Aparichithudu : రీ రిలీజ్‌లో దుమ్ములేపిన కలెక్షన్లు… లిమిటెడ్ షోస్‌తోనే మాస్!

Aparichitudu : కోలీవుడ్ స్టార్ చియాన్ విక్రమ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. శివ పుత్రుడు, అపరిచితుడు, ఐ వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో సౌత్ ఇండియా ప్రేక్షకులని అలరిస్తూ, ప్రతి సినిమాకి కొత్త దనం చూపిస్తూ దూసుకుపోతున్నాడు. అయితే విక్రమ్ ని పాన్ ఇండియా స్టార్ గా మలిచిన సినిమా ఏదంటే అందరూ చెప్పే ఒకే ఒక్క సినిమా “అపరిచితుడు”. ఇండియన్ జేమ్స్ కామెరూన్ గా పేరున్న శంకర్ షణ్ముగం దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఆ రోజుల్లో సంచలన విజయం సాధించింది. అప్పటివరకు కోలీవుడ్ కే పరిమితమైన విక్రమ్ ని ఇండియా వైడ్ గా పాపులర్ చేసింది. 2005 లో శంకర్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ ‘అపరిచితుడు’ చిత్రాన్ని వి.రవిచంద్రన్ ఈ చిత్రాన్ని తన ఆస్కార్ ఫిలిమ్స్ బ్యానర్ పై నిర్మించాడు. అపరిచితుడు సినిమాతోనే విక్రమ్ కి తెలుగులో మార్కెట్ సుస్థిర ఏర్పడేలా చేసింది. అప్పటి నుండీ విక్రమ్ నటించిన అన్ని సినిమాలు తెలుగులో కూడా డబ్ అవుతూ వస్తున్నాయి. ఇక గత వారం అపరిచితుడు సినిమా థియేటర్లలో రీ రిలీజ్ కావడం జరిగింది. పెద్దగా హడావిడి లేకుండా రిలీజ్ అయ్యేసరికి జనాలు పట్టించుకోరని అనుకున్నారు నెటిజన్లు. కానీ లిమిటెడ్ రిలీజ్ లో కూడా వాటి కలెక్షన్లు చూస్తే జనాలు బాగానే వచ్చారని తెలుస్తుంది.

Aparichithudu Re release collections

ఇలాంటి పరిస్థితుల్లోనూ మంచి కలెక్షన్లు..

అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర పేరుకు సమ్మర్ అయినా కూడా అసలు సినిమాలే లేని పరిస్థితి నెలకొంది. రిలీజ్ అవుతున్న చిన్నా చితకా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర తీవ్రంగా నిరాశ పరిచే రిజల్ట్ ను సొంతం చేసుకోగా, ఇప్పుడు రీ రిలీజ్ లు కూడా పెద్దగా హోల్డ్ ని చూపించలేక పోతున్నాయి. కాగా ఇలాంటి టైంలో 18 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ మూవీ అపరిచితుడు (Aparichitudu) మూవీ తెలుగులో ఊహకందని బ్లాక్ బస్టర్ గా నిలవగా, ఆల్ మోస్ట్ 18 ఏళ్ల తర్వాత ఈ సినిమాను రీసెంట్ గా తెలుగు రాష్ట్రాల్లో రీ రిలీజ్ చేశారు. మొదటి రోజు చాలా లిమిటెడ్ రిలీజ్ లో ఓవరాల్ గా మంచి కలెక్షన్స్ ని సినిమా సొంతం చేసుకుంది. మొదటి రోజు ట్రాక్ చేసిన సెంటర్స్ లో ఆల్ మోస్ట్ 16 లక్షలకు పైగా గ్రాస్ ను సొంతం చేసుకున్న సినిమా బాక్స్ అఫీస్ దగ్గర వీకెండ్ అయిన తర్వాత కూడా లిమిటెడ్ షోలతో ఎంతో కొంత కలెక్షన్లు రాబట్టగా, ఓవరాల్ గా సినిమా ఇప్పటి వరకు 28 లక్షల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుందని సమాచారం. ఎన్నికలు, ఎండలు, ఐపీఎల్ సమస్యలున్నా ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఈ మాత్రం కలెక్షన్లు అంటే బెటరే అని చెప్పాలి.

- Advertisement -

తొందర్లోనే వరుస సినిమాలతో రెడీ..

మొత్తం మీద విక్రమ్ సినిమా (Aparichitudu) ఈ సమయంలో అసలు జనాలే థియేటర్స్ కి రాని ఈ పరిస్థితిలో ఇలాంటి కలెక్షన్లు, మంచి కలెక్షన్స్ అనే చెప్పాలి, అది కూడా ఒక డబ్బింగ్ మూవీ కి ఇలాంటి కలెక్షన్స్ ఇప్పుడు సొంతం అవ్వడం విశేషమే. ఇక ప్రస్తుతం విక్రమ్ తంగలాన్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. త్వరలోనే ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. అలాగే వీర ధీర, సూరన్ సినిమాలోనూ నటిస్తున్నాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు