BiggBoss8: విష్ణు ప్రియ ను పక్కన పెట్టేసిన చీఫ్స్.. అదే కారణమా..?

BiggBoss8..బిగ్ బాస్ సీజన్ 8 (Bigg Boss 8) మొదలయి వారం కూడా కాలేదు.. అప్పుడే హౌస్ లో గొడవలు , ప్రేమలు, ద్వేషాలు అన్నీ కూడా ఆడియన్స్ కు మంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో నాగ మణికంఠ పేరు మారుమ్రోగుతోంది. సింపథీ మొదలు పెట్టాడు అంటూ మొదటి నుంచే ట్యాగ్ తెచ్చుకున్న మణికంఠ ప్రతిసారి కూడా గతం గురించి మాట్లాడుతూ.. అందరిని కన్నీళ్లు పెట్టిస్తున్నాడు. అందుకే సింపథీ స్టార్ అంటూ పేరు కూడా సొంతం చేసుకున్నారు. మార్నింగ్ తర్వాత శేఖర్ భాషకు బేబక్క కరాటే పాటాలు నేర్పిస్తే, నాగమణికంఠతో నామినేషన్ లో జరిగిన గొడవలపై విష్ణు ప్రియ క్లారిటీ ఇచ్చింది. అందరూ తనని నామినేట్ చేస్తున్నారు అంటూ నాగ మణికంఠ కృంగిపోతుంటే అతడిని ఓదార్చే ప్రయత్నం చేసింది విష్ణు ప్రియ. అంతేకాదు హౌస్ లో అందరితో కలిసి పోవాలని ప్రేరణ కూడా సలహా ఇచ్చింది.

BiggBoss8: Is this the reason why Vishnu sidelined Priya?
BiggBoss8: Is this the reason why Vishnu sidelined Priya?

క్లాన్స్ గా డివైడవుతున్న చీఫ్స్

ఇక మొదటి వారంలో ఛీఫ్స్ గా నిలిచిన ముగ్గురు తమకంటూ సొంత సైన్యాన్ని నిర్మించుకునే టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్ . అందులో బేబక్క , శేఖర్ భాష , నబీదులు ముగ్గురు తమకు నచ్చిన క్లాన్స్ చేరే అవకాశాన్ని ఇచ్చాడు. దీంతో ముందుగా శేఖర్ భాష యష్మీ టీంలో చేరగా.. బేబక్క నిఖిల్ టీం లో చేరిపోయింది. కలిసే వచ్చాము కలిసే ఆడుతామంటూ నైనిక టీం లో చేరిపోయాడు నబీద్. ఇక ప్రేరణ కోసం నిఖిల్ , యష్మీ పోటీ పడగా.. నిఖిల్ కు హ్యాండ్ ఇచ్చి యష్మీ టీమ్ లో చేరిపోయింది ప్రేరణ. ఆ తర్వాత ఆదిత్య, సీత , విష్ణు ప్రియ లను తన టీం లోకి తీసుకుంది నైనిక.

విష్ణు ప్రియ ను చేర్చుకోవడానికి ఇష్టపడని చీఫ్స్..

నిజానికి విష్ణు ప్రియ ను సెలెక్ట్ చేసుకోవడానికి ముగ్గురు చీప్స్ కూడా ముందుకు రాలేదు. దాంతో చివరికి నైనిక తన టీమ్ లోకి తీసుకుంది .అయితే దీనికి కూడా కారణం లేకపోలేదు. హౌస్ లో ఏ సమస్య వచ్చినా సరే తనకేమీ పట్టనట్టుగా ఉంటుంది. ఇక పెర్ఫార్మన్స్ ఏమి ఇస్తుంది అనే రేంజ్ లో విష్ణు ప్రియ ప్రవర్తిస్తున్న నేపథ్యంలోనే ఈమెను తన టీం లో చేర్చుకోవడానికి ఎవరు ముందుకు రాలేదు అని . కానీ చివరికి నైనిక తన టీమ్ లో తీసుకుంది. ఆ తర్వాత అభయ్, పృథ్వీ లను తన టీమ్లో చేరాలని కోరారు నిఖిల్. కానీ వారిద్దరు కూడా యష్మీ టీమ్ కి వెళ్లిపోయారు. చివరికి నిఖిల్ టీంలో సోనియా చేరిపోయింది. క్లాన్స్లో మెంబర్స్ ఎక్కువగా ఉండటంతో ఇద్దరిలో ఎవరు బెస్ట్ అన్నది నిరూపించుకోవాలని బిగ్ బాస్ తెలిపాడు. మొత్తానికి అయితే ఇలా ఎవరికి వారు గ్రూపుల్లో చేరిపోయి డివైడ్ అవుతున్నారు. అలా మొత్తానికి అయితే విష్ణుప్రియను ఎవరు చేర్చుకోకుండా మొదట్లో టెన్షన్ పెట్టి తర్వాత నైనిక అమలు తీసుకోవడం నైనిక మంచి మనసుకు అభిమానులు ఫిదా అవుతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు