Shobha Shetty: చికెన్ టాస్కులో పాసయ్యానన్నావ్! మరి ఇప్పుడేమైంది!

టెలివిజన్ లో టాప్ ప్లేస్ లో సక్సెస్ ఫుల్ షో గా దూసుకుపోతుంది బిగ్ బాస్ సీజన్ 7 షో. ఇప్పటికే పది వారాలు దాటేసి పదకొండో వారంలోకి ఎంటర్ అయింది. అయితే ఈ పది వారాల్లో టాప్ 10 మెంబర్ల మధ్య బిగ్ బాస్ టాప్ 5 కంటెస్టెంట్లు ఎవరూ అన్నదానిపై బిగ్ బాస్ వివిధ రకాల టాస్క్ లు పెట్టిన సంగతి తెలిసిందే. ముందుగా అర్జున్ మొదలుకొని అందరు కంటెస్టెంట్లతో ఈ టాస్క్ లు నిర్వహించగా, అర్జున్ గెలిచాక, ఆ తరువాత వరుస టాస్కుల్లో యావర్ గెలుస్తున్నాడు.

అయితే తాజాగా పెట్టిన లవ్ బర్గర్ టాస్క్ లో యావర్ తో పోటీగా శోభా కొన్ని బర్గర్ లని తినే టాస్క్ ని పెట్టడం జరిగింది. అయితే ఈ టాస్క్ లో ముందుగా యావర్ ఎక్కువ బర్గర్ లు తినడం స్టార్ట్ చేయగా, ఆ వెంటనే రెండు నిమిషాలకి స్టార్ట్ చేసిన శోభా ఒక బర్గర్ తినగానే బత్రూమ్ లోకి వెళ్లి వాంతులు చేసుకోవడం మొదలుపెట్టింది.

ఇక ఈ టాస్క్ తో శోభా శెట్టిపై సోషల్ మీడియా లో ట్రోలర్స్ ఓ రేంజ్ లో వేసుకుంటున్నారు. ఎందుకంటే శోభా శెట్టి తనని ఏం ఆడావని అడిగిన ప్రతి సారి చికెన్ టాస్క్ ఆడాను, నేను తిన్నట్టు ఎవరూ తినలేరు అంటూ ఊగిపోయేది. మరి ఇప్పుడేమైంది అంటూ నెటిజన్లు, ఇంకా బిగ్ బాస్ లో ఇతర కంటెస్టెంట్స్ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. అయితే అది ఫుడ్ విషయం కాబట్టి కొందరికి కొన్ని రకాల ఫుడ్ కూడా పడదు అని అనుకోవచ్చు. ఏది ఏమైనా ఈ టాస్క్ వల్ల శోభా శెట్టి ట్రోలర్స్ అడ్డంగా బుక్కయింది అని చెప్పొచ్చు.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు