Bhaje Vaayuvegam : మూడెంట్లో బెటర్ టాక్.. అయినా ఫస్ట్ డే దెబ్బ బడింది..

Bhaje Vaayuvegam : టాలీవుడ్ లో ఈ వారం మూడు సినిమాలు రిలీజ్ అయ్యాయన్న సంగతి తెలిసిందే. మూడింటికి జనాల్లో మంచి ఆసక్తి నెలకొని ఉంది. ఆ సినిమాల్లో భజే వాయువేగం ఒకటి. లాస్ట్ ఇయర్ బాక్స్ అఫీస్ దగ్గర బెదురులంక2012 సినిమాతో మంచి హిట్ ను సొంతం చేసుకున్న యంగ్ హీరో కార్తికేయ ఆ సినిమా తర్వాత ఆడియన్స్ ముందుకు ఇప్పుడు “భజే వాయు వేగం” (Bhaje VaayuVegam) సినిమాతో రాగా, మూడు సినిమాల మధ్య పోటిలో రిలీజ్ అయిన ఈ సినిమా ఉన్నంతలో టాక్ పరంగా చూసుకుంటే వాటి కంటే బెటర్ టాక్ ను సొంతం చేసుకుంది. దాంతో ఓపెనింగ్స్ స్లో గా ఉన్నా డే ఎండ్ అయ్యే టైంకి పుంజుకుంటుంది అనుకున్నా, ఫస్ట్ డే ఎండ్ అయ్యే టైంకి మూడు సినిమాల్లో బెటర్ టాక్ ఉన్నా కూడా వీక్ కలెక్షన్స్ ని ఫస్ట్ డే సొంతం చేసుకుంది. మొదటి షో కి అంతగా లేకపోయినా పాజిటివ్ టాక్ వల్ల ఈవినింగ్ షో లలో పుంజుకుంటుంది అనుకున్నా అంతగా గ్రోత్ రాలేదు.

Bhaje Vaayuvegam First day collections

లోయెస్ట్ ఓపెనింగ్స్ అందుకున్న భజేవాయువేగం..

ఇక మొత్తం మీద భజే వాయువేగం సినిమా కి బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు 6 వేల రేంజ్ లోనే టికెట్ సేల్స్ జరిగాయి. దాంతో మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద 32 – 35 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా, గ్రాస్ లెక్క 70 లక్షల రేంజ్ లో ఉండగా, వరల్డ్ వైడ్ గా సినిమా 45 లక్షలకు పైగా షేర్ ని సొంతం చేసుకున్న సినిమా,వరల్డ్ వైడ్ గ్రాస్ 1 కోటి రేంజ్ లో సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా మంచి టాక్ తో కూడా బిలో యావరేజ్ కలెక్షన్స్ ని అందుకోగా, సినిమా వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 4 కోట్ల దాకా ఉండగా సినిమా మిగిలిన రన్ లో ఇంకా 3.55 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది.

- Advertisement -

వీకెండ్ లో గ్రోత్ చూపిస్తుందా?

ఇక భజే వాయువేగం (Bhaje Vaayuvegam) లో కార్తికేయ హీరోగా నటించగా, ఐశ్వర్య మీనన్ హీరోయిన్ ఆ నటించిన సంగతి తెలిసిందే. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా శుక్రవారం గ్యాంగ్స్ అఫ్ గోదావరి, గం గం గణేశా సినిమాలతో పోటీగా రిలీజ్ కాగా, రెండింటికంటే బెటర్ టాక్ ఈ సినిమాకు వచ్చినా అంచనాల పరంగా దెబ్బ కొట్టింది. మొత్తం మీద మూడు సినిమాల్లో బెటర్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా ఓపెనింగ్స్ కొంచం వీక్ గా ఉన్నా కూడా పాజిటివ్ టాక్ పవర్ తో పుంజుకుని వీకెండ్ లో జోరు చూపించే అవకాశం ఉంది. మరి సినిమా వీకెండ్ అయ్యాక ఎలాంటి కలెక్షన్స్ తో హోల్డ్ ని చూపిస్తుందో చూడాలి. ఇక ఈ వీకెండ్ లో భజేవాయువేగం కనీసం 60 శాతం వసూళ్ళని టార్గెట్ లో అందుకుంటేనే బ్రేక్ ఈవెన్ గురించి ఒక అంచనాకి రాగలం. దాంతో పాటు ఇతర సినిమాల నుండి పోటీ లో తట్టుకుని మంచి గ్రోత్ చూపించాల్సి ఉంటుంది. మరి చూడాలి శనివారం వసూళ్లు ఎలా ఉంటాయో.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు