BiggBoss 8 : నాగ్ ముందే శేఖర్ బాషా పంచ్ లు.. సందర్భం ఏదైనా ఒక్క డైలాగ్ తో చేంజ్..

Biggboss 8 : బిగ్ బాస్ సీజన్ 8 రియాలిటీ షో స్టార్ మా లో ఇప్పుడిప్పుడే ఊపందుకుంది. సెప్టెంబర్ 1న మొదలైన ఈ రియాలిటీ షో మొదటి రోజు నుండే ఆడియన్స్ ని అట్రాక్ట్ చేయగా, మొదటి రెండు రోజులు చప్పగా సాగగా, ఆ తర్వాత టాస్క్ లతో ఊపందుకుంది. ఈ సీజన్లో ఎంట్రీ ఇచ్చిన 14 మంది కంటెస్టెంట్స్ తమ తమ ఆటతో ఆడియన్స్ ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక వచ్చిన రెండో రోజే బిగ్ బాస్ లో చీఫ్ టాస్క్ లు పెట్టగా అందులో నిఖిల్, నైనిక, యష్మి గౌడ (Yashmi gowda) హౌస్ చీఫ్ లుగా గెలిచి ఎన్నికయ్యారు. ఆ తర్వాత నామినేషన్లు జరగగా, ఆరుగురు కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు. శేఖర్ భాషా, విష్ణు ప్రియ, సోనియా, బెజవాడ బేబక్క, మణికంఠ, పృథ్వి నామినేట్ అయ్యారు. కాగా ఫస్ట్ వీక్ అనూహ్యంగా బేబక్క (Bebakka) ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే.

Shekhar Basha punch dialogues in BiggBoss 8 house

ఎంటర్టైనర్ అఫ్ ది హౌస్ శేఖర్ బాషా..

ఇదిలా ఉండగా బిగ్ బాస్ ( BiggBoss 8) హౌస్ లో ఎవరికీ వారు తమ తమ స్టైల్ లో ఆడియన్స్ ని ఆకట్టుకునే పనిలో ఉన్నారు. అయితే ఆట తీరుతో కాకుండా తన ఎంటర్టైన్మెంట్ తో అందర్నీ ఆకట్టుకుంటున్నాడు శేఖర్ బాషా. శేఖర్ బాషా ఒక ‘ఆర్జే’ అని తెలిసిందే. అందుకే ఇక్కడ తన టాలెంట్ ని మొత్తం చూపిస్తున్నాడు. హౌస్ లో ప్రతి ఒక్కరి మీద పంచ్ లు వేసాడు శేఖర్. సందర్భం ఏదైనా ఒక్క పంచ్ తో కామెడీ పుట్టిస్తున్నాడు. నామినేషన్స్ లో సీరియస్ గా ఉన్న టైం లో కూడా శేఖర్ బాషా తన డైలాగ్ డెలివరీతో ఆడియన్స్ ని తనవైపు తిప్పుకున్నాడు. ఇక ఎలిమినేషన్ డే రోజు కూడా నాగ్ (Nagarjuna) ముందే తనదైన శైలిలో కంటెస్టెంట్స్ పై పంచ్ లు వేసాడు. “బేబక్క ఆమ్లెట్ వేస్తుంది కనుక, ఆమె – లేట్ అని పంచ్ వేసాడు. నిఖిల్ ఏమో తనని శేఖర్ బాషా పంచ్ లతో “దోమ”లా విసిగిస్తున్నాడని నాగ్ కి అంటే, అక్కడ కూడా “ఇద్దరు తల్లులతో సమానం నేను.. “దో – మా” అని, అందుకే నిఖిల్ అలా అన్నాడు అని నాగ్ ని నవ్వించాడు.

- Advertisement -

సందర్భం ఏదైనా నవ్వాల్సిందే…

ఇక శేఖర్ బాషా (Sekhar basha) నాగార్జున ముందే నాగమణికంఠకు చిరాకు, అని ట్యాగ్ ఇస్తే, ఎందుకలా ఇచ్చావు అంటే, అతను ఎక్కడికెళ్ళి కూర్చున్నా, రమ్మంటే “చి – రాకు” అంటూ చిరాకు తెప్పిస్తాడు అందుకే అతడికి ఆ ట్యాగ్ ఇచ్చానని నాగ్ ని నవ్వించాడు. ఇక యష్మి గౌడని చేపలు అమ్మడం బాగా వచ్చని “సెల్ఫిష్” టైటిల్ ఇచ్చానన్నాడు శేఖర్ బాషా. ఇలా హౌస్ లో అందరిపైనా పంచ్ లు వేస్తూ, ఎంటర్టైన్ చేస్తున్నాడు. హౌస్ లో శేఖర్ బాషా ఆట ఎలా ఉన్నా, తన కామెడీ పంచ్ లతో మాత్రం ఆడియన్స్ ని అట్రాక్ట్ చేస్తున్నాడు. మరి ఇకముందు శేఖర్ బాషా తన ఆటతో ఆడియన్స్ ని ఎలా మెప్పిస్తాడో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు