Deadpool and Wolverine : మార్వెల్ సిరీస్ కి రికార్డ్ కలెక్షన్స్.. ఏకంగా వాటిని మించిపోయింది..

Deadpool & Wolverine : హాలీవుడ్ లో మార్వెల్ సిరీస్ కి ఉండే క్రేజే వేరు. గత పదిహేనేళ్లలో ఈ సిరీస్ నుండి రికార్డ్ బ్రేకింగ్ మూవీస్ వచ్చాయి. అయితే అవెంజర్స్ ఎండ్ గేమ్ వచ్చాక మార్వెల్ మూవీస్ నుండి వచ్చిన సినిమాలు ఆశించినంత ఆకట్టుకోలేదు. బ్లాక్ పాంథర్ సీక్వెల్ ఒక్కటే కాస్త మెప్పించింది. అయితే మార్వెల్ సిరీస్ లో రెండు క్రేజీ పాత్రలైన డెడ్ పూల్, వోల్వోరైన్ పాత్రల్ని కలిపి మల్టి స్టారర్ గా రీసెంట్ గా సినిమా తీశారు మేకర్స్. డెడ్ పూల్ & వోల్వోరైన్ పేరుతో విడుదలైన టీజర్, ట్రైలర్స్ ఎంత ట్రెండ్ అయ్యాయో తెలిసిందే. ఇక ఈ సినిమా కూడా గత వారం థియేటర్లలో విడుదలై అంచనాలకు తగ్గట్టుగానే మంచి రెస్పాన్స్ తెచ్చుకోగా, కలెక్షన్లలో అంచనాలను మించి భారీ వసూళ్లు సాధిస్తుంది. ఒక రకంగా ఇండియన్ మూవీస్ కి ధీటుగా ఈ సినిమా కలెక్షన్లు వస్తున్నాయని చెప్పొచ్చు.

తొలివారం డెడ్ పూల్ & వోల్వోరైన్ కు రికార్డ్ ఓపెనింగ్స్…

ఇక మార్వెల్ స్టూడియో సినిమాలంటే ఇండియాలోనూ సాలిడ్ క్రేజ్ ఉంటుంది. ఈ బ్యానర్ నుంచి లేటెస్ట్ గా వ‌చ్చిన డెడ్ పూల్ & వోల్వ‌రైన్ (Deadpool & Wolverine) సినిమా ఇండియాలో అద‌రిపోయే ఓపెనింగ్స్ సాధించింది. తొలిరోజే ఏకంగా ఇండియాలో 21 కోట్ల గ్రాస్ వసూలు చేయడం విశేషం. అది కూడా కేవలం మల్టి ప్లెక్స్ ఆడియన్స్ తో కావడం విశేషం. అవెంజ‌ర్స్ త‌రువాత ఆ స్థాయిలో ప్రేక్ష‌కులు ఎంజాయ్ చేస్తున్న మార్వెల్ మూవీ ఇది. ఇక ఇండియాలో ఈ సినిమా తొలి వారం భారీ కలెక్షన్లు రాబట్టింది. ఇండియా లో తొలివారం మొత్తం మీద ఏకంగా 113.23 కోట్ల నెట్ కలెక్షన్స్ తో డెడ్ పూల్ & వోల్వ‌రైన్ మూవీ రికార్డ్ క్రియేట్ చేసింది.

Deadpool & Wolverine Movie First week India collections

- Advertisement -

ఇండియన్ సినిమాలని మించి ఓపెనింగ్స్…

అయితే ఇండియాలో గత వారం రిలీజ్ అయిన సినిమాల్లో ఇతర భాషల్లో పెద్దగా ఏ సినిమాలు కూడా మంచి టాక్ తెచ్చుకోకపోగా, తొలివారం కలెక్షన్లలో పెద్దగా నంబర్లు నమోదు చేయలేదు. లాస్ట్ వీక్ రిలీజ్ అయిన సినిమాల్లో ఇండియాలో వారం రోజుల్లో అత్యధిక వసూళ్లు అందుకుంది ధనుష్ ‘రాయన్’ సినిమానే. ఈ సినిమా తొలివారం 101 కోట్ల గ్రాస్ రాబట్టింది. అది కూడా వరల్డ్ వైడ్ గా కలిపి. ఇండియాలో 80 కోట్ల వసూళ్లు ఉండొచ్చు. దీంతో డెడ్ పూల్ & వోల్వ‌రైన్ ఇండియన్ మూవీస్ ని బీట్ చేసిందని చెప్పాలి. లాంగ్ రన్ లో ఇండియాలో డెడ్ పూల్ & వోల్వ‌రైన్ సినిమా 200 కోట్ల వరకు వసూలు చేయవచ్చని అంచనా. ఇక డెడ్ పూల్ & వోల్వ‌రైన్ వరల్డ్ వైడ్ గా తొలి ఐదు రోజుల్లోనే 4650 కోట్ల గ్రాస్ రాబట్టగా, తొలివారం కలెక్షన్లు అప్డేట్ చేయాల్సి ఉంది. బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ అంచనా ప్రకారం 5400 కోట్ల గ్రాస్ అని సమాచారం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు