Bharateeyudu 2 : భారతీయుడు 2 బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఎంత రాబట్టాలో తెలుసా?

Bharateeyudu 2 : లోకనాయకుడు కమల్ హాసన్, శంకర్ కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ భారతీయుడు 2.. ఈ సినిమా దేశవ్యాప్తంగా జూలై 12 న విడుదలైంది.. భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ మొదటి షోతోనే నిరాశ పరిచింది.. మిక్సీ్డ్ టాక్ అందుకుంది.. ఈ సినిమాకోసం వెయిట్ ఫ్యాన్స్ కు ఇది మింగుడు పడటంలేదని తెలిసిందే.. ఈ సినిమా కలెక్షన్స్ కూడా దారుణంగా పడిపోయినట్లు తెలుస్తుంది.. ఇక కలెక్షన్స్ పెంచుకోవడం కోసం సినిమా టైం ను కూడా తగ్గించినట్లు తెలుస్తుంది.. అయితే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఎంత కలెక్షన్స్ రాబట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం..

27 ఏళ్ల క్రితం వచ్చిన భారతీయుడు సినిమా కు సీక్వెల్ గా ఈ సినిమా విడుదల అయ్యింది.. అప్పట్లో వచ్చిన సినిమా ఎంతగా హిట్ ను అందుకుందో తెలిసిందే.. ఇప్పుడు వచ్చిన సినిమాకు అంత బజ్ రాలేదు..కలెక్షన్స్ మరీ దారుణంగా పడిపోయాయి. సినిమా టాక్ తో సంబంధం లేకుండా ఫస్ట్ డే భారీగా ఓపెనింగ్స్ వచ్చాయి. రెండో రోజు కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టింది. ఆ తర్వాత అంతగా అందుకోలేదు. అటు తమిళ్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగింది.

Do you know how much Bharateeyudu 2 needs to break even?
Do you know how much Bharateeyudu 2 needs to break even?

ఇక తెలుగులో ఈ సినిమాకి రూ.24.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కోసం రూ.25 కోట్లు షేర్ ను రాబట్టాలి. ఐదు రోజులకు రూ.13.3 కోట్ల షేర్స్ ను రాబట్టింది.. ఇంకా కలెక్షన్స్ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే మాత్రం రూ. 11.7 కోట్లను రాబట్టాలి.. ఇంత వసూల్ చేస్తుందనే నమ్మకం లేదు. అందుకే సినిమాను జనాలు చూసేందుకు శంకర్ కొత్త ప్లాన్ చేస్తున్నారు. ఎటు చూసినా ఈ సినిమా అంతగా సక్సెస్ ను అందుకోలేదని తెలుస్తుంది.. ఇదిలా ఉండగా .. ఇప్పుడు భారతీయుడు 3 సినిమా అప్డేట్స్ ను మేకర్స్ వదులుతున్నారు. మరి ఆ సినిమా అన్నా జనాల అంచనాలను రీచ్ అవుతుందేమో చూడాలి..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు