 లో “హరహర మహాదేవ్” అనే కన్నడ సీరియల్‌ తో బుల్లితెర ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఆ తర్వాత రంగనాయకి అనే మరో సీరియల్ లో నటించింది. అంతే కాదు “చూరికట్టె”, ఆనా, పెంటగాన్, ఫిజిక్స్ టీచర్ వంటి కన్నడ సినిమాల్లో కూడా ప్రేరణ నటించింది. ఇక తెలుగు కంటే ముందే కన్నడ బిగ్ బాస్ లో 2021 లో పాల్గొనింది ప్రేరణ. అయితే తెలుగులో 2022 లో స్టార్ మా లో “కృష్ణా ముకుందా మురారి” (Krishna mukunda murari) అనే సీరియల్‌తో ఇక్కడి ప్రేక్షకులకు చేరువైంది. ఇక లాస్ట్ ఇయర్ ‘సుందరి శ్రీపాద్‌ను’ అనే వ్యక్తిని 2023 లో పెద్దల సమక్షంలో బెంగుళూర్ లో పెళ్లికూడా చేసుకుంది ప్రేరణ. పెళ్లి తర్వాత కూడా సీరియల్స్ లో నటిస్తూ బిజీగా ఉంది ఈ అమ్మాయి. ఇప్పుడు ప్రేరణ కంభం బిగ్ బాస్ సీజన్ 8 లో అడుగుపెట్టడంతో బుల్లితెర బిగ్ బాస్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి బిగ్ బాస్ లో తన ఆటతీరుతో ఆడియన్స్ ని ఎలా మెప్పిస్తుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు