Bigg Boss: తొలి సీజన్ మొదలు ఇప్పటివరకు తొలి వారమే ఎలిమినేట్ అయిన సెలబ్రిటీస్ వీళ్లే.. సేమ్ రీజన్..!

Bigg Boss. వరల్డ్ బిగ్గెస్ట్ రియాల్టీ షోగా గుర్తింప తెచ్చుకున్న ఈ షో ఇప్పటికే 7 సీజన్లను పూర్తిచేసుకుంది. ఒక ఓటీటీ సీజన్ కూడా సక్సెస్ ఫుల్ గా పూర్తయిన విషయం తెలిసిందే. ఇకపోతే 8వ సీజన్ మొదలై మొదటి వారం పూర్తయిన సందర్భంగా.. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా హౌస్ లోకి అడుగుపెట్టిన బెజవాడ బేబక్క ఎలిమినేట్ అయింది. ఈ నేపథ్యంలోనే హౌస్ లో వయసు ఎక్కువ ఉన్న వారిని ఒక్కొక్కరిగా ఎలిమినేట్ చేస్తారు అనే వాదన తెరపైకి వచ్చింది. మరి మిగతా 7 సీజన్లలో కూడా ఇదే పరిస్థితి కొనసాగిందా అనే విషయాలను మళ్లీ ఒకసారి గుర్తు చేసుకుంటున్నారు అభిమానులు.

Bigg Boss: These are the celebrities who have been eliminated in the first week since the first season.. Same reason..!
Bigg Boss: These are the celebrities who have been eliminated in the first week since the first season.. Same reason..!

మరి మొదటి సీజన్ మొదలుకొని 8వ సీజన్ వరకు మొదటి వారం ఎవరెవరు ఎలిమినేట్ అయ్యారు..? అసలు కారణం ఏంటి.? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.

బిగ్ బాస్ సీజన్ 1..

తొలిసారి బిగ్ బాస్ సీజన్ వన్ మొదలుపెట్టినప్పుడు ఈ కార్యక్రమానికి హోస్టుగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ హౌస్ లోకి వచ్చారు. 2017 జూలై 16వ తేదీన ప్రారంభమైన ఈ కార్యక్రమంలో మొత్తం 16 మంది సెలబ్రిటీలు హౌస్ లోకి అడుగుపెట్టారు. వీరిలో నటి జ్యోతి తొలి వారమే తొలి సీజన్ నుండి ఎలిమినేట్ అయింది.

- Advertisement -

బిగ్ బాస్ సీజన్ 2..

2018 జూన్ 10వ తేదీన ప్రారంభమైన రెండవ సీజన్ కి నాచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరించారు.. 112 రోజులపాటు కొనసాగిన ఈ కార్యక్రమంలో మొత్తం 18 మంది హౌస్ మేట్స్ పాల్గొన్నారు. ఇక వీరిలో తొలివారం మోడల్ సంజన ఎలిమినేట్ అయింది.

బిగ్ బాస్ సీజన్ 3..

2019 జూలై 12వ తేదీన ప్రారంభమైన ఈ సీజన్ కి నాగార్జున హోస్ట్ గా వ్యవహరించారు. 105 రోజులకు గానూ 17 మంది కంటెస్టెంట్స్ హౌస్ లో పాల్గొన్నారు. ఇక 3 సీజన్లో భాగంగా తొలివారం ప్రముఖ నటి హేమా ఎలిమినేట్ అయ్యారు.

బిగ్ బాస్ సీజన్ 4:

నాలుగవ సీజన్ 2020 సెప్టెంబర్ 6వ తేదీన ప్రారంభమైంది. ఈ కార్యక్రమం 105 రోజులు జరగగా అందులో 19 మంది కంటెస్టెంట్స్ హౌస్ మేట్స్ గా వచ్చారు.తొలివారం ప్రముఖ డైరెక్టర్ సూర్య కిరణ్ ఎలిమినేట్ అయ్యారు .

బిగ్ బాస్ సీజన్ 5:

2021 సెప్టెంబర్ 5వ తేదీన ప్రారంభమైన ఈ కార్యక్రమానికి కూడా నాగార్జున హోస్ట్గా వ్యవహరించారు. మొత్తం 105 రోజుల పాటు సాగిన ఈ షో లో 19 మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి అడుగుపెట్టారు. తొలివారం ప్రముఖ యూట్యూబర్ సరయు ఎలిమినేట్ అయ్యారు.

బిగ్ బాస్ సీజన్ 6:

ఈ కార్యక్రమానికి కూడా నాగార్జున హోస్ట్ గా వ్యవహరించారు. ఈ షో 2022 సెప్టెంబర్ 4వ తేదీన ప్రారంభం అయింది. 105 రోజులకు గాను ఏకంగా 21 మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి అడుగుపెట్టారు. ఇక తొలివారం షానీ సల్మాన్ ఎలిమినేట్ అయ్యారు.

బిగ్ బాస్ సీజన్ 7:

2023 సెప్టెంబర్ మూడవ తేదీన ప్రారంభమైన ఈ కార్యక్రమానికి కూడా నాగార్జున హోస్ట్ గా వ్యవహరించారు. ఈ కార్యక్రమం కూడా 105 రోజులకు గానూ 19 మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి అడుగుపెట్టారు. ఇక ఇక్కడ తొలి వారం కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ అయ్యారు.

బిగ్ బాస్ సీజన్ 8:

సెప్టెంబర్ ఒకటి 2024న ప్రారంభమైన ఈ ఎనిమిదవ సీజన్ కి కూడా నాగార్జున హోస్టుగా వ్యవహరించారు. ఇందులో మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ పాల్గొనగా మొదటి వారం బెజవాడ బేబక్క ఎలిమినేట్ అయ్యారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు