Aay : భారీ ప్రాఫిట్ దిశగా మరో చిన్న సినిమా జోరు..

Aay : టాలీవుడ్ లో గత వారం పెద్ద సినిమాలతో పాటు “ఆయ్” అనే చిన్న సినిమా కూడా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అయితే పంద్రాగస్టులో ఆ పెద్ద సినిమాల ఊపు వల్ల తొలిరోజు ఈ సినిమాని అంతగా పట్టించుకోలేదు. కాని ఆ సినిమాలన్నీ నెగిటివ్ టాక్ తెచ్చుకోవడంతో, ప్రేక్షకుల కళ్ళు ఈ చిన్న సినిమాపై పడ్డాయి. అంతకు ముందు వారంలో రిలీజ్ అయిన కమిటీ కుర్రోళ్ళు, అలాగే ఈ వారం రిలీజ్ అయిన ఆయ్ సినిమాలకే ప్రేక్షకులు ఓటేశారు. ఇక ఆయ్ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ లో బన్నీ వాసు నిర్మించగా, కొత్త దర్శకుడు అంజి.కె. మణిపుత్ర డైరెక్టర్ గా పరిచయమయ్యాడు. ఇక ఆయ్ సినిమాలో నార్నే నితిన్ (Narne Nithin), నయన్ సారిక, వినోద్ కుమార్, మైమ్ మధు, కసిరెడ్డి రాజ్‌కుమార్, అంకిత్ కోయా తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.

Aay Movie 5days collections

చిన్న సినిమా కలెక్షన్ల జోరు…

ఇక తాజాగా ఆయ్ (Aay) సినిమా కలెక్షన్లలో రోజురోజుకు జోరు చూపిస్తుంది. తొలిరోజు పోటీ వల్ల అంతంత మాత్రంగానే కలెక్షన్లు వచ్చినా, రెండో రోజు నుండి మంచి గ్రోత్ చూపించింది ఆయ్. ఇక ఆయ్ సినిమా తాజా కల్లెక్షన్ల విషయానికి వస్తే, మొదటి నాలుగు రోజుల్లో మంచి నంబర్లు నమోదు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో 3.62 కోట్ల షేర్ రాబట్టగా, వరల్డ్ వైడ్ గా 3.90 కోట్ల షేర్, 6.95 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇక ఐదో రోజు కలెక్షన్లు కూడా కోటికి పైగానే ఉండే అవకాశం ఉంది. ఇక ఆయ్ సినిమా థియేట్రికల్ గా 3.25 కోట్ల బిజినెస్ చేయగా, 3.50 కోట్ల టార్గెట్ తో రిలీజ్ అయింది.

- Advertisement -

భారీ వసూళ్ల దిశగా ఆయ్..

కాగా ఇప్పటికే 40 లక్షల ప్రాఫిట్ తో ఉండగా తొలివారం ముగిసేసరికి డబుల్ ప్రాఫిట్ ని అందుకోవడం ఖాయమని చెప్పొచ్చు. ఇక ఇప్పటికే ఆయ్ చిత్ర యూనిట్ కి ఎన్టీఆర్ తన బెస్ట్ విషెస్ ని అందచేయగా, తాజాగా అల్లు అర్జున్ ఆయ్ సక్సెస్ సెలబ్రేషన్స్ కి విచ్చేయనున్నాడు. అయితే లాంగ్ రన్ లో ఈ సినిమా డబుల్ ప్రాఫిట్ ఖచ్చితంగా అందుకుంటుందనిపిస్తుంది. పైగా ఈ వారం కూడా పెద్దగా కొత్త సినిమాలు రిలీజ్ కావడం లేదు. చిరు ఇంద్ర రీ రిలీజ్ మాత్రమే ఉంది. ఇక కమిటీ కుర్రోళ్ళు ఇప్పటికే 10 కోట్లకి పైగా వసూలు చేయగా, ఆయ్ సినిమాకి కూడా కలిసొస్తే 10 కోట్ల వసూళ్లు తొలివారం ముగిసేసరికి రాబట్టే అవకాశం ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు