Biggboss season7: స్టార్ మా బ్యాచ్ కి ఎదురెళ్ళే ఒకే ఒక్కడు..! అందుకే డేంజర్ లో?

స్టార్ మా లో టెలికాస్ట్ అవుతున్న బిగ్ బాస్ సీజన్ 7 లో ఎలిమినేషన్ డే వచ్చేసింది. ఈ వీకెండ్ లో నాగార్జున రాగానే హౌస్ మేట్స్ చేస్తున్న తప్పుల గురించి మాట్లాడడం మొదలెట్టాడు. ఈ క్రమంలో అక్కడున్న హౌస్ మేట్స్ ని స్టోర్ రూమ్ లో పెట్టిన కొన్ని బుక్స్ ని ఒక్కో కంటెస్టెంట్ ఒక బుక్ తీసుకుని ఎవరైనా హౌస్ మేట్స్ కి డేడికేట్ చేయాలనీ నాగార్జున చెప్పడం జరిగింది.

అయితే ఈ క్రమంలో ఎవరికీ వారు బిగ్ బాస్ హౌస్ లో తమకు నచ్చని వాళ్ళని, లేదా నామినేషన్ చేసిన వాళ్ళని డేడికేట్ చేసారు. అయితే ఈ సీజన్లో స్టార్ మా బ్యాచ్ ని ఎవ్వరు గెలకడానికి ట్రై చేయరని తెలిసిందే. ఎందుకంటే వాళ్లలో ఎవరితో పెట్టుకున్నా, అందరూ ఒక్కటై వేరే వాళ్ళని ఆటాడుకుంటారు. దీనికి బిగ్ బాస్ కూడా ఏమి అనడని బయట ఓ టాక్ ఉంది. అలా వాళ్ళ జోలికి వెళ్లిన అశ్విని, భోలే లాంటి వాళ్ళ పరిస్థితి ఏమయిందో తెలిసిందే.

కానీ వాళ్లకి ఎదురెళ్లి కరెక్ట్ పాయింట్స్ తో నామినేట్ చేసి కట్టడి చేయగల ఆటగాడు ఒకే ఒక్కడు. అతడే ప్రిన్స్ యావర్. భాష లోపం అయినా, తన ఆటతో ఆడియన్స్ ని మెప్పిస్తూ, స్పై బ్యాచ్ అండతో టాప్ కి దూసుకెళ్తున్నాడు. ముఖ్యంగా శోభా తో చాలా సార్లు యావర్ నామినేషన్స్ లో వాదించాడు. ఇక నాగార్జున నిన్న పెట్టిన బుక్ డెడికేషన్ లో శోభా కి ‘నెగిటివిటి పంచకుండా ఉండడం ఎలా?’ అంటూ బుక్ ని డేడికేట్ చేసాడు. ఈ సీన్ చూసి సోషల్ మీడియా లో రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు