ARM Collections : మలయాళంలో కుమ్ముతున్న క్రేజీ సినిమా!

ARM Collections : మలయాళ స్టార్ టోవినో థామస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. లూసిఫర్, మిన్నల్ మురళి వంటి సూపర్ హిట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమైన ఈ హీరో తాజాగా “అజయంతే రాండమ్ మోషణం” (ARM) అనే ప్రతిష్టాత్మక చిత్రంతో ప్రేక్షకులను పలకరించాడు. పీరియాడిక్ ఫాంటసీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా టోవినో థామస్ (Tovino Thamous) కెరీర్‌ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కగా, పాన్ ఇండియన్ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. కాగా గత గురువారం థియేటర్లలో విడుదలైన ఈ సినిమా థియేటర్లలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. అయితే తెలుగులో మాత్రం ఈ సినిమా ఆశించిన రెస్పాన్స్ తెచ్చుకోలేదు. తాజాగా ARM కలెక్షన్ల వివరాలు రాగా, వరల్డ్ వైడ్ కలెక్షన్ల వివరాలు ఇలా ఉన్నాయి.

ARM Movie 4days Collections

 

- Advertisement -

మలయాళంలో కుమ్ముతున్న సినిమా!

టోవినో థామస్ నటించిన ARM సినిమా థియేటర్లలో రిలీజ్ కాగా, ఈ సినిమాలో థామస్ మణియన్, కుంజిక్కేలు, అలాగే అజయన్ అంటూ మూడు రకాల పాత్రలను పోషించాడు. థియేటర్లలో ఈ సినిమా డీసెంట్ అన్న టాక్ ని తెచ్చుకోగా, తెలుగు రాష్ట్రాల్లో మత్తు వదలరా2 (Matthu Vadalara2) సినిమా ఊపు వల్ల ఈ సినిమాని అంతగా పట్టించుకోలేదు. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో వీకెండ్ లో 0.75 లక్షల గ్రాస్ మాత్రమే వసూలు చేసింది. షేర్ వ్యాల్యూ 35 లక్షలదాకా ఉంది. అయితే మలయాళంలో మాత్రం ఈ సినిమా సాలిడ్ వసూళ్లు సాధించింది. కేరళతో పాటు ఓవర్సీస్ లో భారీ కలెక్షన్లు వసూలు చేసింది.

వరల్డ్ వైడ్ గా 50 కోట్ల దిశగా సినిమా…

ఇక టువినో థామస్ నటించిన ARM ఈ సినిమా కేరళలో 13.50 కోట్ల వసూలు చేయగా, తెలుగు రాష్ట్రాల్లో 75 లక్షలు, రెస్ట్ అఫ్ ఇండియా లో 1.90 లక్షలు, ఓవర్సీస్ లో అత్యధికంగా 15.60 కోట్లు వసూలు చేయగా, వరల్డ్ వైడ్ గా 31.75 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. 14.50 కోట్ల షేర్ వసూలు చేసింది. అయితే ఈ వసూళ్లు (ARM Collections) సరిపోదని తెలుస్తుంది. సినిమాపై ఉన్న అంచనాల ప్రకారం ఈ సినిమా వంద కోట్ల వసూళ్ళని అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక మొదటి వారం ఈ సినిమా 50 కోట్ల వసూళ్లు అందుకునే ఛాన్స్ ఉంది.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు