50 Days for Bigg Boss : ఇప్పుడు ఆ దరిద్రాలన్నీ ఇక్కడ కూడా చూడాలేమో..

Bigg Boss 8 Telugu : బుల్లితెర పై టాప్ రియాలిటీ షో అంటే బిగ్ బాస్ అనే పేరు గుర్తుకు రావడం సహజం.. ఆ షో వందరోజులకు పైగా జరుగుతుంది.. సెలెబ్రేటిల నుంచి సీరియల్స్, కామన్ పీపుల్ కూడా ఇక్కడ తమలోని టాలెంట్ ను బయటపెడుతూ క్రేజ్ ను పెంచుకుంటున్నారు.. తెలుగులో ఇప్పటివరకు ఏడు సీజన్లను పూర్తి చేసుకుంది.. ఇప్పుడు ఎనిమిదోవ సీజన్ త్వరలోనే ప్రారంభం కాబోతుంది.. ఈ సీజన్ కోసం ఇప్పటికే కసరత్తులు ప్రారంభించారు.. కంటెస్టెంట్స్ ను సెట్ చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తుంది.. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మరో 50 రోజుల్లో ఈ సీజన్ పూర్తిగా ప్రారంభం కానున్నట్లు సమాచారం..

అయితే బిగ్ బాస్ లో వింత టాస్క్ లతో పాటుగా రొమాన్స్ కూడా కాస్త టచ్ అవుతుందన్న విషయం తెలిసిందే.. గతంలో వచ్చిన ఎపిసోడ్స్ చూసుకుంటే కేవలం హగ్ లో కిస్ లు వరకే పరిమితం అవుతున్నాయి.. గత సీజన్ 7 మాత్రం కాస్త డోస్ ఎక్కువైంది.. ట్రై యాంగిల్ లవ్ స్టోరీ నడిచింది.. కానీ బాలీవుడ్ లో మాత్రం అన్ని కెమెరాల ముందే రొమాన్స్, ఆఖరికి పబ్లిక్ గానే సెక్స్ చేస్తున్నారు.. మొన్న ఈ మధ్య ఓ జంట అడ్డంగా బుక్కయింది.. అందుకు సంబందించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..

Trolls just started on Bigg Boss 8
Trolls just started on Bigg Boss 8

అయితే తెలుగులో బిగ్ బాస్ 8 వ సీజన్ జరుపుకోవడానికి రెడీగా ఉంది.. ఈ సీజన్ పై కాస్త ఎక్కువగానే అంచనాలు ఉన్నాయి..ఇప్పటికే సీజన్ లో పాల్గొనే కంటెస్టెంట్స్ ఎవరు అనేది సోషల్ మీడియాలో చర్చనీయంశంగా మారింది. వేణు స్వామి, కుమారి ఆంటీ, రీతూ చౌదరి, స్టార్ కపుల్స్ తదితరులు పార్టిసిపేట్ చెయ్యనున్నారనే టాక్ వినిపిస్తుంది.. అయితే బాలీవుడ్ లో ఇప్పుడు రెచ్చిపోతున్నారు కంటెస్టెంట్స్.. అక్కడ చూసిన దరిద్రాలు ఇక్కడ కూడా చూడాలా అని కొందరు బిగ్ బాస్ యాంటి ఫ్యాన్స్ ట్రోల్స్ చేస్తున్నారు.. మరి తెలుగు బిగ్ బాస్ యాజమాన్యం అలాంటివి జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుందో చూడాలి..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు