22Years Of Indra : బాక్స్ ఆఫీస్ వద్ద ఇంద్రసేనుడి వీరవిహారం…కనీవినీ ఎరుగని కలెక్షన్ల రికార్డులివే!

22Years Of Indra : టాలీవుడ్ లో మూడున్నర దశాబ్దాలుగా మెగాస్టార్ చిరంజీవి నెంబర్ వన్ హీరోగా నిలిచి ఎన్నో రికార్డులు సృష్టించాడు. ఇప్పటికీ ఆ నెంబర్ వన్ స్థానం ఆయన తర్వాత ఇంకెవరూ సరిగా భర్తీ చేయలేకపోతున్నారంటే అలాంటి చరిత్ర గల రికార్డులు చిరంజీవి సృష్టించాడు. టాలీవుడ్ లో రెండో తరం హీరోల్లో ఎవరికీ లేనన్ని ఇండస్ట్రీ హిట్స్ చిరంజీవికి మాత్రమే ఉండడం విశేషం. అలాంటి ఇండస్ట్రీ హిట్స్ లో ఈ జెనరేషన్ కి కూడా గుర్తుండి పోయే సినిమా ‘ఇంద్ర’. ఈ సినిమా గురించి చెప్పాలంటే ఒక పుస్తకం రాయొచ్చని ట్రేడ్ విశ్లేషకులు అంటుంటారు. ఇంద్రసేనుడిగా మెగాస్టార్ చిరంజీవి అద్భుతమైన నటనకు తోడు దర్శకుడు బి.గోపాల్ మాస్ డైరెక్షన్, పరచూరి బ్రదర్స్ మాటలు ఇలా అన్నీ ఇంద్ర అఖండ విజయానికి తోడయ్యాయి. కాగా నేటికీ ఈ సినిమా విడుదలై 22 ఏళ్ళు పూర్తి చేసుకుంది.

22Years Of Chiranjeevi Indra Movie Unbeatable Records

బాక్స్ ఆఫీస్ వద్ద ఇంద్రసేనుడి రికార్డులు…

ఇక ఇంద్ర అంటే ముందుగా మెగాస్టార్ గుర్తొస్తే… ఆ వెంటనే బాక్స్ ఆఫీస్ రికార్డులు గుర్తొస్తాయి. బాక్స్ ఆఫీస్ వద్ద మెగాస్టార్ చిరంజీవి ఊర మాస్ రచ్చ కి రికార్డులన్నీ బద్దలైపోయాయి. పైగా ఈ సినిమా కన్నా ముందు చిరంజీవి వరుస పరాజయాలందుకుని డీలా పడ్డారు. ఇంద్రకి ముందు చిరంజీవి మృగరాజు, శ్రీ మంజునాథ, డాడీ వంటి సినిమాలతో ప్లాప్ అందుకున్నారు. ఆ సినిమాలు మంచి టాక్ తెచ్చుకున్నా కమర్షియల్ గా ప్లాప్ అయ్యాయి. ఈ క్రమంలో ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ వద్ద తన రేంజ్ ని చుపించాలనుకుని డిసైడ్ అయ్యారు. అలాంటి తరుణంలో మాస్ డైరెక్టర్ బి. గోపాల్ తో చేతులు కలిపిన మెగాస్టార్ చిరు బాక్స్ ఆఫీస్ వద్ద పెను ప్రభంజనం సృష్టించారు.

- Advertisement -

డబుల్ ప్రాఫిట్లతో ఇండస్ట్రీ రచ్చ…

ఇక ఎన్నో అంచనాల నడుమ, భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లోనే ఏకంగా 18 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది. ఇక ఇంద్ర సినిమా విడుదలైన తొలి ఆటకే బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ తెచ్చుకుని, ఏకంగా 33 కోట్ల షేర్ ని అప్పట్లోనే వసూలు చేసింది. బిజినెస్ కి ఏకంగా 14 కోట్లకి పైగా ప్రాఫిట్ ని సొంతం చేసుకుని బయ్యర్లకి భారీ లాభాలు అందించింది. ఈ రికార్డులు బ్రేక్ చేయడానికి స్టార్ హీరోలకు నాలుగేళ్లు పట్టింది. ఇక బాక్స్ ఆఫీస్ వద్ద 30 కోట్ల షేర్ మార్క్ ని అందుకున్న తొలి సినిమాగా ఇంద్ర నిలిచింది.

థియేటర్లలో సిల్వర్ జూబ్లీ భీభత్సం…

ఇక బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్టన్లలోనే కాకుండా థియేటర్లలో కూడా ఇంద్ర ప్రభంజనం సృష్టించింది. లాంగ్ రన్ లో థియేటర్ల వద్ద జాతర సృష్టించిన ఇంద్ర సినిమా అప్పట్లోనే 229 సెంటర్స్ లో 50 రోజులు, 128 సెంటర్స్ లో 100 రోజులు ప్రదర్శింపబడింది. ఇక 32 సెంటర్స్ లో ఏకంగా 175 రోజులు ప్రదర్శింపబడి సిల్వర్ జూబ్లీ జరుపుకుంది. థియేటర్లలో ఈ లాంగ్ రన్ రికార్డుని కొన్ని సినిమాలు ఆ తర్వాత బ్రేక్ చేసినా, కలెక్షన్ల రికార్డులు బ్రేక్ చేయడానికి మాత్రం నాలుగేళ్ళ టైం పట్టింది. ఇక ఈ జెనరేషన్ చిరు ఫ్యాన్స్ ఇంద్ర రీ రిలీజ్ కోసం ఎంతగానో తపిస్తున్నారు.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు