KA Movie : కిరణ్ అబ్బవరం కెరియర్‌లోనే ఇదే హైయెస్ట్ భయ్యా… మరీ ఇన్ని కోట్ల బిజినెసా..?

Ka Movie: కిరణ్ అబ్బవరం ఈ హీరో గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కిరణ్ హీరోగా రాజా వారు రాణి గారు సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఇక గతేడాది మీటర్, రూల్స్ రంజన్ సినిమాల్లో నటించారు. కానీ ఆ సినిమాలు డిజాస్టర్లుగా నిలిచాయి. ఈ సినిమాలలో కథ, కథనాలతో పాటు కిరణ్ అబ్బవరం క్యారెక్టర్ పై దారుణంగా నెగిటివ్ కామెంట్లు చేశారు.

ఇక అప్పటి నుంచి కిరణ్ సినిమాల కథ ఎంపిక విషయంలో తన రూట్ మార్చేశాడు. ఇప్పుడు ఏకంగా కొత్త పాయింట్ తో ‘ అనే సినిమా చేస్తున్నాడు. ‘క’ సినిమాతో సుజిత్, సందీప్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాతోనే వీరిద్దరూ డైరెక్టర్లుగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా జరుపుతున్నారు. ఇక ఈ సినిమా తెలుగుతోపాటు మలయాళం, తమిళం, కన్నడ భాషల్లో ‘క’ సినిమా రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉంది.

శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై చింత గోపాలకృష్ణారెడ్డి ‘క’ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇక విరూపాక్ష సినిమా టైప్ మిస్టీరియస్ థ్రిల్లర్ నేపథ్యంలో రాబోతున్న ‘క’ సినిమా థియేటర్ బిజినెస్ కి సైతం మంచి క్రేజ్ ఏర్పడింది. తాజాగా 30 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్టు సమాచారం. ఇక ఈ మూవీ థియేట్రికల్ రైట్స్ అమ్మకాలు దాదాపుగా పూర్తయ్యాయి. పొలిమేర-3 నిర్మాత నందిపాటి వంశీ రెడ్డి తెలుగు రాష్ట్రాల హక్కులను కొనుగోలు చేసినట్లు సమాచారం.

- Advertisement -

ఈ సినిమా హక్కులను 13 కోట్ల రూపాయల నుంచి బేరం మొదలుపెట్టగా…. మొత్తానికి 12 కోట్లతో డీల్ ఓకే అయినట్లు ఇండస్ట్రీవర్గాల్లో టాక్ నడుస్తోంది. అలాగే ఇతర భాషలకు థియేట్రికల్ హక్కులతో పాటు…. అన్ని భాషల్లో నాన్-థియేట్రికల్ హక్కులు రూ.18 కోట్లకు అమ్ముడుపోయినట్లు సమాచారం అందుతుంది. కిరణ్ అబ్బవరం చేస్తున్న ఈ సినిమా కథ బాగుంటుందని ఊహించి.. ఇలాంటి రిజల్ట్‌ ఉందని అంటున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు