BiggBoss 8 : పెర్ఫార్మన్స్ తో సంబంధం లేకుండా ఓటింగ్ పడేది వీళ్ళకే.. కనీసం నెల రోజులు హౌస్ లో పక్కా!

Biggboss 8 : బిగ్ బాస్ సీజన్ 8 రియాలిటీ షో స్టార్ మా లో జోరుగా సాగుతుంది. సెప్టెంబర్ 1న మొదలైన ఈ రియాలిటీ షో మొదటి రోజు నుండే ఆడియన్స్ ని అట్రాక్ట్ చేయగా, మొదటి రెండు రోజులు చప్పగా సాగగా, ఆ తర్వాత టాస్క్ లతో ఊపందుకుంది. ఈ సీజన్లో ఎంట్రీ ఇచ్చిన 14 మంది కంటెస్టెంట్స్ తమ తమ ఆటతో ఆడియన్స్ ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక వచ్చిన రెండో రోజే బిగ్ బాస్ లో చీఫ్ టాస్క్ లు పెట్టగా అందులో నిఖిల్, నైనిక, యష్మి గౌడ (Yashmi gowda) హౌస్ చీఫ్ లుగా గెలిచి ఎన్నికయ్యారు. ఆ తర్వాత నామినేషన్లు జరగగా, ఆరుగురు కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు. శేఖర్ భాషా, విష్ణు ప్రియ, సోనియా, బెజవాడ బేబక్క, మణికంఠ, పృథ్వి నామినేట్ అయ్యారు.

These are the contestants playing safe game in BiggBoss 8 house

ఎలిమినేట్ అయ్యింది ఈవిడే!

ఇక బిగ్ బాస్ 8 లో ఈ వారం ఆరుగురు కంటెస్టెంట్స్ నామినేట్ అవగా, వీళ్ళలో సోనియా సేవ్ అయింది. ఇక చాలా మంది ఆడియన్స్ నాగమణికంఠ, శేఖర్ బాషా, బేబక్క లో ఒకరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందని అనుకోగా, అయితే ఆదివారం రావాల్సిన ఎలిమినేషన్ ఎపిసోడ్ లీక్ అవగా, బేబక్క (Bebakka) ఎలిమినేట్ అయిందని తెలిసింది. సోషల్ మీడియాలో నాగమణికంఠ (Nagamanikantha) ఎలిమినేట్ అవుతాడని వార్తలు రాగా, సింపతీ తో లక్కీ గా ఈవారం తప్పించుకున్నాడని చెప్పొచ్చు. అయితే అలాగే గేమ్ ఆడితే ఎలిమినేషన్ నుండి నెక్స్ట్ వీక్ తప్పించుకోవడం తన చేతిలో లేదని చెప్పాలి. ఇదిలా ఉండగా బిగ్ బాస్ హౌస్ లో కొందరు కంటెస్టెంట్స్ మాత్రం సేఫ్ గేమ్ ఆడుతూ, ఓట్ బ్యాంక్ పెంచుకుంటున్నారు.

- Advertisement -

ఈ కంటెస్టెంట్స్ నెలరోజులు పక్కా…

ఇక ఈ సీజన్లో బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ లో కొందరు బయటి నుండే మంచి క్రేజ్ తో రాగా, మరికొందరు జనాలకు తెలీని కొత్త మొహాలతో ఎంట్రీ ఇచ్చారు. అయితే హౌస్ లో ఉన్న కొందరు కంటెస్టెంట్స్ లో కొందరు కంటెస్టెంట్స్ మాత్రం తమ డీసెంట్ ఆటతీరుతో మెప్పిస్తూ, న్యూట్రల్ గా నిలుస్తూ సేఫ్ గేమ్ ఆడుతున్నారు. ఒకవేళ టాస్క్ లో అంతగా పెర్ఫార్మ్ చేయకపోయినా, సోషల్ మీడియాలో వాళ్లకున్న పాజిటివీటి కారణంగా పడే ఓటింగ్ తో, నాలుగు వారాలైనా సేఫ్ అవడం పక్కా అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి. వాళ్లలో ముందుగా ప్రేరణ (Prerana), అభయ్ నవీన్, ఆదిత్య ఓం నిలిచారు. వీళ్ళపై నెటిజన్లు దాదాపుగా పాజిటివ్ గానే స్పందిస్తున్నారు. కొన్ని సార్లు గేమ్స్ లో మిస్టేక్స్ చేసినా తప్పును ఒప్పుకుంటారు. మిగతా కంటెస్టెంట్స్ కంటే కాస్త ఎక్కువ పాజిటివ్ ఫేమ్ ఈ కంటెస్టెంట్స్ దక్కించుకోగా, హౌస్ లో ఎక్కువ రచ్చ చేయకుండా, సందడిగా పాజిటివ్ గా ఉంటున్నారు. కానీ ఆట తీరులో పెర్ఫార్మన్స్ చూపించకపోతే వీళ్ళకైనా సరే నామినేషన్స్ లో తిప్పలు తప్పవు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు