BadNewz : చెత్త సినిమాకు భారీ ఓపెనింగ్స్.. ఈ బాలీవుడ్ ఆడియన్స్ ఎప్పటికీ అర్ధంకాలేరు?

BadNewz : బాలీవుడ్ లో గత కొంతకాలంగా పెద్ద సినిమాలు అంతగా ఆడడం లేదన్న సంగతి తెలిసిందే. మంచి స్క్రిప్ట్ లు లేని సినిమాలు తీయడం ఒకటి అయితే, బాలీవుడ్ స్టార్స్ మీద ఫ్యాన్స్ వ్యతిరేకత ఒక కారణం. లాక్ డౌన్ నుండి కూడా ఈ సమస్య ఉంది. అయితే లాస్ట్ ఇయర్ నుండే బాలీవుడ్ కాస్త ట్రాక్ లో పడిందని సంతోషించే లోపే మళ్ళీ ఈ ఇయర్ వరుస ప్లాప్ లు ఎదురయ్యాయి. స్టార్ హీరోలు నటించిన సినిమాలఅయినా, మంచి కథాంశం ఉన్న సినిమాలైనా బాలీవుడ్ ఆడియన్స్ దెబ్బేస్తున్నారు. కానీ రీసెంట్ గా పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన ఓ చిన్న సినిమాకు మాత్రం బాలీవుడ్ లో భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. చిన్న సినిమా అనడం కన్నా ఇంకా చెత్త సినిమా అనడం సబబుగా ఉంటుందేమో.

BadNewz movie got worst talk and got solid openings

చెత్త సినిమాకి భారీ ఓపెనింగ్స్.. మంచి సినిమాని గాలికొదిలేశారు…

అయితే అసలు విషయానికి వస్తే… లేటెస్ట్ గా ఈ శుక్రవారం బ్యాడ్ న్యూస్ అనే చిన్న సినిమా విడుదలైంది. ఆ సినిమాకి తొలిరోజే నెగిటివ్ టాక్ వచ్చింది. అయినా బాలీవుడ్ లో భారీ ఓపెనింగ్స్ దక్కాయి. తొలిరోజే ఈ సినిమాకు 8.7 కోట్ల ఓపెనింగ్స్ రాగా, మూడు రోజుల్లో 30 కోట్లు వచ్చాయని సమాచారం. విక్కీ కౌశ‌ల్, త్రిప్తి దిమ్రీ, అమీ విర్క్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన బ్యాడ్ న్యూజ్ సినిమా స్టోరీ కూడా ఏమాత్రం మెప్పించదు. సినిమాలో చాలాభాగం అడ‌ల్ట్ కామెడీ, శృంగార సన్నివేశాల‌తో నింపేసారట. మితిమీరిన శృంగారం సీన్ల వల్ల క్రిటిక్స్ చిత్ర యూనిట్ ని ఏకిపారేశారు. కానీ బాలీవుడ్ జనాలు మాత్రం ఈ సినిమాకే ఓటేస్తున్నారు. కానీ గత వారం మంచి కాన్సెప్ట్ తో ఆకాశమే నీ హద్దురా రీమేక్ సర్ఫిరా కి మంచి టాక్ వచ్చింది. విమర్శకుల ప్రశంసలు సైతం లభించాయి. కానీ ఆ సినిమాకి బాలీవుడ్ జనాలు దెబ్బేసారు. ఆ సినిమాకి వీకెండ్ లో కనీసం 15 కోట్లు కూడా రాలేదు.

- Advertisement -

బాలీవుడ్ జనాల టేస్ట్ ఎప్పటికీ అర్ధం కాదు?

అయితే బాలీవుడ్ లో చెత్త టాక్ తెచ్చుకున్న బ్యాడ్ న్యూస్ లాంటి సినిమాలని ఆదరించడం ఏంటో, మంచి టాక్ తెచ్చుకున్న సర్ఫిరా ని పక్కకి నెట్టడం ఏంటో అని కొందరు నెటిజన్లు అంటున్నారు. ఓ దశలో సౌత్ నుండి విడుదలయ్యే సినిమాలను కూడా బాగానే ఆదరిస్తున్నారు. కానీ బాలీవుడ్ లో బోల్డ్ కంటెంట్ ఉన్న చెత్త సినిమాలను ఎంకరేజ్ చేయడం ఏంటో అర్ధం కావట్లేదని విమర్శకులు అంటున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు