Bharateeyudu2 Collections : ఫ్యాన్స్ కి షాకిచ్చిన భారతీయుడు2 కలెక్షన్లు.. నిరాశలో మేకర్స్

Bharateeyudu2 Collections : లోకనాయకుడు కమల్ హాసన్ శంకర్ షణ్ముగం కాంబినేషన్ లో తెరకెక్కిన పాన్ ఇండియా సినిమా ఇండియన్2 ఎట్టకేలకు జులై 12 న భారీ ఎత్తున విడుదలైంది. పాన్ ఇండియా భాషల్లో విడుదలైన ఈ సినిమా తెలుగులో భారతీయులు2 పేరుతో విడుదలైన విషయం తెలిసిందే. ఇక కమల్ ఫ్యాన్స్ ప్రీమియర్స్ షోలకే థియేటర్ల ఎగబడ్డారు. శంకర్ కమల్ హాసన్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఇండియన్ సినిమాకి సీక్వెల్ గా ఇండియన్2 మూవీ తెరకెక్కిన సంగతి తెలిసిందే. అయితే భారతీయుడు2 (Bharateeyudu2) సినిమాకి ఆశించినంత రెస్పాన్స్ మాత్రం థియేటర్ల వద్ద రాలేదు. అన్ని చోట్లా మిశ్రమ స్పందన తెచ్చుకోగా, టాక్ ని బట్టి కలెక్షన్ల లెక్క పూర్తిగా మారిపోయింది. ఈ సీక్వెల్ సినిమాకి ముందునుండే ఆశించినంత హైప్ లేకపోగా, రిలీజ్ తరవాత టాక్ ఆల్మోస్ట్ బీలో యావరేజ్ టాక్ రావడంతో, ఆ రెస్పాన్స్ సినిమా ఓపెనింగ్స్ పై పడింది.

Bharateeyudu2 Movie 1st day collections update

షాకిచ్చిన భారతీయుడు2 ఓపెనింగ్స్…

ఇక భారతీయుడు2 సినిమాకి రిలీజ్ కి ముందు అంత బజ్ లేకపోగా, ట్రైలర్ తరవాత కొంత మేర నమ్మకం కలిగింది. అయితే కంటెంట్ తో మంచి మౌత్ టాక్ తెచ్చుకుని పుంజుకుంటుందని అనుకున్నా, టాక్ బీలో యావరేజ్ గా ఉండడంతో ఓపెనింగ్స్ పై ప్రభావం గట్టిగా పడింది. ఇక ప్రీమియర్స్ కి బుకింగ్స్ కూడా 7 నుండి 8 కోట్ల మధ్య ఉండగా, తెలుగు రాష్ట్రాల్లో కూడా పది కోట్ల లోపే బుకింగ్స్ జరిగాయి. ఇక తమిళ నాడు లో 15 కోట్ల వరకు బుకింగ్స్ జరగగా, అన్ని ఏరియాల్లో, అన్గాన్ని భాషల్లో కూడా కలిపి 50 నుండి 55 కోట్ల రేంజ్ లో గ్రాస్ ఓపెనింగ్స్ ని భారతీయుడు2 సినిమా అందుకోవచ్చని సమాచారం. ఇది కమల్ హాసన్, శంకర్ మార్కెట్ కి తక్కువే అని చెప్పాలి. కానీ ఇది బుకింగ్స్ ని బట్టి వేసిన అంచనా. అన్నీ బాగుంది ఆఫ్ లైన్ లెక్కలు గనుక బాగుండి థియేటర్లు బాగా తెగితే మరో పది కోట్ల వరకు ఎక్కువగా రావచ్చని సమాచారం.

- Advertisement -

నిరాశలో భారతీయుడు2 మేకర్స్…

ఇక భారతీయుడు సినిమాకి సీక్వెల్ సినిమా దాదాపు 28 యేళ్ళ తర్వాత తెరకెక్కగా ఈ సినిమాపై అంతగా ఆసక్తి జనాల్లో రాలేదు. పైగా శంకర్ గత సినిమాల ప్రభావం దీనిపై పడింది. అందుకే ఓపెనింగ్స్ పై గట్టి ప్రభావం పడిందని చెప్పాలి. ఇక కమల్ హాసన్ సేనాపతి గా పూర్తి న్యాయం చేసినా బాక్స్ ఆఫీస్ వద్ద ఆడియన్స్ నిరాశ పడడంతో ఓపెనింగ్స్ పై దెబ్బ పడింది. ఇక బోరింగ్ స్క్రీన్ ప్లే వల్ల ఇండియన్2 సినిమాని సాగదీశారని, సినిమాలో సేనాపతి ఎంట్రీ కూడా ఆలస్యంగా ఉందని, కమల్ కన్నా ఎక్కువ సేపు సిద్ధార్థ్ ఉంటాడని అందువల్ల ఫ్యాన్స్ డిస్సపాయింట్ అయ్యారని దాని వల్లే సినిమాకి ఈ నెగిటివ్ రెస్పాన్స్ వచ్చిందని అంటున్నారు. అన్నిటికి మించి కమల్ సినిమాల్లో ఉండే ఎమోషన్స్ ఈ సినిమాలో అస్సలు లేవని అంటున్నారు నెటిజన్లు. మరి ఫైనల్ గా మొదటి రోజు కలెక్షన్ల అఫిషియల్ లెక్క ఏమైనా మారుతుందో లేదో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు