Deadpool & Wolverine : రాయన్ ని పూర్తిగా దెబ్బకొడుతున్న హాలీవుడ్ మూవీ..

Deadpool & Wolverine : హాలీవుడ్ లో ఈ మధ్య కాలంలో భారీ అంచనాలతో వచ్చిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఏదో కొన్ని అనిమేషన్ సినిమాలే బాగా ఆడాయి. ముఖ్యంగా మార్వెల్ సిరీస్ లో వచ్చిన గత రెండు మూడు సినిమాలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి. ఈ క్రమంలో మార్వెల్ సిరీస్ లో రెండు క్రేజీ పాత్రలైన డెడ్ పూల్, వోల్వోరైన్ పాత్రల్ని కలిపి మల్టి స్టారర్ గా తొలి సినిమా తీశారు మార్వెల్ మేకర్స్. ఇక ఆ మధ్య ట్రైలర్ రిలీజ్ అయినప్పుడే సినిమాపై భారీ అంచనాలు ఏర్పడగా, లేటెస్ట్ గా ఈ శుక్రవారం భారీ అంచనాల నడుమ డెడ్ పూల్ & వోల్వోరైన్ సినిమా థియేటర్లలో భారీ ఎత్తున విడుదలైంది. ఇక ప్రీమియర్స్ నుండే ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రాగా ఈ హాలీవుడ్ సినిమాకు ఇండియా లో కూడా ఓ రేంజ్ లో ఓపెనింగ్స్ వచ్చాయి.

Deadpool & Wolverine First day india collections

భారీ ఓపెనింగ్స్ సాధించిన డెడ్ పూల్ & వోల్వోరైన్..

ఇక ఇండియాలో ఈ మాదే కాలంలో వచ్చిన హాలీవుడ్ సినిమాలకు పెద్దగా ఓపెనింగ్స్ రాలేదు. లాస్ట్ రెండేళ్ల కింద అవతార్2 వచ్చాక, ఆ రేంజ్ లో భారీ ఓపెనింగ్స్ సాధించింది ఈ మర్వెల్ సిరీస్ మూవీ. ఇండియాలో ఏకంగా 26 కోట్ల గ్రాస్ ని వసూలు చేయడం విశేషం. డెడ్ పూల్ అండ్ వుల్వరిన్ (Deadpool & Wovlerine) సినిమా ఇండియాలో ఏ సెంటర్ల ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకోగా, రీసెంట్ గా వచ్చిన మార్వెల్ మూవీస్ కంటే చాలా బెటర్ గా ఓపెనింగ్స్ అందుకుంది.

- Advertisement -

రాయన్ ని దెబ్బ కొట్టిన హాలీవుడ్ సినిమా…

ఇక ఈ శుక్రవారం కోలీవుడ్ స్టార్ ధనుష్ నటించిన రాయన్ సినిమా కూడా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా 20 కోట్ల వరకే గ్రాస్ వసూలు చేయగా, ఇండియాలో అయితే 15 కోట్ల వరకు రాబట్టింది. అయితే కేవలం మల్టీ ప్లెక్స్ థియేటర్లతోనే డెడ్ పూల్ & వోల్వోరైన్ సినిమా రాయన్ ని బీట్ చేయడమే కాకుండా, మల్టి ప్లెక్స్ లో దారుణంగా దెబ్బ కొట్టింది ఈ సినిమా. ఇక డెడ్ పూల్ వోల్వోరైన్ సినిమా వరల్డ్ వైడ్ గా కూడా అన్ని చోట్లా మొదటి రోజు ప్రీమియర్స్ తో కలిపి ఫస్ట్ డే 100 మిలియన్ డాలర్స్ కి పైగా వసూలు చేసినట్టు అంచనా.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు