BiggBoss 8 : ఆమె మాత్రమే పుణ్యస్త్రీ, మేమదో టైపా? అంటూ విష్ణు ప్రియ బోల్డ్ కామెంట్స్.. ఫైర్ అయిన నాగ్

Biggboss 8 : బిగ్ బాస్ సీజన్ 8 స్టార్ మా లో జోరుగా సాగుతుంది. సెప్టెంబర్ 1న మొదలైన ఈ రియాలిటీ షో మొదటి రోజు నుండే ఆడియన్స్ ని అట్రాక్ట్ చేయగా, మొదటి రెండు రోజులు చప్పగా సాగగా, ఎప్పట్లాగే నాగార్జున (Nagarjuna) హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షో లో 14 మంది కంటెస్టెంట్స్, తమ తమ ఆటతో ఆడియన్స్ ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక వచ్చిన రెండో రోజే బిగ్ బాస్ లో చీఫ్ టాస్క్ లు పెట్టగా అందులో ముగ్గురు చీఫ్ లుగా ఎన్నికైన విషయం తెలిసిందే. నిఖిల్, నైనిక, యష్మి గౌడ (Yashmi gowda) హౌస్ చీఫ్ లుగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత నామినేషన్ల ప్రక్రియ మొదలవగా, ఆరుగురు కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు. ఇదిలా ఉండగా తాజాగా బిగ్ బాస్ హౌస్ లో ఉన్న యాంకర్ విష్ణు ప్రియ బోల్డ్ కామెంట్స్ చేసింది.

Vishnu Priya's bold comments in Bigg Boss house, Nagarjuna is serious about Vishnu Priya

ఆమె మాత్రమే పుణ్య స్త్రీ? మేమదో టైపా?

ఈ వీకెండ్ బిగ్ బాస్ హౌస్ మేట్స్ కి వినాయకచవితి శుభాకాంక్షలు చెప్తూ, స్టార్ట్ చేసిన నాగార్జున అందరికీ స్వీట్స్ పంపించారు. ఇదిలా ఉండగా గతంలో వారం మొత్తం కంటెస్టెంట్స్ మధ్య జరిగిన గొడవలు, కాంట్రవర్సీల గురించి తెలుసుకుని నాగ్ కంటెస్టెంట్స్ పై క్లాస్ తీసుకునే వారు. కానీ, ఈ సీజన్ లో రివర్స్ అంటూ.. కంటెస్టెంట్స్ అంతా ఈ వారంలో జరిగిన విషయాలను బేస్ చేసుకుని, తమకు ఏ కంటెస్టెంట్ అంతగా నచ్చలేదో.. కారణాలు కూడా చెప్పాలని నాగ్ చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో విష్ణు ప్రియ సోనియా గురించి నెగిటివ్ గా చెప్పుకొచ్చింది. సోనియా తనకు కోపం వచ్చినపుడు వాడే పదాలు హర్టింగ్ గా ఉన్నాయంటూ.. పలు విషయాలు చెప్పుకొచ్చింది. అయితే నాగార్జున అసలు సోనియా, విష్ణు ప్రియ (vishnupriya) మధ్య ఏం జరిగిందో వీడియో చూపించి గాలి తీసేసాడు. అక్కడ ఇద్దరి మధ్యా మాటల యుద్ధం జరగగా, విష్ణు ప్రియ సరదాగా అంటూ… నిఖిల్ అంటే పడేది కాదు, ఇప్పుడు నిఖిల్ తో క్లోజ్ అయ్యవని అడిగింది. దీంతో సోనియా కోపంతో మాట్లాడుకుండా అక్కడి నుండి వెళ్లిపోయింది.

- Advertisement -

సీరియస్ అయిన నాగ్?

అయితే కాసేపటి తర్వాత సోనియా మళ్లీ వచ్చి.. నేను మీ అడల్ట్ రేటెడ్ కామెడీలో భాగం కాదని వార్నింగ్ ఇచ్చింది. సోనియా (Soniya) అలా అనడంతో తానేమి తప్పుగా మాట్లాడలేదని విష్ణు ప్రియ సీరియస్ గా బదులిచ్చింది. దీంతో సోనియా ఏడ్చేసింది. అయినా కూడా విష్ణుప్రియ అసలు తగ్గకుండా, నేను కూడా ఏడుస్తా.. నాక్కూడా ఎమోషన్స్ ఉంటాయి.. అంటూ, ఈమేదో పుణ్యస్త్రీ, మేమేమో అదో టైపా? అంటూ వ్యంగంగా బోల్డ్ కామెంట్స్ చేసింది. ఆ వీడియో పూర్తయ్యాక నాగ్ సోనియాకు మద్దతుగా నిలుస్తూ, విష్ణుప్రియపై సీరియస్ అయ్యాడు. “నువ్వు ఒక అమ్మాయివే కదా. సోనియా ఫీలింగ్స్ అర్థమతున్నాయా'”… మరో సారి ఇలాంటి తప్పుల్ని రిపీట్ చేయకూడదు అంటూ స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చాడు. ఇక మిగతా కంటెస్టెంట్స్ ని కూడా అలాగే క్లాస్ పీకాడు నాగ్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు