Bigg Boss Telugu 8: మొదటివారం నామినేషన్స్.. ఎలిమినేషన్ కి దగ్గరగా ఉన్నది ఎవరంటే..?

Bigg Boss Telugu 8: బుల్లితెర ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి మళ్లీ బిగ్గెస్ట్ వరల్డ్ రియాల్టీ షో బిగ్ బాస్ (Bigg Boss)వచ్చేసింది. 8వ సీజన్ మొదలైంది. సెప్టెంబర్ ఒకటవ తేదీ సాయంత్రం స్టార్ మా చానల్లో ఏడు గంటలకు చాలా గ్రాండ్ గా మొదలైన ఈ షో కి ఎప్పటిలాగే నాగార్జున (Nagarjuna)హోస్ట్ గా బాధ్యతలు చేపట్టారు. మరొకసారి తన హోస్టింగ్ తో ఆడియన్స్ లో జోష్ నింపేశారు నాగార్జున. ఇకపోతే ఈసారి ఎక్కువగా బుల్లితెర సీరియల్ ఆర్టిస్టులను ఎక్కువగా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే దాదాపు 14 మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి వచ్చారు.

Bigg Boss Telugu 8: First week nominations.. Who is closest to elimination..?
Bigg Boss Telugu 8: First week nominations.. Who is closest to elimination..?

గొడవలతోనే అటెన్షన్ క్రియేట్ చేసిన బ్యూటీస్..

యశ్మీ గౌడ, నిఖిల్, అభయ్ నవీన్, ప్రేరణ, ఆదిత్య ఓం, సోనియా, బెజవాడ బేబక్క, ఆర్జె శేఖర్ బాషా, కిర్రాక్ సీత, నాగ మణికంఠ, పృధ్విరాజ్ శెట్టి, విష్ణు ప్రియ, నైనిక, నబిల్ ఆఫ్రిది ఇలా దాదాపుగా మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి అడుగుపెట్టారు. అడుగుపెట్టిన మొదటి రోజే ఎవరికి వారు తమ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంటున్నారని చెప్పవచ్చు. ఇకపోతే సోనియా – యశ్మీ గౌడ గొడవలతోనే అటెన్షన్ క్రియేట్ చేయగా, తన పర్ఫామెన్స్ తో మొదటి రోజే అందర్నీ ఆకట్టుకునే ప్రయత్నం చేసింది నైనిక. అయితే విష్ణు ప్రియ కూడా తన పర్ఫామెన్స్ తో అందరినీ ఆకట్టుకుంటుందని అందరూ అనుకున్నారు. కానీ దాదాపు ఈమె సైలెంట్ గానే వుండడం అక్కడ మనం గమనించవచ్చు.

చివరి వరకు పోరాడి ఆడియన్స్ మనసు దోచుకుంది..

ఇకపోతే హౌస్ లోకి అడుగుపెట్టిన తొలి రోజు గట్టిగా పట్టుకోండి అనే టాస్క్ తో ఆడియన్స్ లో ఉత్కంఠ రేకెత్తించారు బిగ్ బాస్. అందులో భాగంగానే చివరి వరకు నైనిక పోరాడింది. పొట్టి పిల్ల గట్టిగానే పోరాడి అందరి మనసులను దోచేసుకుంది. చివరి వరకు పోరాటం చేసిన ఈమె గెలవలేకపోయింది. ఇక నిఖిల్ ఈ టాస్క్ లో గెలిచి ప్రశంసలు అందుకున్నారు. ఇకపోతే సోమవారం ఎలిమినేషన్ డే అని అందరికీ తెలిసిందే.. అన్ని సీజన్లో కూడా సోమవారం రోజున ఎలిమినేషన్ ప్రకటిస్తారు.

- Advertisement -

నామినేషన్ లోకి 14 మంది కంటెస్టెంట్స్..

ఇక అందులో భాగంగానే ఎవరెవరు నామినేషన్ లిస్టులోకి వచ్చారు అనే విషయాన్నికొస్తే.. గత వారంలో జరిగిన విషయాలను గుర్తు పెట్టుకొని ఒక్కొక్క కంటెస్టెంట్ ఇద్దరిని నామినేట్ చేయాల్సి ఉంటుంది. అందులో భాగంగానే ఈసారి నామినేషన్ లో ఏకంగా 14 మంది ఉండడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇంకా ఇప్పుడే హౌస్ లోకి వచ్చారు కాబట్టి ఒకరి గురించి ఒకరికి పూర్తిగా తెలియదు కాబట్టి అలా తెలుసుకునే ప్రయత్నంలో తప్పొప్పులు జరగడం సహజం. అలా మొదటి వారంలో ఏకంగా 14 మంది నామినేషన్ లిస్టులోకి వచ్చేసారు. ఇక ఈవారం ఎలిమినేషన్ నుంచి తప్పించుకోవాలి అంటే ఎవరికి వారు గట్టి ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది . అప్పుడే బిగ్బాస్ లో ఓటింగ్ ప్రక్రియ కూడా ప్రారంభమైన నేపథ్యంలో ఆడియన్స్ ఎవరి పర్ఫామెన్స్ మెచ్చి ఓటు వేస్తారు అనేది తెలియాల్సి ఉంది. మొత్తానికైతే వీక్ కంటెస్టెంట్ ఈ వీక్ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు